Begin typing your search above and press return to search.

చిరంజీవి, విజయ్.. సర్ ప్రైజ్ కాల్!

ఒక సీనియర్ నటుడిగా చిరంజీవి ఇచ్చిన ఈ బూస్టప్ విజయ్ కి ఎంతో బలాన్నిచ్చేదే. ప్రజా సేవలో విజయ్ మరిన్ని సక్సెస్ లు చూడాలని చిరంజీవి తన మనసులోని మాటను చెప్పారు.

By:  M Prashanth   |   16 May 2026 12:04 AM IST
చిరంజీవి, విజయ్.. సర్ ప్రైజ్ కాల్!
X

తమిళనాడు ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకున్న విజయ్ కి ఇప్పుడు దేశవ్యాప్తంగా సినీ స్టార్స్ నుంచి విషెస్ అందుతున్నాయి. ఊహించని విధంగా మొదటి అడుగులోనే సీఎం సీటు ఎక్కి అందరిని ఆశ్చర్య పరిచిన విజయ్ తన స్టార్ హోదా ఏమిటో మరోసారి నిరూపించారు. ఇక మెగాస్టార్ చిరంజీవి ఫోన్ చేయడం ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. ఒకరు వెండితెరను దశాబ్దాలుగా ఏలుతున్న హీరో అయితే, మరొకరు సినిమాల్లో సత్తా చాటి ఇప్పుడు ప్రజా క్షేత్రంలో కీలక పదవిలో ఉన్న నేత.

వీరిద్దరి మధ్య సాగిన ఈ ఆత్మీయ సంభాషణ తెలుగు, తమిళ రాష్ట్రాల్లో అందరి దృష్టిని ఆకర్షించింది. విజయ్ సీఎం అయ్యాక జరిగిన ఈ తొలి అధికారిక పలకరింపుకు ఇప్పుడు చాలా ప్రాధాన్యత పెరిగింది. విజయ్ పాలన దివంగత నేత ఎం.జి.ఆర్ గారి లాగే సాగాలని చిరంజీవి కోరుకున్నారు. ప్రజల కోసం చేసే పనుల్లో విజయ్ తనదైన ముద్ర వేయాలని, అందరి గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోవాలని చిరంజీవి అభినందించారు.

ఒక సీనియర్ నటుడిగా చిరంజీవి ఇచ్చిన ఈ బూస్టప్ విజయ్ కి ఎంతో బలాన్నిచ్చేదే. ప్రజా సేవలో విజయ్ మరిన్ని సక్సెస్ లు చూడాలని చిరంజీవి తన మనసులోని మాటను చెప్పారు. అలాగే విజయ్ కూడా మెగాస్టార్ మీద తనకున్న అభిమానాన్ని చాటుకున్నారు. ఇటీవల చిరంజీవి నటించిన “మన శంకర వర ప్రసాద్ గారు” సినిమా చూశానని విజయ్ ఈ సందర్భంగా గుర్తుచేశారు. చిరంజీవిని మళ్ళీ ఆ రేంజ్ పాత్రలో స్క్రీన్ మీద చూడటం చాలా హ్యాపీగా అనిపించిందని విజయ్ అనడం విశేషం.

ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి కూడా తన తోటి నటుడి సినిమా గురించి స్పెషల్ గా ప్రస్తావించడం ఫ్యాన్స్ ని ఖుషీ చేస్తోంది. శుభాకాంక్షలతోనే ఆగిపోకుండా చిరంజీవి నెక్స్ట్ ప్రాజెక్టుల గురించి కూడా విజయ్ ఆరా తీశారు. ప్రస్తుతం కె.వి.ఎన్ ప్రొడక్షన్స్ బ్యానర్‌లో మెగాస్టార్ చేస్తున్న కొత్త సినిమాకు విజయ్ ఆల్ ది బెస్ట్ చెప్పారు. ఇండస్ట్రీ వ్యక్తులు ఇలాంటి ఉన్నత పదవుల్లో ఉన్నప్పుడు ఇలాంటి పలకరింపులు సినిమా రంగానికి ఒక రకమైన భరోసానిస్తాయి.

భాష ఏదైనా ఒకరి సినిమాలను ఒకరు గౌరవించుకోవడం ఒక మంచి పద్ధతి. నిజానికి గతంలో కూడా తెలుగు, తమిళ స్టార్ల మధ్య మంచి బాండింగ్ ఉండేది. ఇప్పుడు విజయ్ ముఖ్యమంత్రి కావడంతో ఆ బంధం ఇంకా స్ట్రాంగ్ అయ్యే ఛాన్స్ ఉంది. చిరంజీవి, విజయ్ మధ్య జరిగిన ఈ టాక్ కేవలం రాజకీయ సంబంధం మాత్రమే కాదు, ఒక మంచి ఫ్రెండ్ షిప్ అని ఫ్యాన్స్ చెబుతున్నారు.

పాలిటిక్స్ వేరైనా కళాకారులుగా వారి మధ్య ఉన్న రెస్పెక్ట్ ఏమాత్రం తగ్గలేదని ఈ ఇన్సిడెంట్ తో అర్థమవుతోంది. ఇక ఇద్దరు సూపర్ స్టార్లు ఇలా మాట్లాడుకోవడం అటు మెగా ఫ్యాన్స్ కి, ఇటు విజయ్ ఫ్యాన్స్ కి పెద్ద కిక్ ఇచ్చింది. రెండు రాష్ట్రాల మధ్య సంబంధాలు ఇంకా మెరుగుపడటానికి ఇలాంటి ఆత్మీయ కలయికలు బాగా హెల్ప్ అవుతాయి. మెగాస్టార్, సీఎం విజయ్ ల ఈ స్నేహం ముందు ముందు ఇంకెన్ని ఇంట్రెస్టింగ్ పరిణామాలకు దారితీస్తుందో చూడాలి.