Begin typing your search above and press return to search.

కింగ్ డమ్ రివ్యూస్ పై.. నాగ వంశీ కామెంట్స్..!

విజయ్ దేవరకొండ కింగ్ డమ్ సినిమాకు వస్తున్న రెస్పాన్స్ చూసి నిర్మాత చాలా హ్యాపీగా ఉన్నారు.

By:  Ramesh Boddu   |   31 July 2025 6:02 PM IST
కింగ్ డమ్ రివ్యూస్ పై.. నాగ వంశీ కామెంట్స్..!
X

విజయ్ దేవరకొండ కింగ్ డమ్ సినిమాకు వస్తున్న రెస్పాన్స్ చూసి నిర్మాత గా చాలా హ్యాపీగా ఉన్నాను అని అన్నారు. సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో నాగ వంశీ ఈ సినిమా నిర్మించారు. సినిమా నేడు రిలీజ్ అవ్వగా మొదటి షో నుంచి పర్వాలేదు అనే టాక్ తెచ్చుకుంది. ఐతే ఈ రిజల్ట్ పై నిర్మాత నాగ వంశీ తన ఆనందాన్ని వ్యక్తం చేశారు. విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ కోరుకున్న హిట్ ఇచ్చామని అన్నారు నగ వంశీ.

హైదరాబాద్ లో 32 షోస్ ఫుల్స్..

సినిమా హైదరాబాద్ లో 32 షోస్ ఫుల్స్ అయ్యాయని. 2025 లో ఈ రేంజ్ టెక్నికల్ హై స్టాండర్డ్స్ తో వచ్చిన సినిమా ఏది లేదని. హాలీవుడ్ లెవెల్ మేకింగ్ తో కింగ్ డం తీశామని అన్నారు. ఈ సినిమా గురించి ఒకరిద్దరు తప్ప అందరు కూడా రివ్యూస్ బాగా ఇచ్చారని అన్నారు. సినిమా 100 శాతం ఏది కుదరదు ఎక్కడో ఒక చోట కొన్ని ఫ్లాస్ ఉంటాయి. అలానే ఈ సినిమా సెకండ్ హాఫ్ లో కొంత డ్రాగ్ అయ్యిందని అన్నారు. ఐతే అవి కూడా చాలా బాగా చెప్పారని అన్నారు నాగ వంశీ.

కింగ్ డమ్ రివ్యూస్ పట్ల కూడా తన సంతృప్తి వ్యక్తపరిచారు నిర్మాత నాగ వంశీ. ఇక సినిమా సీరియస్ నెస్ ని బ్రేక్ చేస్తుందనే హృదయం లోపల సాంగ్ తీసేశామని అన్నారు. ఐతే విజయ్ దేవరకొండ కిస్ సీన్ ఉంటే బాగుంటుందని అందరు అనుకున్నారు. సెకండ్ హాఫ్ లో ఆ సాంగ్ పెట్టాల్సింది అన్నారు. కానీ అది సినిమా ఫ్లోని దెబ్బతీస్తుందని అలా చేశామని అన్నారు. ఇక క్లైమాక్స్ కు మంచి రెస్పాన్స్ వస్తుందని అన్నారు నాగ వంశీ.

సినిమా రెస్పాన్స్ కి సూపర్ హ్యాపీ..

విజయ్ దేవరకొండ కూడా సినిమాకు వస్తున్న రెస్పాన్స్ కి సూపర్ హ్యాపీగా ఉన్నాను అని అన్నారు. అంతకుముందు అర్జున్ రెడ్డి టైం లో రిలీజ్ ముందు ఫ్రెండ్స్ తో చిల్ అయ్యే వాడిని.. ఆఫ్టర్ లాంగ్ టైం ఫ్రెండ్స్ అంతా అలా చేద్దామని అంటే నిన్న నైట్ 10 నుంచి యూఎస్ లో షోస్ పడినప్పటి నుంచి ఫోన్లు మోగుతూనే ఉన్నాయ్. సినిమా తో హిట్ కొట్టామని చెబుతున్నారని అన్నాడు విజయ్ దేవరకొండ. విజయ్ దేవరకొండ కింగ్ డం సినిమాను గౌతమ్ తిన్ననూరి డైరెక్ట్ చేశాడు. భాగ్య శ్రీ బోర్స్ హీరోయిన్ గా నటించిన ఈ సినిమాకు అనిరుద్ మ్యూజిక్ బాగా సపోర్ట్ చేసింది.