Begin typing your search above and press return to search.

విజ‌య్ కు మెమొరబుల్ ఇయ‌ర్ కానుందా?

టాలీవుడ్ టాలెంటెడ్ హీరో విజ‌య్ దేవ‌ర‌కొండ ప్ర‌స్తుతం చెప్పుకోద‌గ్గ ఫామ్ లో లేరు. అయిన‌ప్ప‌టికీ తెలుగు చిత్ర ప‌రిశ్ర‌మ‌లో త‌న డిమాండ్ ఏ మాత్రం త‌గ్గ‌లేదు.

By:  Sravani Lakshmi Srungarapu   |   30 Jan 2026 7:04 PM IST
విజ‌య్ కు మెమొరబుల్ ఇయ‌ర్ కానుందా?
X

టాలీవుడ్ టాలెంటెడ్ హీరో విజ‌య్ దేవ‌ర‌కొండ ప్ర‌స్తుతం చెప్పుకోద‌గ్గ ఫామ్ లో లేరు. అయిన‌ప్ప‌టికీ తెలుగు చిత్ర ప‌రిశ్ర‌మ‌లో త‌న డిమాండ్ ఏ మాత్రం త‌గ్గ‌లేదు. కెరీర్ స్టార్టింగ్ లో చిన్న చిన్న క్యారెక్ట‌ర్లు చేసిన విజ‌య్ ఇప్పుడు పాన్ ఇండియా హీరోగా మారారు. పెళ్లి చూపులు మూవీతో మంచి హిట్ ను అందుకున్న విజ‌య్, ఆ త‌ర్వాత అర్జున్ రెడ్డితో తిరుగులేని స‌క్సెస్ ను ఖాతాలో వేసుకున్నారు.




ఫ‌లితంతో సంబంధం లేకుండా..

ఆ త‌ర్వాత నుంచి విజ‌య్ హిట్టూ, ఫ్లాపుల‌తో సంబంధం లేకుండా వ‌రుస పెట్టి సినిమాలు చేసుకుంటూ వెళ్తున్నారు. అయితే విజ‌య్ సినిమాలైతే చేస్తున్నారు కానీ తాను అనుకుంటున్న ఫ‌లితాల్ని మాత్రం ఆ సినిమాల‌తో అందుకోలేక‌పోతున్నారు. అందం, టాలెంట్, క‌ష్ట‌ప‌డే త‌త్వం అన్నీ ఉన్న‌ప్ప‌టికీ విజ‌య్ కు స‌రైన స‌క్సెస్ ద‌క్క‌డం లేదు.

ఎప్ప‌టిక‌ప్పుడు క‌ష్ట‌ప‌డి సినిమాలు చేయ‌డం, ఈ సినిమాతో అయినా స‌క్సెస్ అవుతామ‌ని ఆశ ప‌డ‌టం, రిలీజ్ త‌ర్వాత ఆ ఆశ నిరాశ‌గా మార‌డం.. గ‌త కొన్ని సినిమాలుగా విజ‌య్ కు ఇదే జ‌రుగుతూ వ‌స్తుంది. విజ‌య్ నుంచి ఆఖ‌రిగా వ‌చ్చిన కింగ్‌డ‌మ్ సినిమా వ‌ర్క‌వుట్ అయుంటే మాత్రం అత‌ని స్థాయి అమాంతం ఎక్క‌డికో వెళ్లిపోయేది. కానీ ఆ సినిమా కూడా అత‌నికి నిరాశ‌నే మిగిల్చింది. అయిన‌ప్ప‌టికీ విజ‌య్ డ‌ల్ అయిపోలేదు. వ‌రుస సినిమాల‌ను లైన్ లో పెట్టి వాటితో బిజీగా ఉన్నారు.

2026లో విజ‌య్ నుంచి రెండు ప్రిస్టీజియ‌స్ ప్రాజెక్టులు

ఈ ఇయ‌ర్ విజ‌య్ నుంచి రెండు ప్రామిసింగ్ ప్రాజెక్టులు రాబోతున్నాయి. అవే రౌడీ జ‌నార్థ‌న, ర‌ణ‌బాలి సినిమాలు. ఈ రెండు సినిమాలూ ఇప్ప‌టికే ఆడియ‌న్స్ లో మంచి అంచ‌నాలను పెంచాయి. పైగా ఈ రెండు సినిమాలూ పాన్ ఇండియా స్థాయిలో తెర‌కెక్కుతున్నాయి. రెండింటిలో ఏ ఒక్క సినిమా హిట్ అయినా విజ‌య్ దేవ‌ర‌కొండ కెరీర్ గ్రాఫ్ పెర‌గ‌డం ఖాయం.

వీటిలో రౌడీ జ‌నార్ధ‌న సినిమాకు ర‌వికిర‌ణ్ కోలా ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. ఇప్ప‌టికే ఈ టీజ‌ర్ పాన్ ఇండియా స్థాయిలో ఆడియ‌న్స్ ను ఎట్రాక్ట్ చేసింది. భిన్న‌మైన క‌థ‌తో తెర‌కెక్కుతున్న రౌడీ జ‌నార్థ‌న క‌చ్ఛితంగా బ్లాక్ బ‌స్ట‌ర్ అవుతుంద‌ని మేక‌ర్స్ చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నారు. ఇక ర‌ణ‌బాలి సినిమాను ట్యాక్సీవాలా ఫేమ్ రాహుల్ సాంకృత్యన్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తుండ‌గా, రీసెంట్ గా రిలీజైన టీజ‌ర్ కు ఆడియ‌న్స్ నుంచి అద్భుత‌మైన రెస్పాన్స్ వ‌స్తోంది. చూస్తుంటే 2026 విజ‌య్ కు మోస్ట్ మెమొర‌బుల్ ఇయ‌ర్ గా మారేలా అనిపిస్తుంది.