Begin typing your search above and press return to search.

అనిరుధ్ పెళ్లి రిసెప్షన్‌లో విజయ్, సంగీత.. కానీ చిన్న ట్విస్ట్!

అనిరుధ్ రవిచందర్, కావ్య మారన్ వెడ్డింగ్ రిసెప్షన్‌కు తమిళనాడు సీఎం విజయ్, ఆయన భార్య సంగీత హాజరయ్యారు. అయితే ఇద్దరూ వేర్వేరు సమయాల్లో విడివిడిగా కనిపించడంతో చర్చ మొదలైంది. గతంలో విడాకుల పిటిషన్ దాఖలు చేసి, ఆ తర్వాత వెనక్కి తీసుకున్న సంగీత.. తాజాగా కుమారుడి సినిమా విడుదల సమయంలోనూ, ఇప్పుడు ఈ వేడుకలోనూ బహిరంగంగా కనిపించడం ఆసక్తికరంగా మారింది.

By:  Priya Chowdhary Nuthalapti   |   22 Nov 2026 4:18 PM IST
అనిరుధ్ పెళ్లి రిసెప్షన్‌లో విజయ్, సంగీత.. కానీ చిన్న ట్విస్ట్!
X

తమిళనాడు ముఖ్యమంత్రి, ప్రముఖ నటుడు విజయ్ మరోసారి వార్తల్లో నిలుస్తున్నారు. ప్రముఖ సంగీత దర్శకుడు, గాయకుడు అనిరుధ్ రవిచందర్, సన్‌రైజర్స్ హైదరాబాద్ సహ యజమాని కావ్య మారన్ వివాహ రిసెప్షన్‌కు విజయ్ హాజరయ్యారు. అయితే ఈ వేడుకకు ఆయన భార్య సంగీత సోర్నలింగం కూడా రావడం..ఇద్దరూ వేర్వేరు సమయాల్లో విడివిడిగా కనిపించడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.

నవంబర్ 21న చెన్నైలోని ఐటీసీ గ్రాండ్ చోళ హోటల్‌లో అనిరుధ్, కావ్య మారన్ గ్రాండ్ వెడ్డింగ్ రిసెప్షన్ నిర్వహించారు. ఈ వేడుకకు సినీ, రాజకీయ, క్రీడా రంగాలకు చెందిన పలువురు ప్రముఖులు హాజరయ్యారు. తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ రాకతో ఈ కార్యక్రమానికి మరింత ప్రత్యేకత ఏర్పడింది. అయితే ఆయనతో పాటు భార్య సంగీత కనిపించకపోవడం ఫొటోగ్రాఫర్ల దృష్టిని ఆకర్షించింది.

విజయ్ సంప్రదాయ దుస్తుల్లో ఈ వేడుకకు హాజరయ్యారు. అనంతరం వేదికపైకి వెళ్లి కొత్త జంట అనిరుధ్, కావ్యలకు శుభాకాంక్షలు తెలిపారు. వారితో కలిసి ఫొటోలు కూడా దిగారు. మరోవైపు సంగీత సోర్నలింగం కూడా ఈ వేడుకకు హాజరై కొంతసేపు అందరి దృష్టిని ఆకర్షించారు.

విజయ్, సంగీత 1999 ఆగస్టులో వివాహం చేసుకున్నారు. వీరికి జాసన్ సంజయ్, దివ్య సాషా అనే ఇద్దరు పిల్లలు ఉన్నారు. అయితే గత కొంతకాలంగా ఈ దంపతులు కలిసి కనిపించడం లేదు. వ్యక్తిగత విభేదాల కారణంగా ఇద్దరూ వేర్వేరుగా కుందా రంగ సంగతి తెలిసిందే.

ఈ ఏడాది విజయ్‌పై సంగీత విడాకుల పిటిషన్ దాఖలు చేయడం అప్పట్లో పెద్ద చర్చకు కారణమైంది. విజయ్‌కు మరో నటితో వివాహేతర సంబంధం ఉందని ఆమె తన పిటిషన్‌లో ఆరోపించినట్లు వార్తలు వచ్చాయి. ఈ వ్యవహారం తనకు మానసిక వేదన కలిగించిందని కూడా పేర్కొన్నట్లు అప్పట్లో వార్తలు గట్టిగానే వచ్చాయి. అయితే కొన్ని విచారణల తర్వాత ఆమె విడాకుల పిటిషన్‌ను వెనక్కి తీసుకున్నారు.

ఇక ఈ మధ్యనే కుమారుడు జాసన్ సంజయ్ దర్శకత్వంలో రూపొందిన సిగ్మా సినిమా విడుదల సమయంలో సంగీత తన పిల్లలతో కలిసి కనిపించారు. ఆ తర్వాత ఇప్పుడు అనిరుధ్ పెళ్లి రిసెప్షన్‌లో మరోసారి ఆమె బహిరంగంగా కనిపించడం ఆసక్తికరంగా మారింది.