Begin typing your search above and press return to search.

పైకి గంభీరంగా కనిపించే విజయ్ లో కూడా ఆ భయం ఉందా?

టాలీవుడ్ మోస్ట్ క్యూట్ కపుల్ విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న లవ్ అండ్ మ్యారేజ్ స్టోరీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.

By:  Madhu Reddy   |   22 Oct 2026 1:30 PM IST
పైకి గంభీరంగా కనిపించే విజయ్ లో కూడా ఆ భయం ఉందా?
X

టాలీవుడ్ మోస్ట్ క్యూట్ కపుల్ విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న లవ్ అండ్ మ్యారేజ్ స్టోరీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. కొన్నాళ్ల పాటు ప్రేమలో ఉన్న ఈ జంట ఎప్పుడెప్పుడా అని ఎదురుచూసిన పెళ్లి బంధంతో ఫిబ్రవరి 2026లో ఒక్కటయ్యారు. అయితే వీరి వివాహం వెనుక ఒక ఆసక్తికరమైన లవ్ సీక్రెట్ ఉందట. తాజాగా 'కాఫీ విత్ కరణ్ సీజన్ 9' షోలో పాల్గొన్న ఈ లవ్ బర్డ్స్ తమ పెళ్లికి సంబంధించిన బిగ్ సీక్రెట్స్‌ను రివీల్ చేశారు. ఆ విశేషాలు ఇప్పుడు చూద్దాం..

పెళ్లి కోసం ఏడాది పాటు రోజూ అడిగిన రష్మిక:

ఇంట్లో పెళ్లి గురించి ప్రస్తావన వచ్చినప్పుడు రష్మిక ఏ మాత్రం ఆలోచించకుండా తాను పెళ్లికి సిద్ధంగా ఉన్నానని చెప్పారట. "మహిళలు చాలా త్వరగా పరిణతి చెందుతారు, వారికి అన్నీ ముందే తెలుస్తాయి" అని విజయ్ కూడా ఈ విషయాన్ని ఒప్పుకున్నారు. అయితే రష్మిక వెంటనే పెళ్లికి రెడీ అయినప్పటికీ, విజయ్ మాత్రం వెంటనే ఓకే చెప్పలేదట. పెళ్లి ప్రస్తావన తెచ్చినప్పుడు "నన్ను ఒక వంద సార్లు అడుగు" అని విజయ్ చెప్పడంతో, రష్మిక ఏకంగా ఏడాది పాటు ప్రతిరోజూ అదే ప్రశ్న అడుగుతూనే వచ్చిందట.

రిలేషన్‌షిప్‌ను పరీక్షించుకున్న విజయ్:

పెళ్లి అనేది కేవలం ఒక భావోద్వేగంతో తీసుకునే చిన్న నిర్ణయం కాదని విజయ్ భావించారట. కెరీర్ ఒత్తిళ్లు, కష్టమైన రోజులు, జీవితంలో వచ్చే ఒడుదొడుకులను తమ బంధం ఎలా తట్టుకుంటుందో చూసి పరీక్షించుకోవాలనుకున్నానని విజయ్ చెప్పారు. "పరిస్థితులు ఎలా మారినా పెళ్లి అనే బంధం ముఖ్యం అనిపించినప్పుడే ముందుకు వెళ్లాలని భావించాను" అని ఆయన తెలిపారు. ఇక విజయ్‌పై తన ప్రేమ ఎప్పుడూ తగ్గదని, రోజూ అదే ప్రేమతో అడుగుతూనే ఉంటానని రష్మిక సరదాగా చెప్పారు. తాను పక్కా రొమాంటిక్ పర్సన్ అని తెలిపారు.

గంభీరంగా కనిపించే విజయ్‌లో ఆ భయం:

తాను బయటకు మాస్‌గా కనిపించినా, లోపల చాలా సెన్సిటివ్ అని విజయ్ దేవరకొండ స్వయంగా తెలిపారు. "నేను చాలా సున్నితమైన మనసున్న వ్యక్తిని. ఒకవేళ గాయపడితే ఆ నొప్పి చాలా తీవ్రంగా ఉంటుంది. ఆ భయం కారణంగానే నన్ను నేను కాపాడుకోవడానికి చాలా జాగ్రత్తపడ్డాను. నా ఆ రక్షణ ధోరణిని రష్మిక కొంతకాలం భరించాల్సి వచ్చింది" అంటూ తన మనసులోని అసలైన భావాలను అందరితో పంచుకున్నారు.

ఇటలీ ట్రిప్ మిస్సయినా.. ఉదయ్‌పూర్‌లో గ్రాండ్ ప్రపోజల్:

నిజానికి డిసెంబర్‌లో ఇటలీ ట్రిప్‌లో రష్మికకు ప్రపోజ్ చేయాలని విజయ్ ప్లాన్ చేసుకున్నారట. కానీ తనకున్న కొన్ని సందేహాల వల్ల ఆ సమయం కుదరలేదు. చివరకు వారి వివాహ వేడుకలు జరిగిన ఉదయ్‌పూర్‌ వేదికగానే తన మనసులోని మాటను చెప్పి రష్మికకు అద్భుతమైన రొమాంటిక్ సర్‌ప్రైజ్ ఇచ్చారు. ఇక ఆమె ఆ మూమెంట్‌ను మిస్ కాకూడదనే ఉద్దేశంతోనే ఈ ప్లాన్ చేసినట్లు విజయ్ తెలిపారు.

ఇక మొత్తానికి చూస్తే, రష్మిక ప్రేమపై ఉన్న నమ్మకం, విజయ్ చూపించిన ప్లానింగ్ లవ్ కలిసి ఈ జంటను విజయవంతంగా పెళ్లి పీటలెక్కిలా చేశాయి. భయాలను దాటి ఒకరినొకరు పూర్తిగా అర్థం చేసుకుని ఒక్కటైన ఈ జంట ప్రయాణం అభిమానులకు ఎంతో స్ఫూర్తినిస్తోంది.