Begin typing your search above and press return to search.

అయ్యో పూజా.. ఇక డిసైడ్ చేసేది ఆ ఒక్క సినిమానే

ఇంస్ట్రీలో పొడుగుకాళ్ల సుందరిగా పేరున్న పూజా హెగ్డేకు టైమ్ కలిసి రావట్లేదు. చాలా కాలంగా ఆమె మంచి సాలిడ్ హిట్ కోసం ఎదురు చూస్తుంది.

By:  M Prashanth   |   15 Aug 2025 11:22 AM IST
అయ్యో పూజా.. ఇక డిసైడ్ చేసేది ఆ ఒక్క సినిమానే
X

ఇంస్ట్రీలో పొడుగుకాళ్ల సుందరిగా పేరున్న పూజా హెగ్డేకు టైమ్ కలిసి రావట్లేదు. చాలా కాలంగా ఆమె మంచి సాలిడ్ హిట్ కోసం ఎదురు చూస్తుంది. రీసెంట్ గా కార్తిక్ సుబ్బరాజు దర్శకత్వం వహించిన రెట్రోలో హీరోయిన్ గా నటించింది పూజా. అయితే ఈ సినిమా ఆశించిన స్థాయిలో ఆడలేదు. ఒకప్పుడు టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా వెలుగు వెలిగిన పూజాకు.. ప్రస్తుతం తెలుగులో అవకాశాలు రావట్లేదు.

డీసెంట్ హిట్ అందుకోవడానికి తీవ్రంగా కష్టపడుతుం. అయితే తాజాగా రజనీకాంత్ కూలీ సినిమాలో మోనికా అనే స్పెషల్ సాంగ్ లో పూజా ఆడిపాడింది. ఈ పాట రిలీజ్ కు ముందు పుల్ పాపులారిటీ సంపాదించింది. ఈ పాటకు ఫుల్ క్రేడ్ ఏర్పడింది. అయితే పూజా మరోసారి ట్రోలింగ్ అవుతుంది. నిన్న విడుదలైన కూలీకి మిక్స్ డ్ టాక్ వచ్చింది. ఈ కారణంగానే ఆమెపై ట్రోల్స్ వస్తున్నాయి.

పూజా ఇందులో ఆకట్టుకునేందుకు బాగా ట్రై చేసినప్పటికీ.. పాట చిత్రీకరణ ఆకట్టుకోలేదు. అలాగే సినిమాలో ఈ పాటను సరైన సన్నివేశంలో ఉంచలేదని అంటున్నారు. కూలీ విడుదలైన తర్వాత పూజా హెగ్డేను తీవ్రంగా ట్రోల్ చేస్తున్నారు. పూజా బ్యాడ్ లక్ కొనసాగుతుందని.. ఆమెపై నెటిజన్లు నెగిటివ్ కామెంట్స్ చేస్తున్నారు.

మోనికా పాటలో పూజా ఆందంగా, బోల్డ్ గా ఉన్నప్పటికీ.. ఇందులో నటుడు సౌబిన్ షాహిర్ తన డ్యాన్స్ తో ఆకట్టుకున్నాడు. దీంతో ఈ పాటతోనైనా క్రేజ్ వస్తుందని పూజా భావించగా.. రివర్స్ లో ట్రోలింగ్ కు గురైంది. దీంతో డీసెంట్ హిట్ కోసం ఎదురుచూపులు కొనసాగుతున్నాయి.

మరోవైవు, బాలీవుడ్ లో పలు ప్రాజెక్ట్ లు చేస్తుంది. కానీ, అవేం పెద్దగా క్రేజ్ ఉన్న సినిమాలు కావు. దీంతో ఆమె ఆశలన్నీ ప్రస్తుతం విజయ్ జన నాయగన్ సినిమాపైనే ఉన్నాయి. ఇది విజయ్ 63వ సినిమాగా తెరకెక్కుకుంది. హెచ్ వినోద్ దర్శకత్వం వహిస్తున్నారు. కాగా, విజయ్ కెరీర్ లో ఇదే ఆఖరు సినిమా అని ఆయన ఇప్పటికే చెప్పేశారు.

అయితే ఈ సినిమా ఫలితంపైనే పూజా కెరీర్ ఆధారపడి ఉంది. ఆమెకు భవిష్యత్ లో అవకాశాలు రావాలంటే ఈ సినిమా బాగా ఆడాలి. బాలీవుడ్ నటుడు బాబీ డియోల్ విలన్ గా కనిపించనున్నాడు. భారీ అంచనాలతో ఈ సినిమా 2026 సంక్రాంతికి రిలీజ్ కానుంది.