కింగ్ డమ్.. సస్పెన్స్ లో సేతు రోల్..?
ఐతే కింగ్ డమ్ 2 ఉంటుందని నిర్మాత నాగ వంశీ ముందు నుంచి చెబుతూ వచ్చాడు. ఐతే కింగ్ డమ్ చివర్లో మురుగన్ ని చంపి హీరో అక్కడి ప్రజలకు నాయకుడు అవుతాడు.
By: Ramesh Boddu | 1 Aug 2025 9:20 AM ISTవిజయ్ దేవరకొండ కింగ్ డమ్ కి పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. సినిమాలో కొన్ని ఫ్లాస్ ఉన్నా అవన్నీ యాక్సెప్ట్ చేసేస్తున్నారు ఆడియన్స్. ముఖ్యంగా విజయ్ దేవరకొండ సినిమాకు ఇలాంటి మాసివ్ రెస్పాన్స్ అతని కెరీర్ కి హెల్ప్ అయ్యేలా ఉంది. గౌతం తిన్ననూరి డైరెక్షన్ లో తెరకెక్కిన కింగ్ డమ్ సినిమాను సితార బ్యానర్ లో నాగ వంశీ నిర్మించారు. కింగ్ డమ్ సినిమాకు రెండో భాగం కూడా ఉంది. కింగ్ డమ్ చివర్లో సమాధానం ఇవ్వని ప్రశ్నలుగా చాలా వదిలేశాడు గౌతం తిన్ననూరి.
కింగ్ డమ్ చివర్లో సేతు..
ఐతే కింగ్ డమ్ 2 ఉంటుందని నిర్మాత నాగ వంశీ ముందు నుంచి చెబుతూ వచ్చాడు. ఐతే కింగ్ డమ్ చివర్లో మురుగన్ ని చంపి హీరో అక్కడి ప్రజలకు నాయకుడు అవుతాడు. మురుగన్ బ్రదర్ సేతు ఫారిన్ నుంచి వస్తాడు. అతన్ని కాళ్ల వరకే చూపించారు. సో పార్ట్ 2 లో విజయ్ దేవరకొండ సేతు ఫైట్ ఉండబోతుంది.
ఇంతకీ కింగ్ డమ్ 2 లో ఆ సేతు పాత్ర చేసేది ఎవరు అన్నది తెలియలేదు. సినిమాకు వచ్చిన పాజిటివ్ రిపోర్ట్స్ కు నిర్మాత నాగ వంశీ ప్రెస్ మీట్ ఏర్పాటు చేశారు. ఈ క్రమంలో కింగ్ డమ్ 2 గురించి ఒక సూపర్ అప్డేట్ ఇచ్చాడు. విజయ్ దేవరకొండ డేట్స్ ఎప్పుడు ఇస్తే కింగ్ డమ్ 2 అప్పుడే చేస్తామని అన్నాడు. అంతేకాదు సినిమా పార్ట్ 2 లో సేతు పాత్రలో ఒక బిగ్ స్టార్ నటిస్తాడని కూడా చెప్పారు నాగ వంశీ.
విలన్ గా నటించే బిగ్ స్టార్ ఎవరు..
విజయ్ కింగ్ డమ్ లో నటించే ఆ బిగ్ స్టార్ ఎవరన్నది డిస్కషన్ మొదలు పెట్టారు. మరి ఆ ఛాన్స్ ఎవరికి ఉంటుంది. విలన్ గా నటించే ఆ హీరో ఎవరన్నది తెలియాల్సి ఉంది. బిగ్ స్టార్ అని నాగ వంశీ ఇచ్చిన హింట్ తో రౌడీ ఫ్యాన్స్ సూపర్ హ్యాపీగా ఉన్నారు. కింగ్ డమ్ సినిమా రెండో భాగం మరింత వైల్డ్ గా ఉండబోతుంది. ఈ సినిమాపై విజయ్ దేవరకొండ పెట్టుకున్న నమ్మకం మాత్రం ఆడియన్స్ నిజం చేశారు. విజయ్ దేవరకొండ నెక్స్ట్ రౌడీ జనార్ధన్ చేస్తున్నాడు. ఆ తర్వాత రాహుల్ సంకృత్యన్ మూవీ ఉంది. మరి కింగ్ డం 2 కి ఎప్పుడు కుదుతుందో చూడాలి.
