Begin typing your search above and press return to search.

దేవరకొండ ఇప్పుడు చేయాల్సిందేంటి?

అయితే మంచి స్టోరీ ఉన్నంత మాత్రాన సినిమా మొత్తం ప్రేక్షకులను కట్టిపడేయలేదని ఆ మూవీ మరోసారి గుర్తు చేసింది.

By:  M Prashanth   |   20 Oct 2026 1:00 AM IST
దేవరకొండ ఇప్పుడు చేయాల్సిందేంటి?
X

ఒక సినిమా కోసం హీరో ఎంత కష్టపడ్డారనేది మెయిన్. కానీ ఆ కష్టం ప్రేక్షకులకు ఎంతవరకు నచ్చిందన్నదే రిజల్ట్ డిసైడ్ చేస్తుంది. విజయ్ దేవరకొండ విషయంలో ఇదే డిస్కస్ చేసుకోవాల్సిన విషయం. రణబాలిలో ఆయన యాక్టింగ్ కు మంచి మార్కులే పడుతున్నా.. కొన్ని విషయాల్లో మాత్రం ప్రేక్షకులకు అసంతృప్తి ఉంది. దీంతో నటుడిగా నిరూపించుకున్న ఆయన.. సెలక్షన్ లో జాగ్రత్తగా ఉండాల్సిన సమయం వచ్చిందా అనే ప్రశ్న వినిపిస్తోంది.

నిజానికి రణబాలిలో విజయ్ దేవరకొండ తన పాత్ర కోసం చాలా కష్టపడ్డారు. రోల్ కు తగ్గట్టుగా కనిపించడం దగ్గర నుంచి యాక్షన్ సీన్స్, డైలాగులు చెప్పే విధానం వరకు తనదైన ముద్ర వేశారు. రణబాలి రోల్ లో చూపించిన ఇంటెన్సిటీ సినిమాకు మెయిన్ అసెట్ గా నిలిచింది. రష్మిక మందన్నా కూడా తన పాత్రకు న్యాయం చేశారు. డైరెక్టర్ రాహుల్ సాంకృత్యాన్ సెలెక్ట్ చేసుకున్న బ్యాక్ డ్రాప్, రూపొందించిన కొన్ని సీన్స్, క్లైమాక్స్ అట్రాక్ట్ చేస్తున్నాయి.

అయితే మంచి స్టోరీ ఉన్నంత మాత్రాన సినిమా మొత్తం ప్రేక్షకులను కట్టిపడేయలేదని ఆ మూవీ మరోసారి గుర్తు చేసింది. కొన్ని చోట్ల స్టోరీ స్లోగా సాగడం, సినిమా రన్ టైమ్ ఎక్కువగా అనిపించడం ఇబ్బందిగా మారాయి. బ్రిటిష్ పాలనలో ప్రజలు ఎదుర్కొన్న కష్టాలను చూపించే క్రమంలో వైలెన్స్ కూడా ఎక్కువైంది. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ విషయంలోనూ మరింత స్ట్రాంగ్ వర్క్ ఉంటే బాగుండేదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

అంటే విజయ్ యాక్టింగ్ కంటే, ప్రేక్షకులకు నచ్చేలా మూవీ తీర్చిదిద్దడంలోనే సమస్య ఉందని చెప్పొచ్చు. అయితే విజయ్ కు ప్రస్తుతం మంచి అవకాశాలున్నాయి. రౌడీ జనార్దన, దర్శకుడు శౌర్యువ్‌ తో చేయనున్న సినిమాలు లైనప్‌ లో ఉన్నాయి. ఆ రెండు చిత్రాలు వేర్వేరు బ్యాక్ డ్రాప్స్ లో రూపొందుతున్నాయి. ఒకటి గ్రామీణ వాతావరణంలో సాగే మాస్ యాక్షన్ కథ కాగా, మరొకటి ఎమోషన్స్ తో కూడిన ఫాంటసీ స్టోరీ.

అందుకే విజయ్ ఇప్పుడు చేయాల్సింది కొత్త స్టోరీలను ఎంచుకోవడం మాత్రమే కాదు. అందులో కొన్ని మార్పులు చేసుకోవాలి. స్టోరీలో కొత్తదనం ఉందా, తన పాత్రకు స్త్రెంత్ ఎంత, ప్రేక్షకులు మొదటి నుంచి చివరి వరకు ఆసక్తిగా చూస్తారా అనే విషయాలను ముందుగానే పరిశీలించాలి. దర్శకుడి ఆలోచన ఎంత బాగున్నా, అది స్క్రీన్ పై అంతే స్ట్రాంగ్ కనిపించేలా ఉండాలి. ఇక విజయ్ లో కొత్త కథలు చేయాలనే ఆసక్తి కనిపిస్తుంది, మంచి క్రేజ్ కూడా ఉంది.

ఆ రెండింటినీ కలిపి ముందుకు వెళ్లడం ఇప్పుడు చాలా అవసరం. కేవలం భారీ బ్యాక్ డ్రాప్, కొత్త లుక్, ఎక్కువ యాక్షన్ ఉంటే సినిమా సక్సెస్ అవుతుందని అనుకోకూడదు. స్ట్రాంగ్ స్టోరీ, ఎమోషన్స్, స్పీడ్ స్క్రీన్ ప్లే కూడా అంతే ముఖ్యం. అందుకే ఇప్పుడు ఆయన ఫోకస్ పెట్టాల్సింది స్టోరీల సెలక్షన్ తోపాటు అవి స్క్రీన్ పై ఎలా చూపిస్తారనే విషయంపై కూడా. విజయ్ నెక్స్ట్ సినిమాల్లో చిన్న చిన్న ఛేంజెస్ చేసుకుంటే కచ్చితంగా మంచి రిజల్ట్ రావొచ్చు.