విజయ్ విషయంలో నిర్మాత చెప్పింది నిజమే!
ప్రస్తుతం జెనరేషన్ పూర్తిగా మారిపోయింది. జెనరేషన్ తో పాటూ సినీ ఇండస్ట్రీ కూడా మారింది.
By: Sravani Lakshmi Srungarapu | 29 July 2025 12:55 PM ISTప్రస్తుతం జెనరేషన్ పూర్తిగా మారిపోయింది. జెనరేషన్ తో పాటూ సినీ ఇండస్ట్రీ కూడా మారింది. దానికి తగ్గట్టే ఆడియన్స్ అభిరుచిలో మార్పులొచ్చాయి. కొన్ని సినిమాలు ఎందుకు బాగా పెర్ఫార్మ్ చేస్తాయో తెలియకపోతే మరికొన్ని సినిమాలు ఎందుకు ఫ్లాపవుతాయో తెలియదు. కొన్ని సినిమాలకు ఎంత మంచి టాక్ వచ్చినా అవి బాక్సాఫీస్ వద్ద అసలు ఆడవు. ఫలితంగా ఫ్లాపులుగా నిలుస్తాయి.
ఏ సినిమాలు ఆడుతున్నాయో అర్థం కావడం లేదు
ఇదే విషయాన్ని కింగ్‌డమ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో రౌడీ హీరో విజయ్ దేవరకొండ అన్నారు. ప్రీ రిలీజ్ ఈవెంట్ లో భాగంగా విజయ్ మారుతున్న సినిమా పరిస్థితిని, ఆడియన్స్ తో తనకున్న అనుబంధంతో పాటూ మరికొన్ని ఆలోచనలను ఆడియన్స్ తో షేర్ చేసుకున్నారు. ఇప్పుడు ఏ సినిమాలు బాక్సాఫీస్ వద్ద వర్కవుట్ అవుతున్నాయో తనకు అర్థం కావడం లేదని ఈ సందర్భంగా విజయ్ అన్నారు.
ఓపిక ఉన్నంత వరకు చేస్తూనే ఉంటా
ఇండస్ట్రీలో ఎప్పుడేం జరుగుతుందో ఎవరూ ఊహించలేమన్నారు విజయ్. ఆడియన్స్ కు తాను సినిమాలతోనే పరిచయమయ్యానని, ఇప్పటివరకు తాను వర్క్ చేసిన ప్రతీ సినిమాకీ తన వంతుగా పూర్తి కృషి చేశానని విజయ్ ఆడియన్స్ తో చెప్పారు. అంతేకాదు, తనకు ఓపిక ఉన్నంత వరకు ఎప్పుడూ ఏదొకటి చేసి ఆడియన్స్ ను ఎంటర్టైన్ చేయడానికి ప్రయత్నిస్తూనే ఉంటానని కూడా విజయ్ పేర్కొన్నారు.
విజయ్ లో చాలానే మార్పులు
నిర్మాత నాగవంశీ చెప్పినట్టు విజయ్ దేవరకొండ ఒకప్పటిలా అగ్రెస్సివ్ గా లేరు. విజయ్ లో చాలా మార్పులొచ్చాయి. చాలా కామ్ గా, మెచ్యూర్డ్ గా మాట్లాడుతున్నారని విజయ్ మాటల్ని బట్టి అర్థమవుతుంది. అతని మాటల్లో ఆత్మ పరిశీలన చాలా స్పష్టంగా కనిపిస్తోంది. ఏ నటుడికైనా స్టార్‌డమ్ కంటే ఎక్కువగా అదే ముఖ్యమని విజయ్ గ్రహించినట్టున్నారు.
కింగ్‌డమ్ పై కాన్ఫిడెన్స్
ఇక కింగ్‌డమ్ విషయానికొస్తే గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా జులై 31న పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే అడ్వాన్స్ బుకింగ్స్ మొదలవగా కింగ్‌డమ్ కు మంచి బుకింగ్స్ జరుగుతున్నాయి. రిలీజ్ దగ్గర పడుతున్న కొద్దీ కింగ్‌డమ్ పై అందరికీ ఆసక్తి, అంచనాలు పెరిగిపోతుననాయి. విజయ్ కూడా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద వర్కవుట్ అవుతుందని చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నారు. మరి కింగ్‌డమ్ విజయ్ కు ఎలాంటి ఫలితాన్నిస్తుందో చూడాలి.
