Begin typing your search above and press return to search.

కూతురు మరణం.. ఎమోషనల్ నోట్ రిలీజ్ చేసిన హీరో!

ప్రముఖ తమిళ నటుడు విజయ్ ఆంటోని గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈయన తమిళ ఇండస్ట్రీలోనే కాకుండా తెలుగు ఇండస్ట్రీలో కూడా పేరుగాంచారు

By:  Madhu Reddy   |   16 Sept 2025 4:16 PM IST
కూతురు మరణం.. ఎమోషనల్ నోట్ రిలీజ్ చేసిన హీరో!
X

ప్రముఖ తమిళ నటుడు విజయ్ ఆంటోని గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈయన తమిళ ఇండస్ట్రీలోనే కాకుండా తెలుగు ఇండస్ట్రీలో కూడా పేరుగాంచారు. ముఖ్యంగా తమిళంలో రిలీజ్ చేసిన చాలా సినిమాలను తెలుగులో అనువదించి ఇక్కడ కూడా పాపులారిటీ అందుకున్నారు.అలా బిచ్చగాడు, బిచ్చగాడు-2 సినిమాలతో విజయ్ ఆంటోనీ పేరు టాలీవుడ్ లో మార్మోగిపోయింది. అయితే అలాంటి ఈ హీరో ప్రస్తుతం 'భద్రకాళి' అనే మూవీతో మన ముందుకు రాబోతున్నారు. ఈ సినిమా మరో మూడు రోజుల్లో విడుదల కాబోతున్న నేపథ్యంలో సినిమాకు సంబంధించి ప్రమోషన్స్ లో పాల్గొన్నారు విజయ్ ఆంటోనీ.

ఇందులో భాగంగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న విజయ్ ఆంటోనీ తన కూతురి గురించి తలుచుకుంటూ ఎమోషనల్ కామెంట్స్ చేశారు.అంతేకాదు ఆరోజే తాను కూడా చనిపోయానంటూ విజయ్ ఆంటోని మాట్లాడిన మాటలు అభిమానులను కన్నీళ్లు పెట్టిస్తున్నాయి. మరి ఇంతకీ విజయ్ ఆంటోనీ ఆ ఇంటర్వ్యూలో ఏం మాట్లాడారో ఇప్పుడు చూద్దాం..

విజయ్ ఆంటోని ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఇందులో సినిమా గురించి అడుగుతూ మధ్యలో మీ కూతురు చనిపోయాక ఆ బాధని మీరెలా భరించారు.. ఎలా తట్టుకున్నారు? అని ప్రశ్నించారు. దానికి విజయ్ ఆంటోని మాట్లాడుతూ.."నా కూతురు చనిపోలేదు.. ఇప్పటికీ నాతోనే ఉంది. నేను నా కూతురు మీరాని మిస్ అవ్వడం లేదు. ఎందుకంటే నేను ఆమెతో ప్రతిరోజు మాట్లాడతాను. ఇప్పటికి కూడా మాట్లాడుతూనే ఉన్నాను.. అందుకే నా కూతుర్ని కోల్పోయాను అనే బాధ నాలో లేదు. మీరా ఇప్పటికీ నాతోనే ప్రయాణిస్తుంది.. అయితే నా మాటల్లో ఉన్న డెప్త్ మీకు అర్థం అవుతుందో లేదో తెలియదు. కానీ ఇప్పుడు కూడా నా కూతురితో మాట్లాడుతున్నాను" అంటూ చాలా ఎమోషనల్ గా మాట్లాడారు విజయ్ ఆంటోనీ..

విజయ్ ఆంటోనీ కూతురు మీరా ఆంటోనీ 16 ఏళ్ల వయసులో ఆత్మహత్య చేసుకొని చనిపోయింది. కూతురు చనిపోయి రెండేళ్లయినా కూడా విజయ్ ఇంకా కూతుర్ని మర్చిపోవడం లేదు. అలాగే కూతురు చనిపోయాక విజయ్ ఆంటోని తన సోషల్ మీడియా ఖాతాలో సంచలన ప్రకటన చేశారు. "నా కూతురు చనిపోయినా కూడా ఆమె చేయాలనుకున్న మంచి పనులను నేను చేసి చూపిస్తాను. నా కూతురు ఇప్పుడు అసూయ, డబ్బు, పేదరికం,కులం, మతం,బాధ,శత్రుత్వం ఇవేవీ లేని ప్రపంచంలో అడుగు పెట్టింది.నా కూతురు చనిపోయిన రోజే నేను చనిపోయాను. అందుకే నా కూతురు మరణించినా కూడా నాతోనే ఉంది.ఆమె చేయాలనుకున్న మంచి పనులు ఇప్పుడు నేను చేస్తాను. ఆమెతో గడపడానికి టైం కేటాయిస్తాను. నా కూతురు చాలా ధైర్యవంతురాలుకి అంటూ కూతురు గురించి ఎమోషనల్ నోట్ షేర్ చేసి తన కూతురి పేరుపై ఎన్నో సేవా కార్యక్రమాలు, మంచి పనులు చేయడం మొదలుపెట్టారు..

విజయ్ ఆంటోని భద్రకాళి సినిమా విషయానికి వస్తే.. అరుణ్ ప్రభు దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాని విజయ్ ఆంటోని ఫిల్మ్ కార్పొరేషన్, సర్వంత్ రామ్ క్రియేషన్స్ బ్యానర్ పై విజయ్ ఆంటోని, రామాంజనేయులు జవ్వాజీలు నిర్మిస్తున్నారు. పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కిన భద్రకాళి మూవీ సెప్టెంబర్ 19న థియేటర్లోకి రాబోతోంది.