రిపబ్లిక్‌డే రోజు టైటిల్ గింప్స్‌తో రౌడీ సర్‌ప్రైజ్!
వరుస ఫ్లాపుల తరువాత రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ తన పంథా మార్చుకున్నాడు. వరుసగా ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్‌లతో ప్రేక్షకులని సర్‌ప్రైజ్ చేస్తున్నాడు
By: Tupaki Entertainment Desk | 24 Jan 2026 7:54 PM ISTవరుస ఫ్లాపుల తరువాత రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ తన పంథా మార్చుకున్నాడు. వరుసగా ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్‌లతో ప్రేక్షకులని సర్‌ప్రైజ్ చేస్తున్నాడు. ఇప్పటికే రవికిరణ్ కోల డైరెక్షన్‌లో `రౌడీ జనార్థన` మూవీ గ్లింప్స్‌ని అందించిన సర్‌ప్రైజ్ చేసిన విజయ్ దేవరకొండ అభిమానులతో పాటు సగటు సినీ లవర్స్‌ని ఆశ్చర్యానికి గురి చేశాడు. గత చిత్రాలకు పూర్తి భిన్నంగా రూపొందుతున్న ఈ సినిమాతో పీరియాడిక్ పోలిటికల్ యాక్షన్ థ్రిల్లర్‌తో రౌడీగా సరికొత్త క్యారెక్టర్‌లో కనిపించబోతున్నాడు. దీనికి సంబంధించిన టైటిల్ గ్లింప్స్ అంచనాల్ని పెంచేసింది.
తెలుగులో పాటు ఐదు భాషల్లో పాన్ ఇండియా మూవీగా భారీ స్థాయిలో రిలీజ్ కాబోతోంది. ఇదిలా ఉంటే ఈ మూవీ తరువాత విజయ్ దేవరకొండ మరో క్రేజీ పాన్ ఇండియా మూవీతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. విజయ్ దేవరకొడ కెరీర్‌లోనే అత్యంత భారీ స్థాయిలో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న ఈ మూవీకి టాక్సీవాలా, శ్యామ్ సింగరాయ్ చిత్రాల ఫేమ్ రాహుల్ సంక్రీత్యన్ దర్శకత్వం వహిస్తున్నాడు. మైత్రీ మూవీ మేకర్స్‌తో కలిసి టి సిరీస్ సంస్థ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోంది.
దీనికి సంబంధించిన అప్ డేట్ ఎప్పుడెప్పుడు వస్తుందా? అని ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్న వేళ దర్శకుడు రాహుల్ సంక్రీత్యన్ సర్‌ప్రైజింగ్ అప్‌డేట్‌ని సోషల్ మీడియా వేదికగా అందించాడు. పీరియడిక్ యాక్షన్ డ్రామాగా రూపొందున్న ఈ మూవీ టైటిల్ గ్లింప్స్‌ని రిపబ్లిక్ డే సందర్భంగా జనవరి 26న రిలీజ్ చేస్తున్నామంటూ ప్రకటించి సర్‌ప్రైజ్ ఇచ్చాడు. దీంతో ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు. ఇటీవల `రౌడీ జనార్థన్` టైటిల్ గ్లింప్స్‌తో సంబరాలు చేసుకున్న రౌడీ ఫ్యాన్స్ జనవరి 26న VD14కు సంబంధించిన టైటిల్ గ్లింప్స్ రిలీజ్ అవుతుండటంతో పిచ్చ హ్యాపీగా ఫీలవుతున్నారు.
చారిత్రాత్మక నేపథ్యంలో అత్యంగా భారీ స్కేల్‌లో ఈ మూవీని విజయ్ దేవరకొండ కెరీర్‌లోనే అత్యంత భారీ బడ్జెట్ మూవీగా తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాపై దర్శకుడు ఫుల్ కాన్ఫిడెన్స్‌తో ఉన్నాడు. ప్రీలుక్ పోస్టర్‌లోనే సినిమా ఎలా ఉంటుంది? ఏ స్థాయిలో తెరపైకి రానుంది. కథలో హీరో క్యారెక్టరైజేషన్ ఎంత పవర్‌ఫుల్‌గా ఉంటుందో చిన్న హింట్ ఇచ్చాడు. `దేవుడు అతనికి బలాన్నిచ్చాడు. యుద్దం అతనికి ఓ లక్ష్యాన్నిచ్చింది` అంటూ షేర్ చేసిన పోస్టర్, ఓ చిత్రపటం ముందు కూర్చుని విజయ్ దేవరకొండ ఓ యోధుడిలా..పెరోషియస్ లుక్‌లో కనిపించిన ప్రీలుక్ సినిమాపై అంచనాల్ని పెంచేసింది.
సినిమాపై ఫుల్ కాన్ఫిడెన్స్‌తో పాటు క్లారిటీతో ఉన్న టీమ్ ఈ మూవీ ప్రేక్షకులకు మర్చిపోలేని అనుభూతిని పంచుతుందని, పీరియాడిక్ డ్రామాలోని ఎవ్రీ డీటైలింగ్‌ని ఎంజాయ్ చేస్తారని ప్రామిస్ చేస్తోంది. ఇదొక ఇంటెన్స్ యాక్షన్ డ్రామా అని దేవరకొండ పవర్‌ఫుల్ పెర్ఫార్మెన్స్‌తో అతని కెరీర్‌తో పాటు ఇండియన్ సినీ హిస్టరీలోనే లోనే వన్ ఆఫ్ ది మోస్ట్ మూవీగా నిలుస్తుందనే వార్తలు వినిపిస్తున్నాయి. ఆ వార్తలని 26న రిలీజ్ అవుతున్న గ్లింప్స్ నిజం చేస్తుందని, చాలా రోజులు తరువాత రష్మిక మందన్న ఇందులో విజయ్‌కి జోడీగా నటిస్తోందని, వీరిద్దరి స్క్రిన్ ప్రజెన్స్ సినిమాకు ప్రధాన హైలైట్‌గా నిలుస్తుందని ఇన్ సైడ్ టాక్. సోమవారం రిలీజ్ కానున్న టైటిల్ గ్లింప్స్ నెట్టింట ఎలాంటి సంచనాలకు తెర లేపుతుందో తెలియాలంటే మరి కొన్ని గంటలు వేచి చూడాల్సిందే. ఇందులోని కీలక పాత్రల్లో పలువురు హాలీవుడ్ క్రేజీ యాక్టర్స్ నటిస్తుండటం విశేషం.
