ఏదీ ఎలా ఉన్నా? ఎక్కడా కింగని స్టార్!
విజయ్ దేవరకొండకు సరైన సక్సెస్ పడి చాలా కాలమవుతోంది. `అర్జున్ రెడ్డి`, `గీతగోవిందం`, `టాక్సీవాలా` తప్పమరే చిత్రం హిట్ రేసులో లేదు.
By: Srikanth Kontham | 23 Dec 2025 7:00 PM ISTవిజయ్ దేవరకొండకు సరైన సక్సెస్ పడి చాలా కాలమవుతోంది. 'అర్జున్ రెడ్డి', 'గీతగోవిందం', 'టాక్సీవాలా' తప్పమరే చిత్రం హిట్ రేసులో లేదు. `టాక్సీవాలా` తర్వాత `డియర్ కామ్రేడ్`, `వరల్డ్ ఫేమస్ లవర్`, ` లైగర్` ,` ఖుషీ`, `ది ఫ్యామిలీ స్టార్` చిత్రాలు చేసాడు. వీటిలో సరైన విజయం ఒక్కటీ సాధించలేదు. అయినా ఆ ఫెయిల్యూర్స్ ఏవీ విజయ్ ని ఎక్కడా కింగనివ్వలేదన్నది కాదనలేని నిజం. అతడి ఇమేజ్ పై వరుస పరాజయాలు ఎలాంటి ప్రభావాన్ని చూపించలేకపోయాయి. ఓ సీనియర్ స్టార్ తరహాలోనే విజయ్ సినిమాలకు మార్కెట్ లో డిమాండ్ కనిపిస్తోంది.
దర్శక, నిర్మాతలంతా విజయ్ తో సినిమాలు చేయడానికే అంతే ఆసక్తి చూపిస్తున్నారు. ఆ ప్రభావం మార్కెట్ లో ఏ స్థాయిలో ఉందంటే? విజయ్ వద్దు అన్నా? అడ్వాన్స్ లు ఇచ్చే నిర్మాతలు ఇంటి ముందు క్యూ కట్టేంతలా. వినకుండానే చాలా మంది నిర్మాతలు సూట్ కేసులు చేతిలో పెట్టి వస్తున్నారట. దర్శకులు సైతం అదే స్థాయి లో అతడి కోసం క్యూలో ఉన్నట్లు తెలుస్తోంది. విజయ్ ని కలిసి కథ చెప్పాలిని తిరుగుతోన్న రైటర్లు, దర్శకుల జాబితా అంతకంతకు పెరుగుతోంది. సాధారణంగా ఏ హీరో అయినా ప్లాప్ ల్లో ఉంటే ఇలాంటి సన్నివేశం కనిపించదు.
హీరో కనిపిస్తే ఛాన్స్ ఎక్కడ? అడుగుతాడోనన్న భయంతో ముఖం చాటేసి పోతుంటారు. కానీ విజయ్ ప్లాప్ ల్లో ఉన్నా ఎదురెళ్లి మరీ అడ్వాన్సులు ఇస్తున్నారు. క్రియేటివ్ కూడా వింగ్ క్యూలో ఉంటుంది. దీనందతటికి అసలు కారణం ఏంటి? అంటే అతడు ఏ సినిమా లో నటించినా? ఆ సినిమాకు మార్కెట్ లో క్రియేట్ అవుతోన్న హైప్ అలా ఉంది. సినిమా ప్రచారం చిత్రాలు అలాంటి హైప్ ని తీసుకొస్తున్నాయి. వరల్డ్ ఫేమస్ లవర్ నుంచి ఈ మ్యానియా కనిపిస్తోంది. ఆ తర్వాత పూరితో పని చేసిన `లైగర్` రిలీజ్ కు ముందు ఏ రేంజ్ హైప్ ఇచ్చిందో తెలిసిందే.
బాక్సర్ గా విజయ్ లుఎక్..బాడీ మతిపొగొట్టాయి. `ఖుషీ` సినిమాలో తనలో క్లాసిక్ యాంగిల్ అంతే హైలైట్ అయింది. డీసెంట్ లుక్ తో కూడిన పోస్టర్లు...ప్రచార చిత్రాలు మంచి పాజిటివ్ వైబ్ ని తీసుకొచ్చాయి. `ఫ్యామిలీ స్టార్` విష యంలోనూ ఇదే సన్నివేశం రిపీట్ అయింది. అటుపై `కింగ్ డమ్` తో హైప్ ని ఆకాశానికి తీసుకెళ్లాడు. అందులో విజయ్ లుక్, పోస్టర్లు ప్రతీది బ్రహ్మాండం బద్దలైపోతుందా? అన్న తీరున హైప్ ఇచ్చాడు. తాజాగా `రౌడీ జనార్దన` గ్లింప్స్ ఏ రేంజ్లో హైప్ ఇస్తుందో కనిపిస్తూనే ఉంది. కొన్ని గంటల క్రితమే రిలీజ్ అయిన గ్లింప్స్ కి అభిమానులు ఫిదా అవుతున్నారు. ఇదే హైప్ విజయ్ సినిమాలకు బిజినెస్, మార్కెట్ పరంగా ఎంతో హెల్ప్ అవుతుంది.
