విజయ్ ఆంటోనీ 'భద్రకాళి'.. టాక్ ఎలా ఉందంటే?
పాలిటిక్స్ లోని ఓ పవర్ బ్రోకర్ చుట్టూ సినిమా అంతా తిరుగుతుంది. అవినీతిపరులను ఎలా పట్టించాడు.. దేశ ప్రజల్ని రక్షించేందుకు ఏం చేశాడు.. అనేది సినిమా అని చెబుతున్నారు ఆడియన్స్.
By: M Prashanth | 19 Sept 2025 8:14 PM ISTకోలీవుడ్ మల్టీ టాలెంటెడ్ సెలబ్రిటీ విజయ్ ఆంటోనీ గురించి అందరికీ తెలిసిందే. హీరోగా, గాయకుడిగా, సినిమా ఎడిటర్ గా, గేయ రచయితగా, ఆడియో ఇంజనీర్ గా, నిర్మాతగా ఎప్పటికప్పుడు అలరిస్తూనే ఉంటారు. అదే సమయంలో తెలుగులో కూడా మంచి క్రేజ్ దక్కించుకున్నారు. సాలిడ్ మార్కెట్ సంపాదించుకున్నారు.
ఆయన నటించిన సినిమాలు దాదాపు అన్నీ తెలుగులో కచ్చితంగా విడుదల అవుతాయి. రీసెంట్ గా మార్గన్ మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఆయన.. ఇప్పుడు భద్రకాళి మూవీతో థియేటర్స్ లో సందడి చేస్తున్నారు. పొలిటికల్ థ్రిల్లర్ గా అరుణ్ ప్రభు దర్శకత్వం వహించిన ఆ సినిమాకు నిర్మాతగా కూడా విజయ్ ఆంటోనీ వ్యవహరించారు.
సినిమాలో విజయ్ తోపాటు వాగై చంద్రశేఖర్, సునీల్ కృపాలనీ, సెల్ మురుగన్, రవీంద్ర తదితరులు ముఖ్యపాత్రలు పోషించారు. అయితే రిలీజ్ కు ముందు సినిమాపై ఆడియన్స్ లో మంచి ఆసక్తి నెలకొంది. ప్రమోషనల్ కంటెంట్ సూపర్ రెస్పాన్స్ అందుకుంది. మరి ఇప్పుడు సినిమా ఎలా ఉంది? సినీ ప్రియులు ఏమంటున్నారు?
పాలిటిక్స్ లోని ఓ పవర్ బ్రోకర్ చుట్టూ సినిమా అంతా తిరుగుతుంది. అవినీతిపరులను ఎలా పట్టించాడు.. దేశ ప్రజల్ని రక్షించేందుకు ఏం చేశాడు.. అనేది సినిమా అని చెబుతున్నారు ఆడియన్స్. ఇప్పటికే అలాంటి స్టోరీతో తెలుగులో ఆర్పీ పట్నాయక్ బ్రోకర్ మూవీ చేశారని గుర్తు చేస్తున్నారు. అందులో స్టోరీ చాలా క్లియర్ గా ఉంటుందని చెబుతున్నారు.
కానీ భద్రకాళి మూవీ స్టోరీ కాస్త గజిబిజిగా ఉందని, అందరికీ అర్థం కాదని అంటున్నారు. అయితే సినిమాలో బ్రోకర్ కిట్టు పాత్రలో విజయ్ ఆంటోని అదరగొట్టేశారని కొనియాడుతున్నారు. అభయంకర్ విలన్ రోల్ లో సూపర్ గా నటించారని చెబుతున్నారు. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అద్భుతమని.. సినిమాను ఓ రేంజ్ లో నిలబెట్టేందుకు ట్రై చేసిందని చెబుతున్నారు.
అయితే అరుణ్ ప్రభు ఎంచుకున్న పాయింట్ థ్రిల్లింగ్ గా ఉందని.. కానీ తెరపై ఆవిష్కరించే విధానంలో తడబడ్డారని చెబుతున్నారు. సెకండాఫ్ అంతా చాలా ల్యాగ్ చేసినట్లు ఉంటుందని అంటున్నారు. విజువల్స్ చాలా గ్రాండ్ గా ఉన్నాయని, ప్రొడక్షన్ వాల్యూస్ ఫుల్ రిచ్ గా ఉన్నాయని రివ్యూ ఇస్తున్నారు. ఓవరాల్ గా సినిమా అక్కడక్కడ థ్రిల్ ఫీలింగ్ ఇస్తుందని చెబుతున్నారు.
