విజయ్ దేవరకొండ.. అలా చేయకపోవడం చాలా బెటర్!
టాలీవుడ్ హీరో విజయ్ దేవరకొండ.. లీడ్ రోల్ లో నటించిన కింగ్డమ్ మూవీ రిలీజ్ కు సమయం ఆసన్నమైంది.
By: M Prashanth | 30 July 2025 12:55 AM ISTటాలీవుడ్ హీరో విజయ్ దేవరకొండ.. లీడ్ రోల్ లో నటించిన కింగ్డమ్ మూవీ రిలీజ్ కు సమయం ఆసన్నమైంది. మరికొన్ని గంటల్లో.. అంటే జులై 31న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా విడుదల కానుంది. ఇప్పటికే సినిమాపై ఆడియన్స్ తో పాటు అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్న విషయం తెలిసిందే.
వరుస అప్డేట్స్, ప్రమోషనల్ కంటెంట్ తో మంచి బజ్ క్రియేట్ చేశారు మేకర్స్. ఇంటర్వ్యూలు, ఈవెంట్స్ తో కూడా సందడి చేశారు. దీంతో సినిమాతో హిట్ అందుకుంటారని అంతా అంచనా వేశారు. అదే సమయంలో గురువారం సినిమా రిలీజ్ కానుండగా.. బుధవారం రాత్రి ప్రీమియర్స్ వేస్తారని రీసెంట్ గా టాక్ వినిపించింది.
కానీ ఆ విషయంపై మేకర్స్ వెనక్కి తగ్గినట్టు ఉన్నారు. ఎందుకంటే ఇప్పటి వరకు అనౌన్స్మెంట్ చేయలేదు. కాబట్టి ప్రీమియర్స్ లేనట్లే. అయితే ప్రీమియర్స్ వేయకపోవడం ఇప్పుడు చాలా బెటర్ అని కొందరు నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. బుధవారం రోజు రాత్రి ప్రీమియర్స్ వేస్తే రిస్క్ అని పెడుతున్నారు.
వర్కింగ్ డే రోజు ప్రీమియర్స్ వేస్తే కొందరికే క్లిక్ అవుతుందని.. అందరికీ కాదని అంటున్నారు. రీసెంట్ గా హరిహర వీరమల్లు సినిమా విషయంలో జరిగిన దాన్ని ఉదహరిస్తున్నారు. చిన్న హీరోల సినిమాలు.. వీక్ డే రోజు ప్రీమియర్స్ వేసినా కాస్త లాభం ఉంటుందని, సోషల్ మీడియా టాక్ కోసం ఆయా చిత్రాల మేకర్స్ అలా చేస్తారని చెబుతున్నారు.
విజయ్ దేవరకొండ టైర్ 2 హీరో అని గుర్తు చేస్తున్నారు. వరుస ఫ్లాపులు వస్తున్నా.. క్రేజ్ ఏ మాత్రం తగ్గలేదని అంటున్నారు. అందుకే వివిధ బ్యానర్లపై పాన్ ఇండియా చిత్రాలు చేస్తున్న విషయాన్ని గుర్తు చేస్తున్నారు. భారీ బడ్జెట్ తో కింగ్డమ్ మూవీ రూపొందిందని.. అందుకే రిస్క్ అస్సలు చేయకపోవడమే బెటర్ అని అంటున్నారు.
అదే సమయంలో ఉదయం ఏడింటికే ఎక్స్ ట్రా షో వేయడం మంచి స్ట్రాటజీగా చెబుతున్నారు. నైట్ షో వేసి టాక్ వల్ల ఇబ్బంది పడే బదులు.. ఇదే చాలా బెస్ట్ అంటున్నారు. అయితే సినిమా గురువారం వస్తుంది కాబట్టి.. ఒక్క రోజు తర్వాత వీకెండ్ ఉంటుంది. సినిమా టాక్ పాజిటివ్ గా వస్తే చాలు.. కచ్చితంగా దూసుకుపోవడం పక్కా. వీరమల్లు వసూళ్లు ఆల్రెడీ తగ్గాయి. మహావతార నరసింహను ఇప్పటికే చాలా మంది చూస్తున్నారు. కాబట్టి కింగ్డమ్ వైపే మొగ్గు చూపుతారు. మరేం జరుగుతుందో వేచి చూడాలి.
