Begin typing your search above and press return to search.

మ‌రో 'టామ్ హాలండ్ - జెండయా' జంట‌ను చూసారా?

ఈ ఇంటర్వ్యూకి సంబంధించిన ప్రోమో క్లిప్ సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన క్షణాల వ్యవధిలోనే వైరల్ అయింది.

By:  Sivaji Kontham   |   4 Oct 2026 1:39 PM IST
మ‌రో టామ్ హాలండ్ - జెండయా జంట‌ను చూసారా?
X

టాలీవుడ్‌లో మోస్ట్ ఎలిజిబుల్ క్యూట్ కపుల్‌గా పేరు తెచ్చుకున్న విజయ్ దేవరకొండ - రష్మిక మందన్న ప్రస్తుతం `రణబాలి` సినిమా ప్రమోషన్లలో ఫుల్ బిజీగా గడుపుతున్నారు. ఈ ఇద్దరూ కలిసి ఎక్కడ కనిపించినా ఆ ఈవెంట్‌కు ఒక ప్రత్యేకమైన హైప్ వస్తుంది. ముఖ్యంగా రియల్ లైఫ్‌లోనూ ఈ జంట మధ్య ఉన్న కెమిస్ట్రీ- ఒకరిపై ఒకరు చూపించే ప్రేమ నెటిజన్లను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. ఆన్ స్క్రీన్‌పై `గీత గోవిందం` సృష్టించిన మ్యాజిక్ రియల్ లైఫ్‌లోనూ కంటిన్యూ అవుతోందని.. పర్ఫెక్ట్ లవ్ కపుల్ అంటే వీళ్లేనంటూ ఫ్యాన్స్ తెగ మురిసిపోతున్నారు.

తాజాగా ప్రముఖ యాంకర్ సుమ కనకాలతో జరిగిన ఒక సరదా చిట్‌చాట్ సెషన్ సోషల్ మీడియాలో ట్రెండింగ్‌గా మారింది. ఈ ఇంటర్వ్యూలో విజయ్ దేవరకొండ, రష్మికల మధ్య జరిగిన సంభాషణలు, విజయ్ తన భార్యను ముద్దుగా `రాషి` అంటూ పిలుస్తూ చూపించిన ప్రేమానుబంధం అందరినీ ఫిదా చేసింది. అగ్ర యాంకర్‌గా ఎన్నో ఏళ్ల అనుభవం ఉన్న సుమ సైతం ఈ క్యూట్ కపుల్ కెమిస్ట్రీని చూసి మంత్రముగ్దులవ్వడం ఈ చిట్‌చాట్ ప్రత్యేకత. సుమ అల్లరి, విజయ్-రష్మికల సిగ్గుప‌డుతూనే అల్ల‌రి నవ్వులు వీడియోకు మరింత హైలైట్‌‌గా నిలిచాయి.

ఈ ఇంటర్వ్యూకి సంబంధించిన ప్రోమో క్లిప్ సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన క్షణాల వ్యవధిలోనే వైరల్ అయింది. ముఖ్యంగా వీడియో చివర్లో విజయ్ దేవరకొండ చెప్పిన ఆఖరి సమాధానానికి రష్మిక సిగ్గుతో బుగ్గలు కందడం.. ఆమె ఇచ్చిన రియాక్షన్ నెటిజన్ల హృదయాలను కొల్లగొట్టింది. ``ద లాస్ట్ ఆన్సర్ అండ్ ఎక్స్‌ప్రెషన్ అబ్బ‌బ్బో` అంటూ అభిమానులు ఆ క్షణాలను నెట్టింట తెగ షేర్ చేస్తున్నారు. ఆ క్యూట్ మూమెంట్స్‌ని చూసి నెటిజన్లు రకరకాల లవ్ ఎమోజీలతో కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.

ఈ జోడీ క్రేజ్ ఏ స్థాయిలో ఉందంటే, నెటిజన్లు సోషల్ మీడియా వేదికగా వీళ్లను హాలీవుడ్ పాపులర్ కపుల్ `టామ్ హాలండ్ - జెండయా`తో పోలుస్తున్నారు. టాలీవుడ్‌లో నాగచైతన్య - సమంత జంట తర్వాత తమకు అంతగా ఇష్టమైన క్యూట్ పేర్ `విరోష్` అంటూ ఒక అభిమాని కామెంట్ చేయ‌డం ఆస‌క్తిని క‌లిగించింది. `లవ్ ఈజ్ రాషి`, `రుషి అండ్ విజయ్` అంటూ రకరకాల పేర్లతో ఈ జంటపై తమ అభిమానాన్ని చాటుకుంటున్నారు. ఇన్‌స్టాగ్రామ్ కామెంట్ బాక్స్ మొత్తం ఈ క్యూట్ కపుల్ నామస్మరణతో నిండిపోయింది.

`రణబాలి`చిత్రంపై భారీ అంచనాలు

సినిమా ప్రమోషన్లలో భాగంగా బయటకు వస్తున్న అప్‌డేట్స్ `రణబాలి' సినిమాపై అంచనాలను తారాస్థాయికి చేర్చాయి. ఆన్-స్క్రీన్ కెమిస్ట్రీతో పాటు ఆఫ్‌‌-స్క్రీన్‌లో వీరిద్దరి మధ్య ఉన్న బాండింగ్ సినిమాకు బిగ్గెస్ట్ అసెట్‌గా మారనుందని ట్రేడ్ వర్గాలు భావిస్తున్నాయి. ఒకవైపు సుమ ఎనర్జీ, మరోవైపు విజయ్-రష్మికల జోడీ క్రియేట్ చేస్తున్న మ్యాజిక్‌తో ఈ ప్రమోషనల్ కంటెంట్ యూట్యూబ్ -ఇన్‌స్టాగ్రామ్‌లో రికార్డు స్థాయి వ్యూస్‌తో దూసుకుపోతోంది.