విజయ్ రష్మిక.. ఆ పెట్టుబడి వెనుక అసలు ప్లాన్ ఇదేనా..
టాలీవుడ్ నుంచి బాలీవుడ్ దాకా ప్రస్తుతం విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న జంటకు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.
By: M Prashanth | 1 Oct 2026 6:20 PM ISTటాలీవుడ్ నుంచి బాలీవుడ్ దాకా ప్రస్తుతం విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న జంటకు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. సోషల్ మీడియాలో వీరికి ఉన్న ఫాలోయింగ్ తో వీళ్ల బ్రాండ్ వాల్యూ అమాంతం పెరిగిపోయింది. ఒక చిన్న ట్వీట్ వేసినా ఫోటో పెట్టినా క్షణాల్లో వైరల్ అవుతుంది. గతంలో ఒక బ్రాండ్ ప్రమోషన్ కోసం వీళ్లిద్దరూ కలిసి చేసిన యాడ్ ఎంత పెద్ద రీచ్ తెచ్చుకుందో ట్రేడ్ వర్గాలకు బాగా తెలుసు. ఇండియాలో టాప్ సెలబ్రెటీ కపుల్స్ లో ఒకరిగా మంచి గుర్తింపు అందుకుంటున్నారు.
ఇప్పుడు ఈ హిట్ పెయిర్ ఒక భారీ పెట్టుబడితో ఒక ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ సెట్ చేసుకున్నట్లు తెలుస్తోంది. హైదరాబాద్ లోని ఓ ప్రముఖ రాజకీయ నాయకుడి బంధువు నిర్మిస్తున్న అత్యంత ఖరీదైన ఎక్స్ క్లూజివ్ గేటెడ్ కమ్యూనిటీలో విజయ్, రష్మిక కలిసి ఒక విలాసవంతమైన విల్లాను కొనుగోలు చేశారట. ఈ లీక్స్ బయటకు వచ్చినప్పటి నుంచి అసలు ఈ భారీ ఇన్వెస్ట్మెంట్ వెనుక ఉన్న ప్లాన్ ఏంటనే ఆసక్తి ఇండస్ట్రీ సర్కిల్స్ లో మొదలైంది.
విల్లా కొనుగోలు వెనుక ఫ్యామిలీ యాంగిల్ కూడా బలంగా వినిపిస్తోంది. సాధారణంగా విజయ్, రష్మిక ఇద్దరికీ జాయింట్ ఫ్యామిలీ సెటప్ అంటే చాలా ఇష్టం. ఇప్పటికే విజయ్ తన తల్లిదండ్రులు, తమ్ముడు ఆనంద్ తో పాటు కలిసి ఉండేందుకు జూబ్లీహిల్స్ లో ఒక పెద్ద ఇల్లు కట్టించాడు. వాళ్లంతా ఒకే ఇంట్లో ఎంతో అన్యోన్యంగా ఉంటున్నారు. రష్మిక సైతం ఆ ఫ్యామిలీతో ఎంత క్లోజ్ గా ఉంటుందో అందరూ చూస్తూనే ఉన్నారు.
అందరూ ఒకేచోట కలిసి ఉండాలనేది వీళ్ల ఆలోచన. ఇప్పుడు ఉన్న ఇండివిడ్యువల్ హౌస్ నుంచి కొత్త విల్లా కొనుగోలు చేయడానికి ప్రధానంగా రెండు ప్రాక్టికల్ కారణాలు కనిపిస్తున్నాయి. ఒకటి భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని దీనిని పక్కా ఇన్వెస్ట్మెంట్ కోణంలో చూసి ఉండొచ్చు. లేదా రాబోయే రోజుల్లో కుటుంబం అంతా కలిసి ఆ లగ్జరీ గేటెడ్ కమ్యూనిటీకి పూర్తిగా షిఫ్ట్ అయ్యే ఆలోచన అయినా ఉండి ఉండొచ్చు. ఏ సెలబ్రిటీ అయినా కాలంతో పాటు తమ లైఫ్ స్టైల్ ను అప్గ్రేడ్ చేసుకోవడం సహజం. పదేళ్లకోసారి కొత్త తరహాలో అడుగులు వేస్తుంటారు.
మరోవైపు ఇండిపెండెంట్ ఇళ్ల కంటే గేటెడ్ కమ్యూనిటీల్లో ప్రైవసీతో పాటు సెక్యూరిటీ కూడా చాలా హై ఎండ్ లో ఉంటుంది. స్టార్ డమ్ పెరిగే కొద్దీ సెలబ్రిటీలకు కావాల్సిన పర్ఫెక్ట్ స్పేస్ అక్కడ దొరుకుతుంది. పైగా రాజకీయ ప్రముఖుల బ్యాక్ గ్రౌండ్ ఉన్న హై ప్రొఫైల్ ప్రాజెక్ట్ కావడంతో అక్కడ సౌకర్యాలు ఎక్స్ క్లూజివ్ గా ఉంటాయి.
భవిష్యత్తులో ఈ ప్రాపర్టీ విలువ మరింత పెరిగే అవకాశం ఉండటం కూడా ఒక స్మార్ట్ ఫైనాన్షియల్ మూవ్ అని చెప్పొచ్చు. పాన్ ఇండియా సినిమాలతో పాటు భారీ యాడ్స్ ద్వారా కోట్లు సంపాదిస్తున్న ఈ జంట తమ ఆదాయాన్ని ఇలా తెలివిగా ఆస్తుల మీద పెడుతున్నారు. ప్రస్తుతం ఈ జోడీ రణబాలి సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే. మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమా అక్టోబర్ 16న రిలీజ్ కానుంది.
