Begin typing your search above and press return to search.

దేవరకొండ ఒకే చెప్పి ఉంటే. లోకేష్ కు చాన్స్ మిస్ అయ్యేదా?

విజయ్ దేవరకొండ, దర్శకుడు అరుణ్ మాథేశ్వరన్ ఒకప్పుడు కలిసి సినిమా చేయాలని అనుకున్నారు.

By:  M Prashanth   |   1 Sept 2026 1:00 AM IST
దేవరకొండ ఒకే చెప్పి ఉంటే. లోకేష్ కు చాన్స్ మిస్ అయ్యేదా?
X

విజయ్ దేవరకొండ, దర్శకుడు అరుణ్ మాథేశ్వరన్ ఒకప్పుడు కలిసి సినిమా చేయాలని అనుకున్నారు. ఇద్దరూ రెండు మూడు సార్లు కలిశారని ఆనంద్ దేవరకొండ రీసెంట్ గా చెప్పాడు. కథ, సినిమా ఎలా ఉండాలి అనే విషయంలో కూడా ఇద్దరికీ మంచి అవగాహన కుదిరిందట. కానీ అప్పటికే విజయ్ చేతిలో వరుస సినిమాలు ఉండటంతో ఆ ప్రాజెక్ట్‌కు సరైన సమయం దొరకలేదు. చివరకు కాంబినేషన్ అక్కడితో ఆగిపోయింది.

అయితే అరుణ్ విజయ్‌కు చెప్పింది ఇప్పుడు లోకేష్ కనగరాజ్ హీరోగా వచ్చిన ‘డీసీ’ కథేనా డౌట్ వస్తోంది. రెగ్యులర్ గా అవే కథలు అనే ఆలోచనతో కూడా విజయ్ ఆ కథను పక్కన పెట్టినట్లు టాక్ వచ్చింది. ఆనంద్ మాత్రం డేట్స్ కూడా సమస్య అయ్యాయని గుర్తు చేశాడు. ఇక అరుణ్ లోకేష్ కాంబినేషన్ వివరాల్లోకి వెళితే.. అప్పటికే దర్శకుడిగా పెద్ద సినిమాలు చేస్తున్న లోకేష్‌ను హీరోగా తీసుకోవాలని అరుణ్ ఓ పార్టీలో అనుకున్నాడట.

కథ నచ్చడంతో లోకేష్ కూడా ఒప్పుకున్నాడు. అలా ‘డీసీ’తో అతను పూర్తి స్థాయి హీరోగా మారాడు. దర్శకుడిగా ఉన్న వ్యక్తి ఒక్కసారిగా అరుణ్ సినిమాలో హీరో కావడం అప్పట్లోనే పెద్ద సర్‌ప్రైజ్. ఇప్పుడు విజయ్, అరుణ్ సినిమా అప్పుడే జరిగి ఉంటే ఈ లెక్క ఇంకోలా ఉండేదేమో అనే మాట వస్తోంది. అరుణ్ ముందుగా విజయ్‌తో సినిమా పూర్తి చేసి ఉంటే, అదే సమయంలో లోకేష్‌తో ‘డీసీ’ మొదలయ్యేదా లేదా అనే కామెంట్స్ వస్తున్నాయి.

లోకేష్ కూడా తన దర్శకత్వ సినిమాలతో బిజీగా ఉండటంతో అతని హీరో ఎంట్రీ మరికొంత ఆలస్యమయ్యే ఛాన్స్ ఉండేది. పైగా ‘డీసీ’ కూడా మొదట అనుకున్న రూపంలోనే తెరపైకి రాలేదు. చాలా ఏళ్ల క్రితం సిద్ధార్థ్‌ను కూడా ఈ ప్రాజెక్ట్ కోసం అనుకున్నట్లు కెమెరామెన్ గతంలో చెప్పాడు. అప్పటి కథ, ఇప్పుడు వచ్చిన సినిమా మధ్య చాలా మార్పులు జరిగాయని కూడా వెల్లడించాడు. అంటే హీరోలు మాత్రమే కాదు, కథ కూడా కాలంతో పాటు మారిపోయింది. ఇక ఆ లిస్టులో దేవరకొండ కూడా ఉండి ఉండవచ్చు.

ఆనంద్ చెప్పిన మాటల్లో ఫ్యాన్స్ ఫీలింగ్ కూడా ఉంది. విజయ్ ఆ సినిమా చేసి ఉంటే ఎలా ఉండేదని చాలా మంది ఇప్పటికీ కామెంట్స్ పెడుతూనే ఉన్నారు. కానీ అనుకున్నవన్నీ జరగవు అది కామన్ అంటూ ఆనంద్ ఓ వివరణ ఇచ్చాడు. లోకేష్ మాత్రం ‘డీసీ’తో హీరోగా మరో కొత్త రూట్ లోకి వచ్చాడు. అరుణ్, లోకేష్ మళ్లీ కలిసి పని చేసే అవకాశం ఉందనే వార్తలు వచ్చాయి. ఇక విజయ్ కాంబో ఎప్పుడూ సెట్టవుతుందో చూడాలి.