విజయ్ దేవరకొండ పెళ్లిచూపులు కంటే ముందే ఆర్ఎక్స్ 100 చేయాల్సిందా.. డైరెక్టర్ ఏమన్నారంటే?
అజయ్ భూపతి దర్శకత్వంలో 2018లో విడుదలైన ఆర్ఎక్స్ 100 సినిమా గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు.
By: Madhu Reddy | 23 July 2026 3:40 PM ISTఅజయ్ భూపతి దర్శకత్వంలో 2018లో విడుదలైన ఆర్ఎక్స్ 100 సినిమా గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు. యంగ్ హీరో కార్తికేయ ఇండస్ట్రీకి పరిచయం అవుతూ వచ్చిన ఈ చిత్రం ద్వారా పాయల్ రాజ్ పుత్ తెలుగు ప్రేక్షకులను తన నటనతో కట్టిపడేసింది. రావు రమేష్, లక్ష్మణ్ మీసాల, రాంకీ తదితరులు కీలకపాత్రలు పోషించిన ఈ సినిమా.. భారీ విజయాన్ని సొంతం చేసుకొని.. బాక్సాఫీస్ వద్ద అత్యధిక కలెక్షన్స్ వసూలు చేసింది. యువతను విపరీతంగా ఆకట్టుకున్న ఈ చిత్రానికి చేతన్ భరద్వాజ్ మ్యూజిక్ .. కార్తికేయ నటన, పాయల్ గ్లామర్ అన్నీ బాగా కలిసి వచ్చాయి. ముఖ్యంగా ఎవరూ ఊహించని క్లైమాక్స్ సినిమాకి బాగా ప్లస్ అయిందని చెప్పవచ్చు.
ఇక్కడ మరో ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే.. హీరో కార్తికేయ, డైరెక్టర్ అజయ్ భూపతిలకు మొదటి సినిమా కాగా.. అటు పాయల్ రాజ్ పుత్ కి మొదటి తెలుగు సినిమా కావడం గమనార్హం. ఇలా ఈ ముగ్గురికి ఈ సినిమా మంచి బ్రేక్ ఇచ్చింది. ఇకపోతే ఈ సినిమాలో మొదట అనుకున్నది కార్తికేయను కాదట. ఆర్ఎక్స్ 100 సినిమాలో విజయ్ దేవరకొండ చేయాల్సి ఉందని.. పైగా పెళ్లిచూపులు కంటే విజయ్ దేవరకొండకు ఇదే మొదటి సినిమా అంటూ డైరెక్టర్ అజయ్ భూపతి చేసిన కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.
అసలు విషయంలోకి వెళ్తే.. దివంగత నటుడు సూపర్ స్టార్ కృష్ణ మనవడు, దివంగత నటుడు రమేష్ బాబు వారసుడిగా సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెడుతున్నారు జయకృష్ణ. శ్రీనివాస మంగాపురం అనే చిత్రంతో ఇండస్ట్రీకి హీరోగా పరిచయం అవుతున్నారు. ఇక ఈ చిత్రంలో రవీనా టాండన్ కూతురు రషా తడానీ తెలుగు ఇండస్ట్రీకి హీరోయిన్ గా పరిచయం కాబోతోంది. ఈ ఇద్దరి కలయికలో రాబోతున్న తొలి సినిమాకి అజయ్ భూపతి దర్శకత్వం వహించారు. జూలై 30వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానున్న నేపథ్యంలో వరుస ప్రమోషనల్ కార్యక్రమాలను చేపట్టిన డైరెక్టర్ అజయ్ భూపతి.. తాజాగా ఆర్ఎక్స్ 100 మూవీ ఫస్ట్ ఛాయిస్ గురించి చెప్పి అందరిని ఆశ్చర్యపరిచారు.
తాజాగా శ్రీనివాస మంగాపురం సినిమా ప్రమోషన్స్ లో భాగంగా అజయ్ భూపతి మాట్లాడుతూ.. ఆర్ఎక్స్ 100 సినిమా మొదట విజయ్ దేవరకొండతో చేయాల్సింది . పైగా పెళ్లిచూపులు మూవీ కంటే ముందే. అప్పటికి విజయ్ దేవరకొండ అర్బన్.. ఇక ఆర్ఎక్స్ 100 స్టోరీ కథ ఏమో రూరల్.. ఇంకా మాసీగా ఉండేది క్యారెక్టర్ అప్పుడు. నేను ఆర్జీవి దగ్గర పనిచేస్తున్నప్పుడు ఎవడే సుబ్రహ్మణ్యం సినిమాలో చూసి వీడెవడో బాగున్నాడు.. గడ్డంతో ఉన్నాడు.. నా సినిమాకి కూడా ఇలాగే కావాలి కదా అనుకున్నాను. మెడలో చైన్ వేసుకొని గడ్డంతో అలా కనిపించేవాడు.. ఇంకా ఆ లుక్ నాకు గుర్తుంది. ఇక ఆ టైంలో విజయ్ దేవరకొండను పట్టుకొని స్టోరీ కూడా చెప్పాను. ఒకవేళ ఆయన ఒప్పుకొని ఉండి ఉంటే విజయ్ దేవరకొండకి నా సినిమా ఆర్ఎక్స్ 100 మొదటి సినిమా అయ్యేది. అప్పటికి ఆయన ఇంకా పెళ్లిచూపులు సినిమా కథ వినలేదు. గోదావరి బ్యాక్ డ్రాప్.. ఆయన పక్కా తెలంగాణ" అంటూ తెలిపారు.
ఈయన మాటలను విన్న నెటిజన్స్ తెలంగాణ అబ్బాయి కదా అందుకే గోదారి బ్యాక్ డ్రాప్ సెట్ కాదని తన తొలి సినిమాను క్రూరంగా చూపించడం ఇష్టం లేక రిజెక్ట్ చేసి ఉంటాడు అంటూ కామెంట్లు చేస్తున్నారు. ఎవడే సుబ్రహ్మణ్యం తర్వాత విజయ్ దేవరకొండ చేసిన పెళ్లిచూపులు సినిమా మంచి క్లాసిక్ హిట్ అందుకుంది
