Begin typing your search above and press return to search.

CM రేవంత్‌ని పెళ్లికి ఆహ్వానించిన విజ‌య్ దేవ‌ర‌కొండ

విజయ్ దేవరకొండ-రష్మిక మందన్నల పెళ్లికి సంబంధించి సోషల్ మీడియాలో, టాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారాయి.

By:  Sivaji Kontham   |   15 Feb 2026 11:36 AM IST
CM రేవంత్‌ని పెళ్లికి ఆహ్వానించిన విజ‌య్ దేవ‌ర‌కొండ
X

విజయ్ దేవరకొండ-రష్మిక మందన్నల పెళ్లికి సంబంధించి సోషల్ మీడియాలో, టాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారాయి. తాజాగా అందిన స‌మాచారం ప్ర‌కారం... విజయ్ దేవరకొండ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని క‌లిసి త‌న పెళ్లికి సాధ‌రంగా ఆహ్వానించారు.

విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం.. రెండు ప్ర‌ధాన కార‌ణాల‌తో దేవ‌ర‌కొండ సీఎంని క‌లిసారు. ఒక‌టి పెళ్లి శుభ‌లేఖ అందించేందుకు, అలాగే తెలంగాణలో ఇటీవల జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘనవిజయం సాధించిన నేపథ్యంలో సీఎంను కలిసి విజయ్ అభినందనలు తెలిపేందుకు అని తెలుస్తోంది.

విజ‌య్- ర‌ష్మిక జంట‌ పెళ్లి తేదీ 26 ఫిబ్రవరి 2026 ఫిక్స‌యింది. రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్ లో ఈ వివాహం జ‌ర‌గ‌నుంది. అలాగే మార్చి 4న హైదరాబాద్‌లో భారీ రిసెప్ష‌న్ నిర్వ‌హిస్తారు. దీనికి సినీరాజ‌కీయ రంగాల‌కు చెందిన ప్ర‌ముఖులంతా హాజ‌రుకానున్నారు. ఓవైపు ఈ పెళ్లికి ఆహ్వానాలు అందిస్తూ విజ‌య్, అత‌డి త‌ర‌పు బంధువులు, స‌హాయ‌కులు బిజీ బిజీగా ఉన్నారు. తెర‌వెన‌క జ‌ర‌గాల్సిన ప‌నుల‌న్నీ జ‌రిగిపోతున్నాయి. ప్ర‌ముఖుల‌కు ఇప్ప‌టికే శుభ‌లేఖ‌లు అందుతున్నాయి. అయితే ఇప్ప‌టివ‌ర‌కూ విజ‌య్ కానీ ర‌ష్మిక కానీ దీనిపై ఎలాంటి అధికారిక ప్ర‌క‌ట‌నా చేయ‌లేదు. అధికారికంగా ఇంకా శుభ‌లేఖ‌, వివ‌రాలు బ‌య‌ట‌కు వెల్ల‌డి కాలేదు. కానీ విజ‌య్, అత‌డి కుటుంబీకులు పెళ్లికి సంబంధించిన ఏర్పాట్ల‌లో బిజీ బిజీగా ఉన్నారు.

2025 అక్టోబర్‌లో ఈ జంటకు నిశ్చితార్థం జరిగింది.. అప్పటి నుండే ఫిబ్రవరిలో పెళ్లి ఉంటుందని వార్తలు వచ్చాయి. ఇటీవల రష్మిక మందన్నను ఫిబ్రవరి 26న పెళ్లి కదా? అని ఒక ఫోటోగ్రాఫ‌ర్ ప్ర‌శ్నించ‌గా, త‌ను చిరున‌వ్వు నవ్వుతూ తల ఊపడంతో ఈ వార్తలకు మరింత బలాన్ని చేకూర్చింది. అయితే ఉదయ్‌పూర్‌లోని ఒక ప్యాలెస్‌లో వీరి పెళ్లి కోసం ఏర్పాట్లు జరుగుతున్నట్లు కొన్ని వీడియోలు బయటకు వచ్చాయి. అప్ప‌టి నుంచి ఉద‌య్ పూర్ వెడ్డింగ్ ఖాయ‌మైన‌ట్టేన‌ని అంతా భావిస్తున్నారు. కానీ ఏదీ అధికారికంగా ప్ర‌క‌టించలేదు. ఓవైపు విజ‌య్ స్వ‌యంగా త‌న స‌న్నిహితుల‌కు శుభ‌లేఖ‌లు అందిస్తున్నా కానీ ఏదీ అధికారికంగా ప్ర‌క‌టించ‌క‌పోవ‌డంపై అభిమానుల్లో ఇండ‌స్ట్రీలో క్యూరియాసిటీ నెల‌కొంది.

అయితే ఇత‌ర సెల‌బ్రిటీ జంట‌ల్లానే విజ‌య్- ర‌ష్మిక కాస్త గోప్య‌త కోరుకుంటున్నారు. విరాట్ కోహ్లీ-అనుష్క శర్మ, దీపిక - ర‌ణ్ వీర్ తరహాలో ఈ జంట కూడా చివరి నిమిషం వరకు పెళ్లి విషయాన్ని గోప్యంగా ఉంచి పెళ్లి తర్వాతే ఫోటోలు విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం.

విజయ్ దేవరకొండ సీఎంను కలిసింది తన పెళ్లికి ఆహ్వానించేందుకే.. పెళ్లి ఫిబ్రవరి 26న ఉద‌య్ పూర్ లో ఘ‌నంగా జ‌ర‌గ‌నుంది... మార్చి 4న జ‌రిగే రిసెప్ష‌న్ కి సీఎం రేవంత్ అటెండ‌య్యే అవ‌కాశాలున్నాయని కూడా తెలుస్తోంది.

సీఎం రేవంత్ రెడ్డి మొదటి నుండి `డ్రగ్స్ రహిత తెలంగాణ` కోసం సినీ పరిశ్రమ మద్దతు కోరుతున్నారు. దీనికి దేవ‌ర‌కొండ మ‌ద్ధ‌తుగా ఉన్నారు. గతంలోనూ విజయ్ దేవరకొండ గురించి రేవంత్ రెడ్డి సానుకూల వ్యాఖ్యలు చేశారు. ఆయన తమ సమీప గ్రామం నుండే వచ్చారని కూడా గుర్తు చేసుకున్నారు. ఇప్పుడు విజ‌య్ స్వ‌యంగా రేవంత్ ని త‌న పెళ్లికి ఆహ్వానించ‌డం ఆస‌క్తిని క‌లిగిస్తోంది.