మౌళి - దేవరకొండ: అప్పుడు అలా.. ఇప్పుడు ఇలా..
ఎలాంటి సౌండ్ లేకుండా ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చిన లిటిల్ హార్ట్స్ మూవీ ఎంతటి హిట్ అయిందో అందరికీ తెలిసిందే.
By: M Prashanth | 13 Sept 2025 1:11 PM ISTఎలాంటి సౌండ్ లేకుండా ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చిన లిటిల్ హార్ట్స్ మూవీ ఎంతటి హిట్ అయిందో అందరికీ తెలిసిందే. రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ గా రూపొందిన ఆ సినిమా రెండు రోజుల్లో బ్రేక్ ఈవెన్ కంప్లీట్ చేసుకుని.. మూడో రోజూ లాభాల్లోకి వచ్చింది. వీకెండ్ కల్లా భారీ వసూళ్లను సాధించి దూసుకుపోతోంది.
వీక్ డేస్ లోనూ సాలిడ్ కలెక్షన్లు రాబట్టి.. ఇప్పుడు సెకెండ్ వీకెండ్ లోకి వచ్చేసింది మూవీ. అయితే సినీ ప్రియులతో పాటు సెలబ్రిటీలను కూడా సినిమా ఎంతగానో ఆకట్టుకుంటోంది. దీంతో ఇప్పటికే అనేక మంది టాలీవుడ్ సెలబ్రిటీలు సోషల్ మీడియాలో సినిమాను ప్రశంసిస్తూ పోస్టులు పెడుతున్నారు. కంగ్రాట్స్ కూడా చెబుతున్నారు.
ఇప్పుడు స్టార్ హీరో విజయ్ దేవరకొండ.. లిటిల్ హార్ట్స్ మూవీ టీమ్ ను కలిశారు. సినిమాతో మ్యాసివ్ సక్సెస్ అందుకున్నందుకు కంగ్రాట్స్ తెలిపారు. ఈ నేపథ్యంలో ఆయనతో దిగిన పిక్ ను ఇప్పుడు లిటిల్ హార్ట్స్ మూవీ తనూజ్ మౌళి సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా ఫుల్ వైరల్ గా మారింది. థాంక్యూ నోట్ ఆకర్షిస్తోంది.
"మీ ఇంటి ఆహ్వానించినందుకు, మా విజయానికి మమ్మల్ని అభినందించినందుకు థ్యాంక్స్ విజయ్ దేవరకొండ అన్న. మీరు చాలా స్వీట్. ఒక సోదరుడిలా నన్ను భావించారు. మీ మాటలు, మార్గదర్శకత్వం కోసం నిన్ను ప్రేమిస్తున్నాను అన్నా" అంటూ పోస్ట్ చేశాడు మౌళి. దీంతో ఇప్పుడు మరో వీడియో నెట్టింట వైరల్ గా మారింది.
కొన్ని రోజుల క్రితం.. మౌళి ఓ కొండ పై నుంచి అదే విజయ్ దేవరకొండ ఇల్లు అంటూ చూపించారు. హాయ్ చెబుతున్నారంటూ.. నైట్ కు బిర్యానీ తినడానికి రమ్మన్నారంటూ ఫన్ చేశాడు. వెళ్లాలి కదా.. టైమ్ అయిందంటూ చిన్న వీడియో పోస్ట్ చేశాడు. అప్పుడు అలా మౌళి అనగా.. ఇప్పుడు విజయ్ ఇంటికి నేరుగా వెళ్లాడు.
దీంతో మౌళి ఆ స్టేజ్ నుంచి ఈ స్టేజ్ కు రీచ్ అయ్యాడంటూ ఆ వీడియోతోపాటు లేటెస్ట్ పిక్ ను కొలేజ్ చేస్తూ నెటిజన్లు షేర్ చేస్తున్నారు. కంటెంట్ ఉన్న మూవీ చేయడంతో మౌళి రేంజ్ మారిపోయిందని చెబుతున్నారు. లక్ అంటే అలా ఉండాలని అంటున్నారు. ఇంకా మరెన్నో సినిమాలతో ఆకట్టుకోవాలని ఆకాంక్షిస్తున్నారు. మరి ఫ్యూచర్ లో మౌళి ఏం చేస్తాడో వేచి చూడాలి.
