Begin typing your search above and press return to search.

బిజీ షెడ్యూల్లో తల్లిదండ్రుల మధ్య హాయిగా నిద్రిస్తున్న రౌడీ హీరో.. రష్మిక స్పెషల్ పోస్ట్!

రౌడీ హీరో విజయ్ దేవరకొండ ప్రస్తుతం వరుస పెట్టి సినిమాలు చేస్తూ బిజీగా మారిన విషయం తెలిసిందే.

By:  Madhu Reddy   |   20 Aug 2026 10:01 AM IST
బిజీ షెడ్యూల్లో తల్లిదండ్రుల మధ్య హాయిగా నిద్రిస్తున్న రౌడీ హీరో.. రష్మిక స్పెషల్ పోస్ట్!
X

రౌడీ హీరో విజయ్ దేవరకొండ ప్రస్తుతం వరుస పెట్టి సినిమాలు చేస్తూ బిజీగా మారిన విషయం తెలిసిందే. ముఖ్యంగా రణబాలి, రౌడీ జనార్ధన్ సినిమా షూటింగ్లో బిజీగా ఉండగా.. సడన్గా ఆయన తల్లిదండ్రులతో కలిసి నిద్రిస్తున్న ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఈ ఫోటోని అటు విజయ్ దేవరకొండ ఇటు రష్మిక పంచుకోవడం హాట్ టాపిక్ గా మారింది. ఇంత బిజీ షెడ్యూల్లో ఆయన తన తల్లిదండ్రుల మధ్య హాయిగా నిద్రించడం చాలా చూడముచ్చటగా ఉంది అంటూ అభిమానులు కూడా కామెంట్లు చేస్తున్నారు. అయితే సడన్గా ఇలా తల్లిదండ్రులతో కలిసి టైం స్పెండ్ చేయడానికి షూటింగ్స్ ఏమైనా ఆగిపోయాయా అంటూ కూడా తమ అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.

అయితే ఈ విషయాన్ని రష్మిక, విజయ్ దేవరకొండ ఇద్దరు పంచుకున్నారు. తన తల్లిదండ్రులతో కలిసి నిద్రిస్తున్న ఫోటోని రష్మిక క్యాప్చర్ చెయ్యగా.. దానిని విజయ్ తన ఇంస్టాగ్రామ్ లో పంచుకున్నారు. ఈ ఫోటోలో అతను తన తల్లిదండ్రుల మధ్య సౌకర్యంగా నిద్రిస్తున్నట్లు కనిపించాడు. ఫోటోతో పాటు విజయ్ ఇలా రాసుకు వచ్చారు." వర్షాల కారణంగా షూటింగ్ రద్దు అయ్యింది. అందుకే చిన్నప్పుడు నాకు ఇష్టమైన ప్రదేశంలో మా తల్లిదండ్రుల మధ్య ఈ మధ్యాహ్నం నేను హాయిగా నిద్రపోగలిగాను. ఇకపోతే రష్మిక మందన్న ఈ ఫోటో తీయడంతో ఆమెకు క్రెడిట్ కూడా ఇచ్చారు.

అయితే ఈ విషయంపై రష్మిక కూడా తిరిగి కామెంట్ కూడా చేసింది. "మీరు గతంలో నేను తీసిన అన్ని ఫోటోలకి క్రెడిట్ ఇవ్వగలరా ? నేను మంచి ఫోటోలు తీస్తున్నానని అభిమానులకు చూపించాలి.. నా ఫోటోగ్రఫీ నైపుణ్యాలు ఎంత అద్భుతంగా ఉన్నాయో అభిమానులతో పంచుకోవాలి కదా " అంటూ రష్మిక జోడించింది. ఇకపోతే ఈ అందమైన కుటుంబ క్షణాన్ని అభిమానులు సైతం ఇష్టపడుతూ విజయ్ - రష్మిక మధ్య ప్రేమకి మరొకసారి మురిసిపోతూ అభిమానులు ఈ ఫోటోని సోషల్ మీడియాలో తెగ షేర్ చేస్తున్నారు. ఏది ఏమైనా రష్మిక తీసిన ఈ ఫోటో అభిమానులను బాగా ఆకట్టుకుంటుంది అని చెప్పవచ్చు.

రష్మిక మందన్న , విజయ్ దేవరకొండ విషయానికి వస్తే.. ఇదివరకే వీరిద్దరి కాంబినేషన్లో గీతగోవిందం, డియర్ కామ్రేడ్ సినిమాలు వచ్చి మంచి విజయాలను అందుకున్నాయి. ఇప్పుడు ముచ్చటగా మూడోసారి రణబాలి అనే చారిత్రక నాటకంలో స్క్రీన్ పంచుకోబోతున్నారు. వివాహం తర్వాత తొలిసారి నటిస్తున్న సినిమా కూడా ఇదే కావడం గమనార్హం. 1854ల నాటి నిజమైన సంఘటనల నుండీ ప్రేరణ పొందిన ఈ చిత్రం సెప్టెంబర్ 11వ తేదీన ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదలకు సిద్ధమవుతోంది. మరొకవైపు విజయ్ దేవరకొండ రౌడీ జనార్ధన్ అనే సినిమాలో నటిస్తుండగా.. అటు రష్మిక మందన్న మైసాతో పాటు మరికొన్ని చిత్రాలలో నటిస్తోంది. ఇక ప్రస్తుతం తన కాలికి సర్జరీ కారణంగా విశ్రాంతి తీసుకుంటున్న విషయం తెలిసిందే.