నాకు ఆ అదృష్టం లేదు.. నెపోటిజంపై విజయ్ కామెంట్స్!
టాలీవుడ్ స్టార్ హీరో విజయ్ దేవరకొండ.. ఎలాంటి సినీ బ్యాక్ గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి వచ్చిన విషయం తెలిసిందే.
By: M Prashanth | 30 July 2025 8:47 PM ISTటాలీవుడ్ స్టార్ హీరో విజయ్ దేవరకొండ.. ఎలాంటి సినీ బ్యాక్ గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి వచ్చిన విషయం తెలిసిందే. క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కెరీర్ స్టార్ చేసి.. ఆ తర్వాత చిన్న హీరోగా మారి.. ఇప్పుడు స్టార్ హీరో గా ఎదిగారనే చెప్పాలి. అయితే రీసెంట్ గా ఓ ఇంగ్లీష్ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో నెపోటిజంపై వ్యాఖ్యలు చేశారు.
కొందరు తండ్రులు.. హీరోల సినిమాల కథలను వింటారని, అందుకే బెస్ట్ సినిమాలు వస్తాయని తెలిపారు. కానీ తనకు అలా ఎవరు లేరని చెప్పారు. అందుకే తన వద్దకు వచ్చిన కథలను రిజెక్ట్ చేయలేకపోయానని పేర్కొన్నారు. దీంతో ఆయన కామెంట్స్ ఫుల్ గా వైరల్ అయ్యాయి. ఇప్పుడు ఆ విషయంపై మీడియా చిట్ చాట్ లో మాట్లాడారు.
మరికొన్ని గంటల్లో కింగ్ డమ్ తో ప్రేక్షకుల ముందుకు రానున్న విజయ్.. ప్రెస్ తో మాట్లాడారు. ఆ సమయంలో నెపోటిజంపై మీ ఒపీనియన్ ఏంటి అని మీడియా ప్రతినిధి అడగ్గా.. అప్పుడే ఏం చెప్పానో ఒకసారి చెప్పమని విజయ్ అడిగారు. ఆ తర్వాత సదరు ప్రతినిధి ఆయన చేసిన వ్యాఖ్యలను గుర్తు చేయగా.. పలు వ్యాఖ్యలు చేశారు.
"నా కొడుకు యాక్టర్ అవుదామనుకుంటే నా ఎక్స్పీరియన్స్ అంతా వాడికి వస్తుంది.. అది వాడి అదృష్టం.. వాడి తప్పు కాదు.. వాడికి సినిమా స్క్రిప్ట్ ఎలా సెలెక్ట్ చేసుకోవాలో.. ప్రమోషన్స్ ఏం చేయాలో.. ఎలాంటి టెక్నీషియన్స్ ఉండాలో.. నేను నేర్చుకున్నా నా జర్నీలో వచ్చిన ఎక్సపీరియన్స్ వాడికి పనికొస్తుంది. ఆ అదృష్టం నాకు లేదు" అని అన్నారు.
"నేను తప్పులన్నీ చేస్తూ నేర్చుకోవాల్సి వచ్చింది. ప్రపంచంలో ఏం ఫీల్డ్ లో అయినా నెపోటిజం వల్ల లాభాలుంటాయి. డాక్టర్ కొడుకుకు తండ్రి అన్నీ చెబుతారు. తెలుస్తాయి. ఇప్పుడు మీ పిల్లలు జర్నలిస్టులు అవ్వాలంటే మీరు అన్నీ గైడెన్స్ ఇస్తారు" అని తెలిపారు. మరి ఆనంద్ కు ఇస్తున్నారా అని అడగ్గా.. తనను చూస్తే వాడికి అర్థమవుతుంది కదా అని విజయ్ అన్నారు. తన బ్రదర్ అవ్వడం 100 శాతం బెనిఫిట్ ఉంటుందని చెప్పారు.
ఆనంద్ దేవరకొండ.. స్టార్ హీరో విజయ్ దేవరకొండ తమ్ముడు అన్న విషయం తెలిసిందే. ఆరేళ్ల క్రితం దొరసాని మూవీతో సినీ ఇండస్ట్రీకి హీరోగా పరిచయమయ్యారు. బేబీ మూవీతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నారు. యాక్టింగ్ తో మంచి ఫేమ్ బేస్ సంపాదించుకున్నారు. ఆ తర్వాత గంగం గణేశా సహ పలు సినిమాల్లో నటించారు. ఇప్పుడు మరిన్ని మూవీస్ తో బిజీగా ఉన్నారు.
