మరో సీక్వెల్ కూడా అటకెక్కినట్టేనా..?
సినిమా ఫ్యాన్స్ కి నచ్చినా కొన్ని విషయాల్లో ఆడియన్స్ ఆ సినిమాను రిజెక్ట్ చేశారు. కింగ్ డం రిలీజ్ రోజు పాజిటివ్ టాక్ వచ్చినా ఫైనల్ రన్ లో డిజప్పాయింట్ చేసింది.
By: Ramesh Boddu | 4 Dec 2025 12:59 PM ISTజెర్సీతో సూపర్ హిట్ అందుకున్న గౌతం తిన్ననూరి ఆ సినిమానే హిందీలో రీమేక్ చేసి అక్కడ పర్వాలేదు అనిపించుకున్నాడు. ఐతే తెలుగులో జెర్సీ తర్వాత సినిమాగా కింగ్ డమ్ పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. విజయ్ దేవరకొండ హీరోగా గౌతం తిన్ననూరి డైరెక్షన్ లో వచ్చిన కింగ్ డం అంచనాలను అందుకోలేదు. సినిమా ఫ్యాన్స్ కి నచ్చినా కొన్ని విషయాల్లో ఆడియన్స్ ఆ సినిమాను రిజెక్ట్ చేశారు. కింగ్ డం రిలీజ్ రోజు పాజిటివ్ టాక్ వచ్చినా ఫైనల్ రన్ లో డిజప్పాయింట్ చేసింది.
కింగ్ డమ్ చివర్లో పార్ట్ 2 కి లీడ్..
ఐతే కింగ్ డమ్ పై సితార నాగ వంశీ చాలా పెద్ద స్టేట్మెంట్స్ పాస్ చేశారు. కింగ్ డమ్ చాలా పెద్ద సినిమా.. ఆడియన్స్ ని అది సర్ ప్రైజ్ చేస్తుందని అన్నారు. కానీ అదే ఆడియన్స్ సినిమా చూసి డిజప్పాయింట్ అయ్యారు. ఐతే కింగ్ డమ్ చివర్లో పార్ట్ 2 కి లీడ్ ఇచ్చారు మేకర్స్. సో కింగ్ డమ్ 1 మాత్రమే కాదు కింగ్ డమ్ 2 కూడా ఉంటుందని చెప్పకనే చెప్పారు. కానీ పరిస్థితి చూస్తుంటే కింగ్ డమ్ 2 చేసే అవకాశం లేదని అర్ధమవుతుంది.
కింగ్ డమ్ పార్ట్ 2 సినిమా చేయాలనే ఆలోచన మొదటగా మేకర్స్ కి ఉన్నా సీక్వెల్ పై ఆడియన్స్ లో అంత ఇంట్రెస్ట్ లేదన్న పాయింట్ వాళ్లు ఆలోచిస్తున్నారు. అంతేకాదు కింగ్ డమ్ 1 కూడా కమర్షియల్ గా నిరాశపరచింది. అందుకే ఆల్రెడీ ఫెయిల్ అయిన సినిమాకు మళ్లీ బడ్జెట్ పెట్టి సీక్వెల్ తీయడం అన్నది కరెక్ట్ ఛాయిస్ అవ్వదు. అందుకే కింగ్ డం 2 ఎలా చూసినా సెట్స్ మీదకు వెళ్లకపోవచ్చని అనిపిస్తుంది.
సినిమా మీద ఉన్న కాన్ఫిడెన్స్ తో మేకర్స్ అలా..
ఈమధ్య కొన్ని సినిమాలు సెట్స్ మీదకు వెళ్లాక పార్ట్ 2 డిసైడ్ చేసి ఫస్ట్ పార్ట్ ని త్వరగా పూర్తి చేసి వదిలేస్తున్నారు. ఐతే పార్ట్ 1 సక్సెస్ అయితే పార్ట్ 2 గురించి ఆలోచించే ఛాన్స్ ఉంటుంది. అలా కాకుండా పార్ట్ 1 ఫ్లాప్ ఐతే సీక్వెల్ గురించి అసలు పట్టించుకునే అవకాశం లేదు. సినిమా మీద ఉన్న కాన్ఫిడెన్స్ తో మేకర్స్ అలా పార్ట్ 2 అనౌన్స్ చేస్తున్నారు కానీ దాని వల్ల పార్ట్ 1 కి కూడా ఎంతో కొంత నష్టం జరుగుతుంది.
కథ రెండు భాగాలుగా చెప్పాలని ముందే డిసైడ్ అయ్యి.. దానికి ఆడియన్స్ ని కూడా సిద్ధం చేసి అప్పుడు పార్ట్ 1, 2 చేస్తే ఏమో కానీ అలా కాకుండా ఒక సినిమానే అనుకున్నది కాస్త చివర్లో పార్ట్ 2 అని ట్విస్ట్ ఇస్తే అసలకే మోసం వచ్చే పరిస్థితి వచ్చింది. మరి దర్శక నిర్మాతలు ఈ విషయంలో మరోసారి ఒక నిర్ణాయనికి వస్తే బాగుంటుంది.
