'ఎవరేం చెప్పినా.. మనం ఎవరిలా ఉండక్కర్లేదు'
టాలీవుడ్ యువ నటుడు తనూజ్ చంద్రమౌళి రీసెంట్ గా లిటిల్ హార్ట్స్ మూవీతో బ్లాక్ బస్టర్ హిట్ ను అందుకున్న విషయం తెలిసిందే.
By: M Prashanth | 19 Sept 2025 1:27 PM ISTటాలీవుడ్ యువ నటుడు తనూజ్ చంద్రమౌళి రీసెంట్ గా లిటిల్ హార్ట్స్ మూవీతో బ్లాక్ బస్టర్ హిట్ ను అందుకున్న విషయం తెలిసిందే. చిన్న సినిమాగా రిలీజ్ అయిన ఆ మూవీతో పెద్ద విజయాన్ని సొంతం చేసుకున్నారు. రీసెంట్ గా లిటిల్ హార్ట్స్ సక్సెస్ మీట్ లో స్టార్ హీరో విజయ్ దేవరకొండ.. పలు వ్యాఖ్యలు చేస్తూ మౌళికి సజెషన్స్ ఇచ్చారు.
ఎవడెవడో ఏం అడ్వైజ్ లు ఇచ్చినా మనం ఎవరిలా ఉండక్కర్లేదని విజయ్ తెలిపారు. "నేను ఒక వీడియో చూశా.. అందులో మౌళి.. ఈయన మా నాన్న అని చెప్పాడు.. ఈవిడ మా అమ్మ అని తెలిపాడు.. జీవితంలో ఇంతకంటే బిగ్ సక్సెస్ సాధించలేవు. ఎవరైనా ఏమైనా సలహాలు ఇచ్చినా.. మనం ఎవరిలా ఉండక్కర్లేదు" అని అన్నారు.
"మీ పేరెంట్స్ మౌళి అని పేరు పెట్టారు. మనం ఇంకొకరిలా ఉండాలని అనుకోకూడదు" అని తెలిపారు. ప్రస్తుతం విజయ్ చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లోకి సినిమాల్లో వచ్చి స్టార్ హీరోగా మారిన విజయ్ దేవరకొండ.. మంచి సజెషన్ ఇచ్చారని చెబుతున్నారు.
అయితే లిటిల్ హార్ట్స్ సక్సెస్ సెలబ్రేషన్స్ లో భాగమవ్వాలనే ఈవెంట్ కు వచ్చానని విజయ్ తెలిపారు. తన ఈ సినిమాకు సంబంధించిన ప్రతి విషయం తమ్ముడు ఆనంద్ నుంచి తెలిసేని చెప్పారు. మూవీ టీమ్ అందరినీ చూడగానే ప్రత్యేకమైన అనుబంధం పెరిగిందని, అందుకే సినిమా హిట్ అవ్వాలని కోరుకున్నానని పేర్కొన్నారు.
సక్సెస్ సాధించాక.. వారి కళ్లల్లో కనిపించిన ఆనందం చూస్తున్నప్పుడు తనకు ఎంతో తృప్తినిచ్చిందని విజయ్ వెల్లడించారు. ఎవరి అండ లేకుండా వాళ్లను వాళ్లు నమ్మి స్నేహితులంతా కలిసి చేసిన సినిమా ఇది అని చెప్పారు. అందుకే మూవీ హిట్ అవ్వడం ఎంతో కీలకమైనదని అన్నారు. ప్రతి ఒక్కరి జీవితాలు మారిపోతాయని తెలిపారు.
అయితే సినిమా బృందానికి సంబంధించిన వాళ్లతో పాటు పక్కన ఉన్న ఇంకో పది ఇరవై మంది జీవితాలు కూడా త్వరలో మారిపోతాయని అంచనా వేశారు. అదే సమయంలో తనూజ్మౌ ళి తదుపరి సినిమా కోసం తానెంతో ఎదురు చూస్తున్నట్లు పేర్కొన్నారు. టీమ్ అంతా మరిన్ని సక్సెస్ ఫుల్ సినిమాలు చేయాలని కోరుకుంటున్నట్లు చెప్పారు. ప్రస్తుతం విజయ్ కామెంట్స్.. సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతున్నాయి.
