Begin typing your search above and press return to search.

ర‌ష్మిక‌పై ప్రేమ‌తో మెడ‌లో ఆర్!

టాలీవుడ్ స్టార్ క‌పుల్స్ విజయ్ దేవరకొండ- రష్మిక మందన్నల క్రేజ్ గురించి చెప్పాల్సిన ప‌నిలేదు. పెళ్లికి ఉందే ఇద్ద‌రు ఎంతో వైర‌ల్ అయిన జోడీ.

By:  Srikanth Kontham   |   28 May 2026 8:00 AM IST
ర‌ష్మిక‌పై ప్రేమ‌తో మెడ‌లో ఆర్!
X

టాలీవుడ్ స్టార్ క‌పుల్స్ విజయ్ దేవరకొండ- రష్మిక మందన్నల క్రేజ్ గురించి చెప్పాల్సిన ప‌నిలేదు. పెళ్లికి ఉందే ఇద్ద‌రు ఎంతో వైర‌ల్ అయిన జోడీ. వివాహం అనంత‌రం అదే నెట్టింట సంచ‌ల‌నం సృష్టిస్తున్నారు. తాజాగా ఎయిర్‌పోర్ట్‌లో కలిసి ఉన్న ఓ వీడియో సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. ఈ వీడియోలో విజయ్ దేవరకొండ మెడలో ధరించిన ఓ స్పెష‌ల్ చైన్, దానికి ఉన్న పెండెంట్ అభిమానుల దృష్టిని విశేషంగా ఆకర్షిస్తుంది. ఆ పెండెంట్‌పై `R` అనే అక్షరం స్పష్టంగా కనిపిస్తుండటంతో.. నెటిజన్లు దీనిపై భిన్న రకాలుగా స్పందిస్తున్నారు.

విజయ్ దేవరకొండ భార్య రష్మిక మందన్నపై ఉన్న ప్రేమను వ్యక్తపరచడానికి ఆర్ అనే అక్షరం ఉన్న పెండెంట్‌ను ధరించాడని అభిమానులు భావిస్తున్నారు. ఈ క్రమంలోనే కొందరు నెటిజన్లు దీన్ని విజయ్ దేవరకొండకు సంబంధించిన `మంగళసూత్రం` అంటూ సరదాగా వ్యాఖ్యానిస్తున్నారు. సాధారణంగా భర్త పేరు వచ్చేలా భార్యలు ఆభరణాలు ధరించడం చూస్తుంటాం. కానీ ఇక్కడ విజయ్ భార్య పేరులోని మొదటి అక్షరాన్ని పెండెంట్‌గా మార్చుకుని మెడలో వేసుకోవడం సరికొత్త `హస్బెండ్ గోల్స్` ను సెట్ చేసిందని అభిమానులు ప్రశంసిస్తున్నారు.

ఈ పెండెంట్‌ వెనుక భార్యపై ప్రేమే కాదు మరో ఆసక్తికరమైన ప్రచార కోణం కూడా ఉందనే చర్చ నడుస్తోంది. విజయ్ దేవరకొండ- రష్మిక మందన్న జంటగా న‌టిస్తోన్న‌ తదుపరి చిత్రం పేరు `రణబాలి`. ఈ సినిమా పేరు కూడా `R` అక్షరంతోనే ప్రారంభం కావ‌డంతో? విజయ్ ఒకే దెబ్బకు రెండు పిట్టలు అన్నట్లుగా అటు భార్యపై ప్రేమాభి మానాలను, ఇటు సినిమా ప్రమోషన్‌ను ఒకే పెండెంట్‌తో మేనేజ్ చేస్తున్నాడంటూ కొందరు అభిప్రాయ పడుతున్నారు.

వివాహం తర్వాత ఈ క్రేజీ కపుల్ కలిసి నటిస్తోన్న‌ మొదటి చిత్రం `రణబాలి` కావడం గమనార్హం. రాహుల్ సాంకృత్యన్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న పీరియాడిక్ డ్రామా 1854 నుండి 1878 మధ్య కాలంలో జరిగిన కొన్ని చారిత్రక అంశాల ఆధారంగా తెర‌కెక్కిస్తున్నారు. చరిత్ర పుస్తకాల్లో మరుగున పడిపోయిన కొన్ని వాస్తవ సంఘటనలను, లభించిన రికార్డుల ద్వారా ఈ సినిమాలో చూపించబోతున్నట్లు సమాచారం. ఈ చిత్రం సెప్టెంబర్ 11న ప్రేక్షకుల ముందుకు రానుంది. మ‌రి `ఆర్` వెనుక ఉన్న అస‌లు సంగ‌తి తేలాలంటే? విజ‌య్-ర‌ష్మిక‌లో ఎవ‌రో ఒక‌రు ఓపెన్ అయితే త‌ప్ప ఆ గుట్టు వీడ‌దు. సాధార‌ణంగా ఇలాంటి సూచిక‌లు చాలా మంది సెల‌బ్రిటీల మెడ‌లో క‌నిపించ‌డం స‌హ‌జ‌మే. వాటి గురించి క‌లిసిన‌ప్పుడు ప్ర‌శ్నించినా? ఏమంత ఎగ్జైట్ మెంట్ గా భావించ‌ని స‌మాధానాలే వ‌స్తుంటాయి.