కింగ్ డమ్ 2.. సంకట పరిస్థితే..!
ఇదిలాఉంటే కింగ్ డమ్ చివర్లో సమాధానం ఇవ్వని ప్రశ్నలు కొన్ని అలా వదిలేశాడు గౌతం తిన్ననూరి.
By: Ramesh Boddu | 7 Aug 2025 12:00 PM ISTవిజయ్ దేవరకొండ కింగ్ డమ్ కి చేసిన హడావిడి ఆ సినిమా కలెక్ట్ చేసిన కలెక్షన్స్ కి సంబంధమే లేదు. గౌతం తిన్ననూరి డైరెక్షన్ లో సితార నాగ వంశీ ఈ మూవీ నిర్మించారు. ఐతే ఈ సినిమా గౌతం తిన్ననూరి కింగ్ డమ్ అని రిలీజ్ ముందు నానా హంగామా చేశాడు నిర్మాత నాగ వంశీ. ఆయన సినిమా ఆహా ఓహో అనేశాడు కానీ ఆడియన్స్ మాత్రం ఇది జస్ట్ బిలో యావరేజ్ మూవీ అని స్టాంప్ వేశారు. విజయ్ నుంచి వచ్చిన మాస్ యాక్షన్ సినిమా కాబట్టి ఫ్యాన్స్ వరకు బాగానే ఖుషి అయ్యారు.
కింగ్ డమ్ కలెక్షన్స్ పోస్టర్స్..
ఐతే ఎటొచ్చి కామన్ ఆడియన్స్ మాత్రం విజయ్ కింగ్ డమ్ చూసి పెదవి విరిచారు. తొలి వీకెండ్ తర్వాత మండే నుంచి కింగ్ డమ్ కి కలెక్షన్స్ పూర్తిగా తగ్గిపోయాయి. ఇక వారం లో సినిమా ఎంత వసూలు చేసింది. బ్రేక్ ఈవెన్ కి ఎంత తీసుకు రావాలన్నది డీటైల్స్ బయటకు రావాల్సి ఉంది. ఐతే కింగ్ డమ్ కలెక్షన్స్ పోస్టర్స్ మాత్రం వేస్తూనే ఉన్నారు మేకర్స్.
ఇదిలాఉంటే కింగ్ డమ్ చివర్లో సమాధానం ఇవ్వని ప్రశ్నలు కొన్ని అలా వదిలేశాడు గౌతం తిన్ననూరి. అంటే కింగ్ డం 2 కూడా ఉందని హింట్ ఇచ్చేశాడు. ఐతే కింగ్ డమ్ హిట్టైతే పార్ట్ 2 మీద ఆసక్తి ఉండేది. కానీ కింగ్ డమ్ సినిమానే ఇంకా బ్రేక్ ఈవెన్ కాలేదు. ఆ సినిమా సీక్వెల్ ఎందుకు అనే ఆడియన్స్ కూడా ఉన్నారు. కింగ్ డమ్ ని మరీ అంత తేలికగా తీసి పారేయలేం. ఫస్ట్ హాఫ్ వరకు గౌతం బాగానే ఎంగేజ్ చేశాడు.
సెకండ్ హాఫ్ లో హై యాక్షన్ ఉంటే..
విజయ్ దేవరకొండని కూడా బాగానే వాడాడు. కానీ సెకండ్ హాఫ్ లో మాత్రం అంచనాలు అందుకోలేదు. క్లైమాక్స్ కూడా ఆశించిన స్థాయిలో లేదు. అందుకే కింగ్ డమ్ జస్ట్ అలా మిక్సెడ్ టాక్ తెచ్చుకుంది. ఫస్ట్ హాఫ్ ఉన్నట్టే సెకండ్ హాఫ్ లో హై యాక్షన్ ఉంటే సినిమా రిజల్ట్ వేరేలా ఉండేది. కింగ్ డమ్ నిరాశపరచింది కాబట్టి పార్ట్ 2 చేస్తారా లేదా అన్నది చూడాలి. ఐతే మేకర్స్ మాత్రం కింగ్ డమ్ 2 మీద ఆసక్తిగానే ఉన్నారనిపిస్తుంది.
కింగ్ డమ్ సినిమాలో హీరోయిన్ పోర్షన్ కూడా క్లారిటీ లేకుండా ఉంది. ఒక సాంగ్ కూడా లేపేశారు. సెకండ్ పార్ట్ లో అది క్లారిటీ వస్తుందేమో చూడాలి. మరి కింగ్ డమ్ రిజక్ట్ తేలిపోయింది. ఇది చూశాక కూడా కింగ్ డమ్ 2 నాగ వంశీ తీస్తారా లేదా లైట్ తీసుకుంటారా అన్నది చూడాలి. ఈమధ్య చాలా సినిమాలు ఇలానే రిలీజ్ కు ముందే రెండు భాగాలు అని చెప్పడం.. తీరా మొదటి పార్ట్ మిస్ ఫైర్ అవ్వడంతో ఇక సైలెంట్ అయిపోయారు.
