Begin typing your search above and press return to search.

కింగ్ డమ్ రిజల్ట్.. దిల్ రాజు వెయిటింగ్..?

శ్రీరాం వేణు మీద పెట్టుకున్న నమ్మకం అంతా కూడా వృధా అయ్యింది. నెక్స్ట్ నితిన్ తోనే ఎల్లమ్మ ఉంది.

By:  Ramesh Boddu   |   29 July 2025 7:00 PM IST
కింగ్ డమ్ రిజల్ట్.. దిల్ రాజు వెయిటింగ్..?
X

విజయ్ దేవరకొండ కింగ్ డమ్ రిజల్ట్ కోసం దిల్ రాజు ఎంతో ఈగర్ గా ఎదురుచూస్తున్నాడు. అదేంటి కింగ్ డమ్ ప్రొడ్యూసర్ దిల్ రాజు కాదు కదా మరి ఆయన ఎందుకు ఈ సినిమా విజయ్ కోసం ఎదురుచూస్తాడంటే.. వరుస ఫ్లాపులతో తన బ్యానర్ లో ఎప్పుడు లేని డౌన్ ఫాం చూస్తున్నాడు దిల్ రాజు. గేమ్ ఛేంజర్ లాంటి ఫ్లాప్ తర్వాత సంక్రాంతికి వస్తున్నాం కాస్త కుదుట పడేలా చేసినా మళ్లీ తమ్ముడుతో తగిన షాక్ మామూలుగా లేదు.

విజయ్ దేవరకొండతో రౌడీ జనార్ధన్..

శ్రీరాం వేణు మీద పెట్టుకున్న నమ్మకం అంతా కూడా వృధా అయ్యింది. నెక్స్ట్ నితిన్ తోనే ఎల్లమ్మ ఉంది. విజయ్ దేవరకొండతో రౌడీ జనార్ధన్ చేస్తున్నాడు. ఈ రెండు సినిమాల మీద హోప్స్ ఉన్నాయి. ఐతే విజయ్ దేవరకొండ మరో రెండు రోజుల్లో కింగ్ డమ్ తో వస్తున్నాడు. ఈ సినిమా హిట్ అయితే రౌడీ జనార్ధన్ కి మంచి క్రేజ్ వస్తుంది. అందుకే కింగ్ డమ్ రిజల్ట్ ఎలా ఉంటుందా అన్న ఆసక్తి దిల్ రాజుకి ఉంది.

మరోపక్క కింగ్ డమ్ సినిమా సితార ఎంటర్టైన్మెంట్ బ్యానర్ లో వస్తుంది. నాగ వంశీకి దిల్ రాజు మధ్య మంచి ర్యాపో ఉంది. సితార ప్రతి సినిమా నైజాం దిల్ రాజుకే ఇస్తుంది. అందుకే కింగ్ డం కూడా SVC రిలీజ్ ఉందని తెలుస్తుంది. సో అలా చూసినా విజయ్ దేవరకొండ కింగ్ డమ్ హిట్ పడితే దిల్ రాజు లాభ పడే ఛాన్స్ ఉంటుంది.

రౌడీ హీరో దెబ్బ బాక్సాఫీస్ ని షేక్ చేసేలా..

అలా కింగ్ డమ్ రెండు కారణాల వల్ల దిల్ రాజు ఈ సినిమా రిజల్ట్ గురించి ఎదురుచూసేలా చేసింది. ఐతే కింగ్ డమ్ మూమెంట్ చూస్తుంటే మాత్రం ఈసారి రౌడీ హీరో దెబ్బ బాక్సాఫీస్ ని షేక్ చేసేలా ఉందనిపిస్తుంది. గౌతం తిన్ననూరి కూడా సినిమాపై చాలా కాన్ ఫిడెంట్ గా ఉన్నాడు. సో వీడీ కింగ్ డమ్ హిట్ పడితే మాత్రం దిల్ రాజుకి సూపర్ హ్యాపీ అన్నట్టే లెక్క.

విజయ్ దేవరకొండ కూడా కెరీర్ లో ఒక సాలిడ్ హిట్ కొట్టి చాలా ఏళ్లు అవుతుంది. అందుకే కెరీర్ ని మరింత స్ట్రాంగ్ చేసుకునేందుకు ఈ సినిమా హిట్ అతనికి అవసరం. మరి అసలు ఫలితం ఏంటన్నది గురువారం మొదటి ఆటతో తేలుతుంది.