విజయ్ దేవరకొండ కారుకు ప్రమాదం
టాలీవుడ్ ట్యాలెంటెడ్ హీరో విజయ్ దేవరకొండ కారుకు ప్రమాదం జరిగింది. అయితే అదృష్టవశాత్తూ ఈ ప్రమాదంలో ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదు
By: Sivaji Kontham | 6 Oct 2025 7:58 PM ISTటాలీవుడ్ ట్యాలెంటెడ్ హీరో విజయ్ దేవరకొండ కారుకు ప్రమాదం జరిగింది. అయితే అదృష్టవశాత్తూ ఈ ప్రమాదంలో ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదు. విజయ్ దేవరకొండ, ఆయన కుటుంబ సభ్యులు పుట్టపర్తి దర్శనం అనంతరం హైదరాబాద్ కి తిరిగి వస్తుండగా, మార్గమధ్యంలో జోగులాంబ గద్వాల జిల్లా, ఉండవల్లి పరిసరాల్లోని హైవేలో చిన్నపాటి ప్రమాదం జరిగింది.
ఎదుట వెళుతున్న బొలెరో సడెన్ గా రైట్ టర్న్ తీసుకున్నప్పుడు వెనక వైపు నుంచి వస్తున్న విజయ్ లెక్సస్ మోడల్ కార్ దానిని ఢీకొట్టింది. కార్ ముందు భాగంలో స్వల్పంగా డ్యామేజ్ అయింది. అక్కడి నుంచి దేవరకొండ అతడి కుటుంబం వేరే కార్ లో హైదరాబాద్ కి వెళ్లారని తెలుస్తోంది.
విజయ్ దేవరకొండ నటించిన `కింగ్ డమ్` బాక్సాఫీస్ వద్ద ఆశించిన ఫలితాన్ని ఇవ్వలేదు. ప్రస్తుతం అతడు రౌడీ జనార్ధన్ అనే చిత్రంలో నటిస్తున్నాడు. రవికిరణ్ కోలా ఈ చిత్రానికి దర్శకత్వం వహించనున్నారు. రాయలసీమ నేపథ్యంలో రూపొందనున్న ఈ సినిమా షూటింగ్ త్వరలో ప్రారంభం కానుంది. దిల్ రాజు ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు.
