విజయ్ దేవరకొండకు మరో బిగ్ బ్రాండ్ ఆఫర్
విజయ్ దేవరకొండకు ఇది కొత్త కాదు. గత కొన్నేళ్లుగా ఆయన అనేక నేషనల్ ఇంటర్నేషనల్ బ్రాండ్లకు ఫేస్‌గా ఉన్నారు.
By: M Prashanth | 13 Aug 2025 12:21 AM ISTసౌత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో తన ప్రత్యేకమైన స్టైల్, యాటిట్యూడ్ తో కోట్లాది మంది అభిమానులను విజయ్ దేవరకొండ ఇప్పుడు మరో పెద్ద ఆఫర్ ను అందుకున్నారు. రీసెంట్ గా కింగ్ డమ్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన రౌడి స్టార్ మంచి ఓపెనింగ్స్ ను అందుకున్నాడు. సక్సెస్ ఫెయిల్యూర్స్ తో సంబంధం లేకుండా తన స్టార్ హోదాను పెంచుకుంటూ వెళుతున్నాడు.
ఇక ఇప్పుడు నేషనల్ లెవెల్లో మరో బ్రాండింగ్ ప్రమోషన్ తో వైరల్ అవుతున్నాడు. ప్రముఖ బ్రాండ్ మెక్‌డోవెల్స్ సోడా అంబాసడర్ తమ కొత్త బ్రాండ్ అంబాసడర్‌గా విజయ్ దేవరకొండను ప్రకటించింది. ఈ కాంపెయిన్‌లో ఆయనతో పాటు బాలీవుడ్ యంగ్ స్టార్ కార్తిక్ ఆర్యన్ కూడా ఉన్నారు. ఇద్దరూ కలిసి ‘యారీ’ అనే థీమ్‌తో భారత యువతలో స్నేహం అనే బంధాన్ని ప్రోత్సహించనున్నారు.
విజయ్ దేవరకొండకు ఇది కొత్త కాదు. గత కొన్నేళ్లుగా ఆయన అనేక నేషనల్ ఇంటర్నేషనల్ బ్రాండ్లకు ఫేస్‌గా ఉన్నారు. కానీ మెక్‌డోవెల్స్ సోడా లాంటి పాన్ ఇండియా రీచ్ కలిగిన బ్రాండ్‌తో కలిసిపోవడం ఆయనకు మరో స్థాయి గుర్తింపునిస్తుంది. ఈ బ్రాండ్ ప్రత్యేకంగా యువతలో. విజయ్ కూడా తన సినిమాల ద్వారా, ఆఫ్ స్క్రీన్ పర్సనాలిటీ ద్వారా పాజిటివ్ వైబ్రేషన్‌ను అందిస్తారు.
ముఖ్యంగా, ‘యారీ’ అనే కాన్సెప్ట్‌లో విజయ్ భాగమవ్వడం ఫ్యాన్స్‌కు మరింత ఎగ్జైటింగ్. తన ఫ్రెండ్స్ సర్కిల్, ఇండస్ట్రీ ఫ్రెండ్స్, ఫ్యాన్స్‌తో ఆయన చూపే బంధం చాలా ప్రత్యేకం. ఈ కాంపెయిన్‌లో ఆ పాజిటివ్ ఎనర్జీని మెక్‌డోవెల్స్ వినియోగించుకోవడం ఖాయం. అలాగే కార్తిక్ ఆర్యన్‌తో కలసి కలవడంతో రెండు విభిన్న ఇండస్ట్రీల యంగ్ ఐకాన్ల కలయిక ఈ అడ్వర్టైజ్‌మెంట్ నేషనల్ లెవెల్‌లో హైప్ క్రియేట్ చేస్తుంది.
ఇటీవల విజయ్ బ్రాండ్ విలువ మరింత పెరిగింది. వరుసగా పెద్ద సినిమాలు, పాన్ ఇండియా రిలీజ్‌లు, పాజిటివ్ పబ్లిక్ ఇమేజ్ ఆయనను బ్రాండ్లకు హాట్ ఫేవరేట్‌గా మార్చాయి. ‘కింగ్‌డమ్’ విడుదల తరువాత, రాబోయే బిగ్ ప్రాజెక్ట్స్‌లో ఆయన బిజీగా ఉండటం వల్ల మీడియాలో మరియు సోషల్ మీడియాలో ఆయన ప్రెజెన్స్ కూడా టాప్‌లో ఉంది. ఈ సందర్భంలో మెక్‌డోవెల్స్‌తో కలసి పని చేయడం ఆయన మార్కెట్‌ను మరింత బలపరుస్తుందని చెప్పవచ్చు.
