Begin typing your search above and press return to search.

మొన్న విజయ్ నేడు రష్మిక.. ఎంగేజ్మెంట్ రింగ్స్ తో..!

తాజాగా రష్మిక మందన్నా తన ఇంస్టాగ్రామ్ ఖాతాలో తన పెట్ డాగ్ తో ఉన్న వీడియోని షేర్ చేసింది. రష్మిక షేర్ చేసిన ఈ పోస్టులో తన చేతి వేలికి ఉన్న డైమండ్ రింగ్ హైలెట్ గా నిలిచింది.

By:  Madhu Reddy   |   11 Oct 2025 12:01 PM IST
మొన్న విజయ్ నేడు రష్మిక.. ఎంగేజ్మెంట్ రింగ్స్ తో..!
X

టాలీవుడ్ నటుడు విజయ్ దేవరకొండ , రష్మిక మందన్నా ఎంగేజ్మెంట్ చేసుకున్నారని గత వారం రోజుల నుండి సోషల్ మీడియా,మెయిన్ మీడియాలో వార్తలు చక్కర్లు కొడుతున్న సంగతి మనకు తెలిసిందే. అయితే ఈ జంట ఎంగేజ్మెంట్ చేసుకున్నట్టు ఇన్ని వార్తలు వినిపించినా కూడా ఇప్పటివరకు ఒక్క క్లారిటీ కూడా ఇవ్వకుండా అభిమానులని అయోమయంలోకి నెట్టేశారు. ఈ నేపథ్యంలోనే తాజాగా ఈ జంట ఎంగేజ్మెంట్ చేసుకున్నారనే దానికి ఇదే రుజువు అనేలా మరో విషయం కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అదేంటో ఇప్పుడు తెలుసుకుందాం..

చాలామంది సెలబ్రిటీలు ఎంగేజ్మెంట్ చేసుకున్న తర్వాత ఆ విషయాన్ని ఆఫీషియల్ గా అనౌన్స్ చేస్తూ ఉంటారు. కానీ విజయ్, రష్మిక మాత్రం ఇప్పటివరకు తమ ఎంగేజ్మెంట్ విషయాన్ని అధికారికంగా సోషల్ మీడియాలో ప్రకటించలేదు. కానీ ఇప్పుడు చేతి వేళ్లకు ఉన్న రింగ్స్ తో వీరి ఎంగేజ్మెంట్ కన్ఫామ్ చేసేసారు. అందులో భాగంగానే.. రీసెంట్ గా ఎంగేజ్మెంట్ రింగ్ తో విజయ్ కనిపించగా.. తాజాగా రష్మిక కూడా ఎంగేజ్మెంట్ రింగ్ తో దర్శనం ఇచ్చింది.

విషయంలోకి వెళ్తే.. విజయ్ దేవరకొండ రీసెంట్ గా ఎంగేజ్మెంట్ జరిగిన తర్వాత తమ ఫ్యామిలీకి సెంటిమెంట్ అయినటువంటి సత్యసాయి బాబా మహాసమాధిని దర్శించుకోవడం కోసం పుట్టపర్తి వెళ్లారు. అక్కడికి వెళ్ళిన సమయంలో.. స్థానికులు విజయ్ కి పూల బొకేలు ఇచ్చి ఆహ్వానించారు. అందుకు సంబంధించిన ఫోటోలు వైరల్ అవ్వడంతో ఆ ఫోటోలలో విజయ్ చేతికి ఉన్న ఎంగేజ్మెంట్ రింగ్ హైలెట్ అయింది. దాంతో చాలామంది అది నిశ్చితార్థపు ఉంగరమేనని.. డౌటే లేదు.. వీరిద్దరి ఎంగేజ్మెంట్ జరిగింది అని అనుకున్నారు.

అయితే మొన్న విజయ్ ఎంగేజ్మెంట్ రింగ్ తో కనిపించగా తాజాగా రష్మిక కూడా ఎంగేజ్మెంట్ రింగ్ తో కనిపించింది. తాజాగా రష్మిక మందన్నా తన ఇంస్టాగ్రామ్ ఖాతాలో తన పెట్ డాగ్ తో ఉన్న వీడియోని షేర్ చేసింది. రష్మిక షేర్ చేసిన ఈ పోస్టులో తన చేతి వేలికి ఉన్న డైమండ్ రింగ్ హైలెట్ గా నిలిచింది. దీంతో ఈ పోస్ట్ చూసిన నెటిజన్స్ మొన్న విజయ్ దేవరకొండ.. నేడు రష్మిక మందన్నా.. ఇద్దరి చేతి వేళ్లకు రింగ్స్ ఉన్నాయంటే కచ్చితంగా ఎంగేజ్మెంట్ జరిగినట్టే.. వీరు చెప్పకపోయినా ఉంగరాల సాక్షిగా వీరిద్దరూ ఎంగేజ్మెంట్ చేసుకున్నారని మనం ఫిక్స్ అవ్వచ్చు అంటూ కామెంట్లు పెడుతున్నారు..

అయితే ఈ జంట ఎందుకు అంత రహస్యంగా తమ ఎంగేజ్మెంట్ ని దాస్తున్నారు అని చాలామందికి అర్థం అవ్వడం లేదు. కొంతమందేమో అవకాశాల కోసం అంటే.. మరి కొంతమందేమో పెళ్లిళ్లు చేసుకుంటే అవకాశాలు రావా ఏంటి.. మరీ అంత సీక్రెట్ గా ఉంచాలా అని కామెంట్లు పెడుతున్నారు. ఏది ఏమైనప్పటికీ గీతా గోవిందం తో కలిసిన ఈ జంట మూడుముళ్ల బంధంతో ఒక్కటవ్వాలని ఎంతోమంది అభిమానులు కోరుకున్నారు. అభిమానుల కల త్వరలోనే నెరవేరబోతుంది. ఎందుకంటే ఈ జంట ఫిబ్రవరిలో పెళ్లి పీటలెక్కబోతున్నట్టు సమాచారం.