Begin typing your search above and press return to search.

కండిష‌న్స్ లేని ప్రేమ‌ను న‌మ్మ‌ను: విజ‌య్ దేవ‌ర‌కొండ‌

రష్మికతో కొన్నేళ్లుగా త‌న రిలేష‌న్ గురించి అత‌డు ధృవీక‌రించాడు. స‌హ‌న‌టి ర‌ష్మిక‌తో డేటింగ్ గురించి ప్ర‌స్థావించ‌గా అత‌డు దానిని అంగీక‌రించాడు.

By:  Sivaji Kontham   |   5 Oct 2025 10:46 AM IST
కండిష‌న్స్ లేని ప్రేమ‌ను న‌మ్మ‌ను: విజ‌య్ దేవ‌ర‌కొండ‌
X

విజయ్ దేవరకొండ -రష్మిక మందన్న ఫిబ్రవరి 2025 లో వివాహం చేసుకోనున్నారు. నిశ్చితార్థం త‌ర్వాత విజ‌య్ ప్ర‌ముఖ మీడియాతో మాట్లాడుతూ .. తాను ష‌ర‌తులు లేని ప్రేమ‌ను న‌మ్మ‌న‌ని అన్నాడు. అలా ఉంటుంద‌ని త‌న‌కు తెలియ‌ద‌ని కూడా వ్యాఖ్యానించాడు. రష్మికతో కొన్నేళ్లుగా త‌న రిలేష‌న్ గురించి అత‌డు ధృవీక‌రించాడు. స‌హ‌న‌టి ర‌ష్మిక‌తో డేటింగ్ గురించి ప్ర‌స్థావించ‌గా అత‌డు దానిని అంగీక‌రించాడు.

ప్రేమ‌ను పొందటం.. ప్రేమించ‌డం రెండూ తెలుసున‌ని విజ‌య్ అన్నాడు. షరతులు(కండిష‌న్స్) లేని ప్రేమను తాను నమ్మనని వ్యాఖ్యానించారు. ప్రేమ‌లో అంచ‌నాలుంటాయి...అందుకే అది షరతులు లేనిది కాదని అన్నాడు. షరతులు లేకుండా పుట్టే ఏ ప్రేమ గురించి తనకు తెలియదని దేవరకొండ నిజాయితీగా వ్యాఖ్యానించాడు. ఒక‌వేళ అలాంటి ప్రేమ ఉండవచ్చని కూడా అభిప్రాయ‌ప‌డ్డారు. కానీ నేను దానిని ప‌ట్టించుకోన‌న్నాడు. ష‌ర‌తుల‌తో కూడిన ప్రేమ‌లో ఏదైనా ఆశించ‌డం స‌రైన‌దా కాదా! అనేది కూడా త‌న‌కు తెలియ‌ద‌ని అన్నాడు.

వివాహం కెరీర్‌కు ఆటంకం కలిగిస్తుందా? అని ప్ర‌శ్నిస్తే.. మ‌హిళ‌ల‌కు అది కొంచెం క‌ష్టం... నాకు అలాంటిదేమీ లేదు! అని జ‌వాబిచ్చాడు. మ‌నం చేసే ప‌నిపై ఆధారపడి ఉంటుందని కూడా ఆయన అన్నారు. విజయ్ దేవరకొండ కుటుంబంతో ఎక్కువ సమయం గడపాలనుకుంటున్నట్లు కూడా తెలిపాడు. ఇటీవ‌ల తాను ప‌రిణ‌తి చెందిన వాడిగా మారాన‌ని అన్నారు. నిజంగా జీవించడం అంటే ఏమిటో తాను నేర్చుకున్నానని అత‌డు తెలిపాడు. ఇప్పుడు మంచి రిలేష‌న్ షిప్స్ అన్నింటికంటే అవ‌స‌రం! అని ఆయన అన్నారు. త‌ల్లిదండ్రులు, స్నేహితురాలు లేదా స్నేహితుల‌తో ఎక్కువ స‌మ‌యం గ‌డ‌ప‌లేక‌పోయాన‌ని, ఇక‌పై ఆ శాడ్ నెస్ అవ‌స‌రం లేద‌ని కూడా అన్నాడు. అంద‌రితో మంచి స‌మ‌యం గ‌డుపుతాన‌ని అన్నాడు.