Begin typing your search above and press return to search.

రష్మిక భుజంపై చేయి వేసిన విజయ్ దేవరకొండ.. అందుకేనా ఇదంతా?

విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న మరోసారి వార్తల్లో నిలిచారు. ఇటీవల ఎయిర్‌పోర్టులో విజయ్ ముందుగా, రష్మిక వెనుక నడిచిన వీడియోపై విమర్శలు వచ్చాయి. తాజాగా కుటుంబ సభ్యులతో కలిసి ఎయిర్‌పోర్టులో కనిపించిన విజయ్.. రష్మిక భుజంపై చేయి వేసుకుని నడిచారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో మరోసారి ఈ జంటపై చర్చ మొదలైంది.

By:  Priya Chowdhary Nuthalapti   |   7 Nov 2026 10:41 AM IST
రష్మిక భుజంపై చేయి వేసిన విజయ్ దేవరకొండ.. అందుకేనా ఇదంతా?
X

విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు. వీళ్ళ ప్రేమ దగ్గర నుంచి పెళ్లి వరకు.. వీళ్ళు ఏమి చేసినా సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే వచ్చింది. నిన్న మొన్నటి వరకు వీళ్లు పెళ్లి ఎప్పుడు చేసుకుంటారు అని అభిమానులకు వీళ్ళ పెళ్లి ఆనందంగా నిలిచింది. ఇక పెళ్లయిన తర్వాత ఈ జంట రణబాలి ప్రమోషన్స్ తో అందరిని తెగ మెప్పించారు. కానీ ఈ సినిమా ప్రమోషన్స్ అప్పుడు కొన్ని వివాదాలు కూడా చోటుచేసుకున్నాయి..

ముఖ్యంగా కాఫీ విత్ కరణ్ (Koffee With Karan) షోలో రష్మిక, విజయ్ పాల్గొన్నప్పటి నుంచి వీరిద్దరి గురించి సోషల్ మీడియాలో వివాదాలు ఎక్కువయ్యాయి. ఆ షోలో రష్మిక విజయ్ గురించి ఎక్కువగా మాట్లాడిందని, కానీ విజయ్ మాత్రం తన ప్రేమను అంతగా బయటపెట్టలేదని కొందరు కామెంట్లు చేశారు. దీంతో రష్మికకే విజయ్‌పై ఎక్కువ ప్రేమ ఉందని, ఆమెనే విజయ్ వెంట పడుతోందని కొంతమంది సోషల్ మీడియాలో ట్రోల్ చేశారు.

అయితే విజయ్ దేవరకొండ మొదటి నుంచి తన వ్యక్తిగత విషయాలను ఎక్కువగా బయటపెట్టడానికి, ఎక్కువగా మాట్లాడడానికి ఇష్టపడరు. ఆయన స్వభావం ముందు నుంచి అలానే ఉండేది. రష్మిక మాత్రం తన మనసులో ఉన్న విషయాలను బయటకు చెప్పడానికి ఎక్కువగా ఇష్టపడుతుంది. ఈ చిన్న తేడాను కూడా కొందరు పెద్ద విషయంగా మార్చేశారు.

ఇటీవల ఎయిర్‌పోర్టులో విజయ్ ముందుగా నడుస్తూ వెళ్లగా, రష్మిక వెనుక నడుచుకుంటూ వెళ్లిన వీడియో వైరల్ అయింది. దీంతో మరోసారి వీరిద్దరి మధ్య ఏదో సమస్య ఉందంటూ కామెంట్లు మొదలయ్యాయి. విజయ్ రష్మికను పట్టించుకోవడం లేదంటూ కొందరు విమర్శించారు.

కానీ తాజాగా ఎయిర్‌పోర్టులో విజయ్ దేవరకొండ తన కుటుంబ సభ్యులతో కలిసి కనిపించారు. ఈ సమయంలో రష్మిక కూడా ఆయనతో ఉండగా, విజయ్ ఆమె భుజంపై చేయి వేసుకుని మీడియా ముందు నడుచుకుంటూ వెళ్లారు. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో మరింత వైరల్ గా మారింది.

అయితే ఈ చర్య వెనుక ఏదైనా ప్రత్యేక కారణం ఉందా? గతంలో వచ్చిన విమర్శలకు సమాధానంగా విజయ్ ఇలా చేశారా? అని మళ్ళీ కామెంట్లు పెడుతున్నారు కొంతమంది. మరికొందరు మాత్రం వాళ్లు విడిగా నడిచినా తప్పే, కలిసి నడిచినా తప్పేనా అంటూ ట్రోలర్లపై మండిపడుతున్నారు.