Begin typing your search above and press return to search.

కింగ్‌డమ్: ఎమోషన్స్ తో కట్టిపడేసే యాక్షన్ డ్రామా

నిర్మాత సూర్యదేవర నాగ వంశీ మాట్లాడుతూ, “ఈ మధ్యకాలంలో సినిమాలకు ఓపెనింగ్స్ రాబట్టడం ఒక పెద్ద ఛాలెంజ్.

By:  M Prashanth   |   30 July 2025 8:27 PM IST
కింగ్‌డమ్: ఎమోషన్స్ తో కట్టిపడేసే యాక్షన్ డ్రామా
X

టాలీవుడ్ యువ హీరో విజయ్ దేవరకొండ నటించిన “కింగ్‌డమ్” చిత్రం ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ వ రిలీజ్‌కు సిద్ధమవుతోంది. భాగ్యశ్రీ బోర్సే కథానాయికగా, గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రంలో సత్యదేవ్ కీలక పాత్ర పోషించారు. సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్లపై సూర్యదేవర నాగ వంశీ, సాయి సౌజన్యలు నిర్మించిన ఈ సినిమాకు రాక్‌స్టార్ అనిరుధ్ రవిచందర్ సంగీతాన్ని అందించారు. ఇప్పటికే విడుదలైన టీజర్, పాటలు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ట్రైలర్‌తో సినిమాపై అంచనాలు మరింతగా పెరిగాయి. జూలై 31న ప్రేక్షకుల ముందుకు రాబోతున్న కింగ్‌డమ్‌ను తెలుగు సినీ ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

ప్రెస్ మీట్‌లో వివరణ

సినిమా విడుదలకు ముందు ప్రెస్ మీట్ ఏర్పాటు చేసిన చిత్ర యూనిట్, సినిమా పట్ల తమ భావాలను షేర్ చేసుకున్నారు. హీరో విజయ్ దేవరకొండ మాట్లాడుతూ, “సినిమా అవుట్ పుట్ పట్ల మేము చాలా సంతృప్తిగా ఉన్నాము. బుకింగ్స్‌కు వస్తున్న అద్భుతమైన రెస్పాన్స్ చూసిన తరువాత చాలా ఆనందంగా అనిపించింది. తెలుగు ప్రేక్షకులు ఇస్తున్న ఆత్మీయతే మమ్మల్ని ముందుకు నడిపిస్తోంది. జెర్సీ తర్వాత గౌతమ్ తిన్ననూరి తీసిన ఈ కింగ్‌డమ్‌లో ఎమోషన్స్ కట్టిపడేస్తాయి. ఈ కథలోని యుద్ధం, కుటుంబం, ప్రేమ కోసం జరిగే పోరాటం ప్రతి ప్రేక్షకుడిని టచ్ చేస్తుంది. సినిమా మొదలైన రెండు నిమిషాలకే ‘కింగ్‌డమ్’ ప్రపంచంలోకి వెళ్లిపోతారు. థియేటర్‌కి వచ్చిన ప్రతి ఒక్కరికి ప్రత్యేక అనుభూతి ఇస్తుంది,” అన్నారు.

మొదటి టెస్ట్ లో పాస్ అయ్యాము

నిర్మాత సూర్యదేవర నాగ వంశీ మాట్లాడుతూ, “ఈ మధ్యకాలంలో సినిమాలకు ఓపెనింగ్స్ రాబట్టడం ఒక పెద్ద ఛాలెంజ్. ఈ పరంగా చూస్తే మేము మొదటి పరీక్షలో పాస్ అయ్యాము. బుకింగ్స్ బాగున్నాయి. మంచి వసూళ్లతో సినిమా ఘన విజయం సాధిస్తుందని ఆశిస్తున్నాం. ఇది పూర్తిస్థాయి యాక్షన్ మూవీ కాదు. గౌతమ్ తిన్ననూరి శైలిలోని ఎమోషన్లతో, అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునే గ్యాంగ్‌స్టర్ డ్రామాగా రూపొందించాం. ఈ సినిమా కోసం సెట్స్ కాకుండా ఎక్కువ భాగం రియల్ లొకేషన్లలో షూట్ చేశాం. మా టీమ్ పడిన కష్టం తెరపై కనిపిస్తుంది,” అన్నారు.

కథానాయిక భాగ్యశ్రీ బోర్సే మాట్లాడుతూ, “కింగ్‌డమ్‌లో మధు అనే పాత్ర పోషించాను. గౌతమ్ గారు కటాకు తగ్గట్టుగా నా పాత్రను అద్భుతంగా మలిచారు. విజయ్ లాంటి టాలెంటెడ్ నటుడితో కలిసి పనిచేయడం ఎంతో సంతోషంగా ఉంది. సినిమా ప్రేక్షకులకు నచ్చుతుందని ఆశిస్తున్నాను,” అన్నారు.

సాంకేతిక బృందం, సినిమా హైలైట్స్

కింగ్‌డమ్ చిత్రానికి గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహించగా, నిర్మాతలుగా సూర్యదేవర నాగ వంశీ, సాయి సౌజన్యలు వ్యవహరించారు. సంగీతాన్ని అనిరుధ్ రవిచందర్ అందించగా, సినిమాటోగ్రఫర్స్ జోమోన్ టి.జాన్ ISC, గిరీష్ గంగాధరన్ ISC వర్క్ చేశారు. కాస్ట్యూమ్ డిజైనర్‌గా నీరజ్ కోన, కళా దర్శకుడిగా అవినాష్ కొల్లా పని చేశారు. సినిమా ఎమోషన్లతో పాటు, యాక్షన్, విజువల్ ప్రెజెంటేషన్ పక్కాగా ఉండబోతోందన్న నమ్మకంతో అభిమానులు ఎదురుచూస్తున్నారు.

కింగ్‌డమ్ సినిమా ట్రైలర్‌తో మరింతగా క్రేజ్ తెచ్చుకుంది. ప్రేక్షకుల్లో భారీగా అంచనాలు నెలకొన్నాయి. బుకింగ్స్‌ను బట్టి చూస్తే, సినిమా థియేటర్లలో మంచి వసూళ్లు సాధించబోతోందని ట్రేడ్ వర్గాలు భావిస్తున్నాయి. విజయ్ దేవరకొండ కెరీర్‌లో మరో హిట్ మూవీగా నిలుస్తుందన్న నమ్మకంతో అభిమానులు భారీగా ఎదురుచూస్తున్నారు. ఇక జూలై 31న ఈ సినిమా ఎలా ఉండబోతుందో చూడాలి.