అసలైన వార్ అప్పుడే మొదలవుతుంది
సినీ ఇండస్ట్రీలో ఇప్పుడు సీక్వెల్స్ ట్రెండ్ బాగా ఎక్కువైపోయింది. కథకు అవసరమున్నా లేకున్నా దాన్ని రెండు పార్టులుగా చేసి సీక్వెల్స్ పై ఉన్న క్రేజ్ ను క్యాష్ చేసుకుంటున్నారు.
By: Sravani Lakshmi Srungarapu | 3 Aug 2025 11:50 AM ISTసినీ ఇండస్ట్రీలో ఇప్పుడు సీక్వెల్స్ ట్రెండ్ బాగా ఎక్కువైపోయింది. కథకు అవసరమున్నా లేకున్నా దాన్ని రెండు పార్టులుగా చేసి సీక్వెల్స్ పై ఉన్న క్రేజ్ ను క్యాష్ చేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే ఇప్పటికే చాలా సినిమాలకు సీక్వెల్స్ వచ్చాయి. మరి కొన్ని సినిమాలకు సీక్వెల్స్ రానున్నాయి. ఇంకొన్ని సినిమాలు సెట్స్ పై ఉన్నాయి.
ఊహించని ఓపెనింగ్స్ తో కింగ్‌డమ్
తాజాగా టాలీవుడ్ రౌడీ హీరో విజయ్ దేవరకొండ, జెర్సీ ఫేమ్ గౌతమ్ తిన్ననూరి కాంబినేషన్ లో వచ్చిన సినిమా కింగ్‌డమ్. సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్ సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమా జులై 31న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఎవరూ ఊహించని ఓపెనింగ్స్ తో రిలీజైన కింగ్‌డమ్ కు ఆడియన్స్ నుంచి మిక్డ్స్ టాక్ వచ్చింది.
రెండు భాగాలుగా కింగ్‌డమ్
సినిమా రిలీజయ్యాక కూడా కింగ్‌డమ్ కు ఎడతెరిపి లేకుండా ప్రమోషన్స్ చేస్తున్నారు చిత్ర యూనిట్. అయితే కింగ్‌డమ్ సినిమా కూడా రెండు భాగాలుగా రానున్న విషయం తెలిసిందే. అయితే ఓ సందర్భంగా నిర్మాత నాగవంశీకి కింగ్‌డమ్2 గురించి ప్రశ్న ఎదురైంది. దానికి ఆయన సమాధానమిస్తూ, త్వరలోనే కింగ్‌డమ్ కు సీక్వెల్ ఉంటుందని అన్నారు.
విజయ్ కమిట్‌మెంట్స్ పూర్తయ్యాకే..
విజయ్ దేవరకొండ కమిట్‌మెంట్స్ అన్నీ పూర్తయ్యాక కింగ్‌డమ్2 ను ప్లాన్ చేస్తామని, క్లైమాక్స్ లో చూపించిన సేతు క్యారెక్టర్ ను ఓ స్టార్ హీరో చేస్తారని, అది చూసి అందరూ సర్‌ప్రైజ్ అవుతారని చెప్పిన నాగ వంశీ, ఫస్ట్ పార్ట్ లో హీరోయిన్ క్యారెక్టర్ ను కేవలం పరిచయం మాత్రమే చేశామని, సెకండ్ పార్ట్ లో భాగ్యశ్రీ బోర్సే పాత్ర ఎక్కువగా ఉంటుందని, అప్పటి నుంచే హీరో, హీరోయిన్ మధ్య అసలైన వార్ మొదలవుతుందని, సెకండ్ పార్ట్ లో ఆమె లీడ్ రోల్ లో కనిపిస్తారని నాగవంశీ స్పష్టం చేశారు.
విజయ్ చేతిలో రెండు క్రేజీ ప్రాజెక్టులు
ఇక విజయ్ దేవరకొండ కెరీర్ విషయానికొస్తే ప్రస్తుతం అతని చేతిలో రెండు సినిమాలున్నాయి. అందులో ఒకటి రాహుల్ సాంకృత్స్యన్ దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించనున్న పీరియాడిక్ డ్రామా కాగా మరోటి రాజావారు రాణి గారు ఫేమ్ రవి కిరణ్ కోలా దర్శకత్వంలో దిల్ రాజు నిర్మించే రౌడీ జనార్ధన్. ఈ రెండు సినిమాలు పూర్తి కావాలంటే ఎంతలేదన్నా సంవత్సరంన్నరకు పైగా పడుతుంది. ఆ తర్వాతే కింగ్‌డమ్2 ఉంటుంది.
