ప్యారడైజ్ తర్వాత ఆ రేంజ్ రణబాలికి...!
ఇప్పటికే విడుదలైన టీజర్, డాక్యుమెంటరీ సిరీస్ వీడియోలు, విజయ్ దేవరకొండ పోస్టర్స్, రష్మిక మందన్న లుక్, సినిమాకు విపరీతంగా బజ్ క్రియేట్ చేశాయి.
By: Ramesh Palla | 2 Oct 2026 10:00 AM ISTనాని హీరోగా శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో వచ్చిన 'ది ప్యారడైజ్' మూవీకి మిశ్రమ స్పందన వచ్చినప్పటికీ భారీ ఓపెనింగ్స్ నమోదు అయిన విషయం తెల్సిందే. యూనిట్ సభ్యులు చెప్పిన దాని ప్రకారం సినిమాకు 4 రోజుల్లో రూ.155 కోట్లు నమోదు అయ్యాయి. నాని వంటి హీరోకు నాలుగు రోజుల్లో ఆ భారీ మొత్తం మామూలు విషయం కాదు. స్టార్ హీరోల రేంజ్ మార్కెట్ ను నాని దక్కించుకున్నాడు అంటూ బాక్సాఫీస్ వర్గాల వారు మాట్లాడుకుంటున్నారు. ది ప్యారడైజ్ సినిమాకు వచ్చిన బజ్ కారణంగానే భారీ ఓపెనింగ్స్ నమోదు అయ్యాయి. దసరా కాంబో కావడంతో పాటు, నాని కాళ్లకు చక్రాలు కట్టుకుని మరీ సినిమాను ప్రమోట్ చేశాడు, అందుకే సినిమాకు విడుదలకు ముందు విపరీతమైన బజ్ క్రియేట్ అయ్యి, భారీ ప్రీమియర్ షోలు వేయడం ద్వారా నాని కెరీర్‌లో బెస్ట్ ఓపెనింగ్ కలెక్షన్స్ ను రాబట్టిన సినిమాగా నిలిచింది.
ది ప్యారడైజ్ మూవీ కలెక్షన్స్..
ఈమధ్య కాలంలో సినిమాలు వారం నుంచి రెండు వారాలు మాత్రమే థియేటర్‌లో ఆడుతున్నాయి. మూడు నాలుగు వారాలు కూడా థియేటర్లలో ఉన్నాయి అంటే అవి గొప్ప సినిమాలు, రికార్డ్ బ్రేకింగ్ సినిమాలు అనుకోవచ్చు. మొదటి వారం రెండు వారాల్లోనే సినిమాకు పెట్టిన ప్రతి పైసాను వెనక్కి రాబట్టుకోవడం కోసం విడుదలకు ముందు విపరీతమైన బజ్ క్రియేట్ చేయాల్సిన అవసరం ఉంది. కొన్ని సినిమాలు బజ్ లేకుండా విడుదల అయితే మంచి జరుగుతుంది, కానీ కొన్ని సినిమాలు కేవలం బజ్ తో విడుదల అయితేనే బ్రేక్ ఈవెన్ సాధ్యం అవుతుంది. విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న జంటగా రాహుల్ సంకృత్యాన్ దర్శకత్వంలో రూపొందిన 'రణబాలి' సినిమాను భారీ హైప్‌తో విడుదలకు సిద్ధం చేస్తున్నారు. దసరా కానుకగా అక్టోబర్ 16న భారీ ఎత్తున రణబాలి ప్రపంచ వ్యాప్తంగా సందడి చేయడానికి రెడీ అవుతున్నాడు.
విజయ్ దేవరకొండ రణబాలి మూవీ...
ఇప్పటికే విడుదలైన టీజర్, డాక్యుమెంటరీ సిరీస్ వీడియోలు, విజయ్ దేవరకొండ పోస్టర్స్, రష్మిక మందన్న లుక్, సినిమాకు విపరీతంగా బజ్ క్రియేట్ చేశాయి. ఈ మధ్య కాలంలో ది ప్యారడైజ్ మూవీకి ఎలా అయితే పాజిటివ్ బజ్ క్రియేట్ అయిందో అదే విధంగా రణబాలి సినిమాకు పాజిటివ్ బజ్ క్రియేట్ చేయడంలో మేకర్స్ నూరు శాతం సక్సెస్ అయ్యారు. దర్శకుడు రాహుల్ గత చిత్రాలను చూస్తే దేనికి అదే అన్నట్లుగా ట్యాక్సీవాలా, శ్యామ్ సింగరాయ్ సినిమాలు నిలిచాయి. అందుకే ఆయన నుంచి రాబోతున్న సినిమా ఇదే కావడంతో అంచనాలు అంతకు మించి అన్నట్లుగా ఉన్నాయి. దర్శకుడు రాహుల్ సైతం ఏదో మూస దోరణి సినిమా కాకుండా తన గత చిత్రాల మాదిరిగానే, అంతకు మించి ఉండేలా స్వాతంత్య్ర ఉద్యమ నేపథ్యంలో, ఆ సమయంలో ఉన్న కరువు పరిస్థితులను చూపించేందుకు రెడీ అయ్యాడు.
విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న జంటగా...
ఉద్యమ నేపథ్యం, కరువుతో పాటు ఏదో ఆత్మకు సంబంధించిన విషయాన్ని సైతం సినిమాలో చూపించే అవకాశాలు కనిపిస్తున్నాయి. సినిమా ట్రైలర్ విడుదలకు రెడీ చేస్తున్నారు. కచ్చితంగా ట్రైలర్ రిలీజ్ తర్వాత సినిమాకి ఉన్న ప్రస్తుత బజ్ దాదాపు రెట్టింపు కావడం ఖాయం అని విశ్లేషకులు అంటున్నారు. ది ప్యారడైజ్ మూవీకి వచ్చిన బజ్ కి తోడు సినిమాకు హిట్ టాక్ వచ్చి ఉంటే వందల కోట్ల వసూళ్లు నమోదు అయ్యేవి. ఆ లోటును రణబాలి భర్తీ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. కచ్చితంగా రణబాలి సినిమాకు మంచి స్పందన రావడం ఖాయం, అంతే కాకుండా సినిమాకు యూ/ఎ సర్టిఫికెట్ వస్తే తప్పకుండా ఫ్యామిలీ ఆడియన్స్ థియేటర్లకు క్యూ కట్టడం ఖాయం. దసరా హాలీడేస్ కలిసి వచ్చి రణబాలి సినిమా బాక్సాఫీస్ వద్ద సందడి చేస్తుందా అనేది చూడాలి. విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న పెళ్లి తర్వాత కలిసి నటించిన మొదటి సినిమా ఇదే కావడంతో అంచనాలు పెరిగాయి. మరి ఈ జోడీ ఆన్ స్క్రీన్ పెళ్లి తర్వాత ఎలా కనిపిస్తుందా అనేది కూడా ఆసక్తికరంగా మారింది.
