Begin typing your search above and press return to search.

విజయ్ దేవరకొండ కష్టం మొత్తం ఎక్కడికి పోతుంది?

ఈ మధ్యకాలంలో విజయ్ దేవరకొండకు సరైన విజయం దక్కడం లేదు. అర్జున్ రెడ్డి, గీత గోవిందం తర్వాత ఆయన ఎన్నో రకాల కథలను ప్రయత్నించారు.

By:  Priya Chowdhary Nuthalapti   |   3 Nov 2026 11:00 PM IST
విజయ్ దేవరకొండ కష్టం మొత్తం ఎక్కడికి పోతుంది?
X

విజయ్ దేవరకొండ సినిమా కోసం ఎంత కష్టపడుతున్నారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రతి సినిమాకు తనను తాను కొత్తగా మార్చుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. పాత్ర కోసం లుక్ మార్చడం, మేకప్ వేసుకోవడం, కొత్త రకమైన కథలను ఎంచుకోవడం ఇలా ఎన్నో ప్రయోగాలు చేస్తున్నారు. కానీ ఆయన కష్టానికి తగ్గ విజయం మాత్రం రావడం లేదు.

ఈ మధ్యకాలంలో విజయ్ దేవరకొండకు సరైన విజయం దక్కడం లేదు. అర్జున్ రెడ్డి, గీత గోవిందం తర్వాత ఆయన ఎన్నో రకాల కథలను ప్రయత్నించారు. తన నటనలో మార్పులు తీసుకురావడానికి కష్టపడ్డారు. పాత్రల కోసం తన లుక్, ఎక్స్‌ప్రెషన్స్ మార్చుకున్నారు. అయినప్పటికీ బాక్సాఫీస్ దగ్గర ఆశించిన ఫలితాలు రావడం లేదు.

ఇటీవల వచ్చిన సినిమాల విషయంలో కూడా విజయ్ చాలా ఆశలు పెట్టుకున్నారు. ముఖ్యంగా ఈమధ్య చేసిన రెండు సినిమాల కోసం ఆయన చేసిన కష్టం కనిపించింది. కానీ ఆ సినిమాలు కూడా ఆయనకు ఆశించిన స్థాయిలో విజయాన్ని అందించలేకపోయింది. దీంతో ఆయన చేస్తున్న ప్రయత్నాలన్నీ ఎక్కడికి పోతున్నాయనే ప్రశ్న అభిమానుల్లో మొదలవుతోంది.

విజయ్ దేవరకొండ కెరీర్‌ను చూస్తే ‘అర్జున్ రెడ్డి’ సినిమా ఒక ప్రత్యేకమైన అని చెప్పవచ్చు. ఆ సినిమాతో ఆయన సృష్టించిన ప్రభావం మామూలుది కాదు. ఒక్క సినిమాతోనే యువతలో భారీ క్రేజ్ సంపాదించారు. ఆయన నటన, డైలాగులు, బాడీ లాంగ్వేజ్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి. ఆ సినిమా తర్వాత విజయ్ నుంచి అదే స్థాయిలో మరో సినిమా వస్తుందని అభిమానులు ఎదురుచూస్తున్నారు.

కానీ ఇప్పటివరకు ఆయనకు అర్జున్ రెడ్డి స్థాయిలో మరో విజయం దక్కలేదు. సినిమాలు మారుతున్నాయి, కథలు మారుతున్నాయి, పాత్రలు మారుతున్నాయి. కానీ ప్రేక్షకులపై చూపించే ప్రభావం మాత్రం తగ్గుతోంది.

విజయ్ దేవరకొండ తన కష్టం తగ్గించుకోవాల్సిన అవసరం లేదు. ఆయనలో మంచి నటుడు ఉన్నాడు. అయితే ఇకపై తన శారీరక మార్పులు, లుక్స్, నటనపై పెట్టే కష్టంతో పాటు కథల విషయంలో కూడా ఎక్కువ దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది.

ఎందుకంటే హీరో ఎంత కష్టపడినా కథ ప్రేక్షకులకు నచ్చకపోతే సినిమా విజయం సాధించడం కష్టం. సరైన కథ, బలమైన స్క్రీన్‌ప్లే, ప్రేక్షకులకు కనెక్ట్ అయ్యే పాత్ర దొరికితే విజయ్ మళ్లీ తన పాత ప్రభావాన్ని చూపించగలరు. ప్రస్తుతం విజయ్ దేవరకొండకు కావాల్సింది మరో ప్రయోగం కాదు.. ఒక బలమైన కథతో వచ్చే భారీ విజయం.