Begin typing your search above and press return to search.

విధానం మార్చిన న‌యా స్టార్!

విజయ్ దేవరకొండ పని తీరులో కీలక మార్పులతో ఇండ‌స్ట్రీ వర్గాలను ఆశ్చర్యపరుస్తున్నాడు.

By:  Srikanth Kontham   |   15 April 2026 1:00 PM IST
విధానం మార్చిన న‌యా స్టార్!
X

విజయ్ దేవరకొండ పని తీరులో కీలక మార్పులతో ఇండ‌స్ట్రీ వర్గాలను ఆశ్చర్యపరుస్తున్నాడు. గతంలో ఒక‌ సినిమా పూర్త‌య్యే వ‌ర‌కూ మ‌రో సినిమాను ప‌ట్టాలెక్కించేవాడు కాదు. ఆ సినిమా ఫ‌లితం చూసుకుని త‌ర్వ‌త సినిమా విష‌యంలో నిర్ణ‌యాలు తీసుకునేవాడు. అయితే ఇప్పుడు ఆ పద్ధతిని పక్కన పెట్టి మల్టీ టాస్కింగ్ కు శ్రీకారం చుట్టాడు. ప్రస్తుతం విజ‌య్ `రణబాలి` , `రౌడీ జనార్దన` చిత్రాల షూటింగ్‌లను ఏకకాలంలో పూర్తి చేసే ప‌నిలో బిజీగా ఉన్నాడు. కొత్త‌గా పెళ్లైనా పెద్ద‌గా స‌మ‌యం కేటాయించ‌కుండా విజ‌య్ షూటింగ్ ల‌పైనే ఫోక‌స్ చేయ‌డం ఇంట్రెస్టింగ్. ఈ ప్రోస‌స్ లో విజయ్ దేవరకొండ డేట్స్‌ను చాలా పక్కాగా ప్లాన్ చేసుకుంటున్నాడు.

ఒక వారం `రణబాలి` సెట్స్‌లో కనిపిస్తే, మరుస‌ వారం `రౌడీ జనార్దన` యూనిట్‌తో కలిసిపోతున్నాడు. ఈ రెండు చిత్రాలు వేర్వేరు జోనర్లు అయినా? పాత్రల మధ్య వ్యత్యాసం ఉన్నా? ఎక్క‌డా రాజీ ప‌డ‌కుండా ప‌నిచేస్తున్నాడు. ఏక కాలంలో రెండు షూటింగ్ ల‌కు హాజ‌ర‌వ్వ‌డం స‌వాల్ గా మారిన స్వీక‌రించి ప‌ని చేస్తున్నాడు. సినిమా ఫలితం కోసం ఏళ్ల తరబడి వేచి చూడకుండా? వీలైనంత త్వరగా చిత్రాలను ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలనేది ఆయన ప్రధాన ఉద్దేశంగా కనిపిస్తోంది. ఈ నేప‌థ్యంలో త‌దుప‌రి రెండు చిత్రాలు కూడా ఏక కాలంలోనే ప్లాన్ చేస్తున్నాడు.

`హాయ్ నాన్న ఫేమ్ శౌర్యువ్ దర్శకత్వంలో ఒక సినిమా, విలక్షణ దర్శకుడు విక్రమ్ కె. కుమార్ ప్రాజెక్టును కూడా ఏకకాలంలో పట్టాలెక్కించడానికి ప్లాన్ చేస్తున్నాడు. దీంతో ఏడాదికి కనీసం రెండు నుండి మూడు సినిమాలు విడుదలయ్యేలా విజ‌య్ వ్యూహం కనిపిస్తుంది. ఇది విజయ్ కెరీర్‌కు మళ్ళీ పూర్వ వైభవం తీసుకువస్తుందని అభిమానులు ఆశిస్తున్నారు. ప్రస్తుతం స్టార్ హీరోల సినిమాలు విడుదల కావడానికి రెండు మూడు ఏళ్లు పడుతున్న తరుణంలో విజయ్ దేవరకొండ వేగం ఇండస్ట్రీలో చర్చనీయాంశమైంది.

ఒక హీరో ఎక్కువ గ్యాప్ తీసుకోవడం వల్ల ప్రేక్షకుల్లో ఉండే ఆసక్తి తగ్గే అవకాశం ఉందని గ్రహించిన విజ‌య్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. వరుసగా సినిమాలు చేస్తూ బాక్సాఫీస్ వద్ద తన ఉనికిని బలంగా చాటుకోవాలని విజ‌య్ భావిస్తున్నాడు. ఈ వేగం డిస్ట్రిబ్యూటర్లకు - ఎగ్జిబిటర్లకు కూడా ఊరటనిచ్చే విషయమే. అయితే

ఒకేసారి రెండు మూడు సినిమాలపై దృష్టి పెట్టడం అన్న‌ది చిన్న విషయం కాదు. వేర్వేరు లుక్స్ మెయింటైన్ చేయడం, పాత్రల మూడ్‌లోకి మారడం వంటివి ఎంతో శారీరక, మానసిక శ్రమతో కూడుకున్నవి.

అయితే ఆ క‌ష్టాన్ని విజ‌య్ ముందే ఊహించాడు. వ‌చ్చే ఫ‌లితం ఎలా ఉంటుందో కూడా అంచ‌నా వేయ గ‌ల్గుతున్నాడు. సినిమా మేకింగ్ ప్రాసెస్‌లో వేగం పెంచితే ప్రొడక్షన్ ఖర్చు త‌గ్గుతుంది. ఇది నిర్మాత‌ల‌కు ల‌క్ష‌ల్లో ఆదా అవుతుంది. ఓ హీరో ఇలా చేయ‌డం వ‌ల్ల ఓ సినిమా ప్లాప్ అయినా మ‌రో సినిమా తో విజ‌య్ హిట్ ఇస్తాడు? అన్న న‌మ్మ‌కంతో మ‌రో సినిమా చేయ‌డానికి నిర్మాత‌లు ముందుకొస్తారు. అలాగే విజ‌య్ మార్కెట్ వాల్యూను కూడా నిలబెట్టుకోవ‌డానికి ఇది దోహ‌ద ప‌డుతుంది. మొత్తానికి విజయ్ దేవరకొండ అనుస‌రిస్తోన్న‌ నయా విధానం టాలీవుడ్‌లో కొత్త చర్చకు దారితీసింది.