Begin typing your search above and press return to search.

తెలుగు సినిమా గర్వించే విధంగా 'రణబాలి' : విజయ్ దేవరకొండ

విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న జంటగా రాహుల్ సంకృత్యాన్‌ దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్ నిర్మించిన 'రణబాలి' సినిమా నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెల్సిందే.

By:  Ramesh Palla   |   16 Oct 2026 7:28 PM IST
తెలుగు సినిమా గర్వించే విధంగా రణబాలి : విజయ్ దేవరకొండ
X

విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న జంటగా రాహుల్ సంకృత్యాన్‌ దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్ నిర్మించిన 'రణబాలి' సినిమా నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెల్సిందే. సినిమాకు పబ్లిక్ నుంచి పాజిటివ్‌ రెస్పాన్స్‌ దక్కింది. సినిమా విడుదలై ప్రేక్షకుల నుంచి వస్తున్న టాక్‌ నేపథ్యంలో చిత్ర యూనిట్‌ సభ్యులు మీడియా ముందుకు వచ్చారు. ఈ మధ్య కాలంలో సినిమా విడుదల రోజే యూనిట్‌ సభ్యులు అంతా మీడియా ముందుకు రావడం మనం చూస్తూ ఉన్నాం. సినిమా సక్సెస్‌ సెలబ్రేషన్‌ ను మీడియాతో, ప్రేక్షకులతో జరుపుకోవడం కోసం రణబాలి టీం సైతం మీడియా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. మీడియా సమావేశంకు హీరో విజయ్ దేవరకొండ, హీరోయిన్‌ రష్మిక మందన్న, దర్శకుడు రాహుల్‌, నిర్మాతలు ఇంకా మైత్రి బ్యానర్‌కి చెందిన ప్రముఖులు హాజరు అయ్యారు.

దర్శకుడు రాహుల్‌ మాట్లాడుతూ...

మీడియా సమావేశంలో నిర్మాతలు మాట్లాడుతూ సినిమాకు పాజిటివ్‌ రెస్పాన్స్‌ వస్తుందని, కొందరు లెంగ్త్‌ విషయమై మాతో మాట్లాడటం జరిగింది, అయితే న్యూ వరల్డ్‌ బిల్డింగ్‌ కనుక కాస్త ఎక్కువ నిడివితోనే సినిమాను చూపించాల్సి ఉంటుంది అన్నారు. ఈ సినిమాను ఫ్యామిలీ ఆడియన్స్‌ చూడదగ్గట్లుగా దర్శకుడు రాహుల్‌ రూపొందించాడని, ఒక చరిత్రను ఈ సినిమాలో చక్కగా చూపించినందుకు సంతోషంగా ఉందని, అంతే కాకుండా మా ప్రయత్నంను ఆదరిస్తున్నందుకు కూడా చాలా సంతోషంగా ఉందని నిర్మాతలు చెప్పుకొచ్చారు. సినిమాకు ముందు నుంచే పాజిటివ్‌ వైబ్‌ ఉంది, ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో చెప్పినట్లుగానే ప్రేక్షకుల నుంచి మంచి స్పందన రావడం సంతోషంగా ఉందన్నారు. దర్శకుడు రాహుల్‌ మాట్లాడుతూ మేము అనుకున్నదాని కంటే సినిమాకు మంచి స్పందన వచ్చింది. ఓవర్సీస్‌ షో లు పడ్డప్పుడు ఎక్స్ లో కాస్త గందరగోళంతో కూడిన రివ్యూలు వచ్చాయి, కానీ తెలుగు షో లు పడ్డ తర్వాత పాజిటివ్‌ రివ్యూలు స్టార్ట్‌ అయ్యాయి. ఇది తెలిసిన వరల్డ్‌ కాదు కనుక కాస్త లెంగ్త్‌ ఎక్కువతోనే సినిమాను చూపించాలి అనుకున్నామని అన్నాడు.

రణబాలి ఒక మంచి ఫ్యామిలీ మూవీ...

రష్మిక మందన్న మాట్లాడుతూ.. ఇది ఒక మంచి ఫ్యామిలీ సినిమా. ఈ సినిమా కోసం అందరం చాలా కష్టపడ్డాం. నిజ జీవితంలో విజయ్‌ తన సహాయ గుణం, ఇంకా కొన్ని రకాలుగా రణబాలిలా అనిపిస్తాడు. రణబాలి అనేది ఒక గొప్ప ఎక్స్‌పీరియన్స్‌, విజయ్ ఎంతగా కష్టపడ్డాడో నేను దగ్గర ఉండి చూశాను. విజయ్‌ బాడీ లాంగ్వేజ్, రణబాలి బాడీ లాంగ్వేజ్ పూర్తి వేరుగా ఉంటుంది. అయితే షూటింగ్‌ సమయంలో రణబాలిలా విజయ్ ను చూసి ఆశ్చర్యపోయేదాన్ని అంది. విజయ్‌ నాకు ఇచ్చే గొప్ప గిఫ్ట్‌ విజయ్‌ అంది.

గర్వించదగ్గ మూవీ రణబాలి అంటున్న విజయ్ దేవరకొండ

విజయ్ దేవరకొండ మాట్లాడుతూ... ఇప్పటి వరకు చేసిన సినిమాల్లో ఇది చాలా స్పెషల్‌ మూవీ. నా ఫిల్మోగ్రఫీ లో నిలిచి పోయే సినిమా. మరో పది సినిమాలు చేసిన తర్వాత కూడా నా ఫిల్మోగ్రఫీ లోని రణబాలి సినిమా గురించి మాట్లాడుకుంటారు. సినిమాకు వస్తున్న స్పందన చూస్తే చాలా ఆనందంగా ఉంది. నా ప్రతి సినిమాకు వెయ్యి శాతం ఎఫర్ట్‌ పెడతాను. అయితే దర్శకుడు ఇతర టెక్నీషియన్స్ అంతా బాగా వర్క్‌ చేస్తే నాకు పేరు వస్తుంది. ఈసారి వీరు అంతా బాగా వర్క్ చేయడం వల్ల రణబాలికి నేను చాలా కష్టపడ్డట్లుగా కనిపించి మంచి పేరు వస్తుంది. ఈ సినిమాతో హిట్‌ కొట్టాలి, భారీ వసూళ్లు సాధించాలనే ఉద్దేశంతో చేసింది కాదు, ఒక మంచి సినిమాను తెలుగు ప్రేక్షకులకు ఇవ్వాలి, ఒక మంచి విషయాన్ని చెప్పాలి, చరిత్రలో చెప్పని విషయాలను చెప్పాలనే ఉద్దేశంతో ఈ సినిమాను చేశాము. నిన్న సినిమాను చూసిన సమయంలోనే ఒక మంచి సినిమాను చేశామని అర్థం అయింది. అప్పటి నుంచే రష్మిక సెలబ్రేట్‌ చేద్దాం అని అంటోంది. సినిమాకు భారీ స్థాయిలో వసూళ్లు రావాలని నేను ఎప్పుడూ అనుకోను, అయితే నా సినిమాకు నిర్మాత పెట్టిన డబ్బులు వెనక్కి రావాలి అనేది నా పెద్ద కోరిక.

ప్రస్తుతం ఉన్న ఎల్‌నినో సమయంలో రణబాలి రావడం సర్‌ప్రైజింగ్‌గా అనిపించింది. దాదాపు 150 ఏళ్ల క్రితం వచ్చిన కరువు ను ఈ సినిమాలో చూపించాం. కరువు వచ్చినప్పుడు జనాలు ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదు, ఏం చేయాలి అనే విషయాలను ఈ సినిమా ద్వారా కొంత అయినా చూపించే ప్రయత్నం చేశాం. కనుక ప్రస్తుత ఎల్‌నినో పరిస్థితులను ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా ఎదుర్కోవాలి. రణబాలి సినిమా చేసే అవకాశం రావడం అదృష్టంగా భావిస్తున్నాను. తెలుగు సినిమా గర్వపడేలా రణబాలి ఉంటుందని మొదటి నుంచి అనుకున్నాం. ప్రస్తుతం వస్తున్న రెస్పాన్స్ చూస్తే మేము అనుకున్నది నిజం అయిందని అనిపిస్తుంది. సినిమా చూసిన వాళ్ళు వచ్చి మాట్లాడుతూ ఉంటే చాలా సంతోషంగా ఉంది. సినిమాలోని ఎమోషన్‌ సీన్స్ కి చాలా మంది కన్నీళ్లు పెట్టుకుంటున్నారు. ఒక చరిత్రను చూపించాలని మేము చేసిన ప్రయత్నంను ఆదరిస్తున్నందుకు సంతోషంగా ఉందని అన్నాడు.