Begin typing your search above and press return to search.

న్యూయార్క్ లో రష్మిక, విజయ్.. ఒకరి చేయి ఒకరు పట్టుకుని మరీ!

అయితే సాధారణంగా విజయ్, రష్మిక ఎక్కడ కనిపించినా వెంటనే ఫోటోగ్రాఫర్స్ క్లిక్ మనిపిస్తారు.

By:  M Prashanth   |   18 Aug 2025 10:17 AM IST
న్యూయార్క్ లో రష్మిక, విజయ్.. ఒకరి చేయి ఒకరు పట్టుకుని మరీ!
X

స్టార్ హీరో హీరోయిన్లు విజయ్ దేవరకొండ, రష్మిక రీసెంట్ గా అమెరికాలో ప్రత్యక్షమైన విషయం తెలిసిందే. ముందు రష్మిక వెళ్లగా.. ఆ తర్వాత విజయ్ చేరుకున్నారు. ఇప్పుడు న్యూయార్క్ లో కలిసి సందడి చేశారు. 43వ ఇండియా డే పరేడ్ కు హాజరయ్యారు. కవాతులో గ్రాండ్ మార్షల్స్ గా కూడా ఇద్దరూ సత్కారం అందుకున్నారు.


భారత 79వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని సందర్భంగా న్యూయార్క్‌ టైమ్స్‌ స్క్వేర్‌ వద్ద ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇండియన్‌ అసోసియేషన్స్‌ ఇండియా డే పరేడ్ నిర్వహించగా.. విజయ్, రష్మిక స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచారు. చాలా సన్నిహితంగా, హ్యాపీ మోడ్ లో ఉన్నట్లు కనిపించారు. ఒకరి చేయి ఒకరు పట్టుకుని కూడా నడిచారు.


అయితే సాధారణంగా విజయ్, రష్మిక ఎక్కడ కనిపించినా వెంటనే ఫోటోగ్రాఫర్స్ క్లిక్ మనిపిస్తారు. ఇప్పుడు అమెరికాలో ఉండగా.. అందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. నెట్టింట తెగ చక్కర్లు కొడుతున్నాయి. నెటిజన్లు, అభిమానులు వాటిని షేర్ చేస్తూ ఇంకా వైరల్ చేస్తున్నారు.


నిజానికి.. వారిద్దరూ రిలేషన్ షిప్ లో ఉన్నారని కొన్ని నెలలుగా వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. తాము ప్రేమలో ఉన్నామని ఎప్పటికప్పుడు పరోక్షంగా చెబుతూనే ఉన్నారు. అనేకసార్లు వెకేషన్స్ కు వెళ్తూ కనిపించారు. ఇటీవల కారులో ఇద్దరు కలిసి డిన్నర్ కు వెళ్తూ కెమెరాలకు చిక్కారు. కానీ అఫీషియల్ గా ఏదీ అనౌన్స్ చేయలేదు.

అయితే ఫ్యాన్స్, సినీ ప్రియులు అంతా ఎప్పుడో వారిద్దరూ రిలేషన్ షిప్ లో ఉన్నారని ఫిక్స్ అయ్యారు. త్వరలో అధికారికంగా అనౌన్స్ చేస్తారని వెయిట్ చేస్తున్నారు. మరోవైపు.. వీరిద్దరూ ఫస్ట్ టైమ్ గీత గోవిందం మూవీకి గాను స్క్రీన్ షేర్ చేసుకున్నారు. తమ కెమిస్ట్రీతో బెస్ట్ ఆన్ స్క్రీన్ పెయిర్ గా మంచి గుర్తింపు సంపాదించుకున్నారు.

రెండోసారి డియర్ కామ్రేడ్ మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఆ సినిమాతో కమర్షియల్ గా హిట్ అందుకోనప్పటికీ యూత్ కు బాగా కనెక్ట్ అయ్యారు. ఇప్పుడు విజయ్.. రాహుల్ సాంకృత్యాన్ దర్శకత్వంలో మరో సినిమా చేస్తున్నారు. పీరియాడిక్ యాక్షన్ థ్రిల్లర్ గా రానున్న ఆ సినిమాలో కూడా రష్మికనే హీరోయిన్ అని కొంతకాలంగా ప్రచారం జరుగుతోంది. ఇప్పుడు న్యూయార్క్ లోని ఇద్దరి పిక్స్ వైరల్ అవుతున్నాయి.