కమోండోని రిక్వెస్ట్ చేసిన హాలీవుడ్ స్టార్!
హాలీవుడ్- బాలీవుడ్ చిత్ర పరిశ్రమల మధ్య సంబంధాలు రోజురోజుకూ సరికొత్త పుంతలు తొక్కుతున్నాయి.రెండు పరిశ్రమల మధ్య బాండింగ్ అంతంకంతకు పెరుగుతుంది.
By: Srikanth Kontham | 20 Jun 2026 4:00 AM ISTహాలీవుడ్- బాలీవుడ్ చిత్ర పరిశ్రమల మధ్య సంబంధాలు రోజురోజుకూ సరికొత్త పుంతలు తొక్కుతున్నాయి.రెండు పరిశ్రమల మధ్య బాండింగ్ అంతంకంతకు పెరుగుతుంది. కలిసి సినిమాలు చేయడం అరుదుగా చోటు చేసుకుంటున్నా? రెండు పరిశ్రమల నటులు, దర్శకుల మధ్య మంచి సఖ్యత ఏర్పడుతుందన్నది కాదనలేని నిజం. ప్రస్తుతం బాలీవుడ్ నటుడు విద్యుత్ జమ్మాల్ - హాలీవుడ్ ప్రముఖ నటుడు జేసన్ మోమోవా కలిసి ప్రతిష్టాత్మక హాలీవుడ్ చిత్రం `స్ట్రీట్ ఫైటర్` లో నటిస్తోన్న సంగతి తెలిసిందే. `అక్వామ్యాన్`, `గేమ్ ఆఫ్ థ్రోన్స్`లాంటి ఫేమస్ చిత్రాల్లో నటించిన జేసన్ మోమోవా తో కలిసి తెరను పంచుకోవడం పట్ల విద్యుత్ ఎంతో సంతోషంగా ఉన్నాడు.
ఈనేపథ్యంలో హాలీవుడ్ నటుడు విద్యుత్ జమ్వాల్ తో పనిచేయడం అంతకు మించి ఆస్వాదిస్తున్నారు. ఈ నేపథ్యంలో విద్యుత్ పై జేసన్ ప్రశంసల జల్లు కురిపించారు. విద్యుత్ అసాధారణమైన ప్రతిభావంతుడని కొనియాడారు. తాను చూసిన అత్యంత అందమైన పురుషులలో విద్యుత్ ఒకరని మోమోవా ప్రశంసించారు. విద్యుత్ యాక్షన్ నైపుణ్యాలు.. అద్భుతమైన నటన తనను ఎంతగానో ఆకట్టుకున్నాయని, అతని ప్రతిభ నమ్మశక్యం కాని విధంగా ఉందని మోమోవా మురిసిపోయారు. అలాగే అదే విద్యుత్ సహాయంతో నేరుగా భారతీయ సినిమాలో కూడా నటించాలని ఉందనే ఆసక్తిని వ్యక్తం చేసారు.
`విద్యుత్ నాకు బాలీవుడ్‌లో ఏదైనా మంచి అవకాశం ఇప్పించాలి. మా ఇద్దరి కాంబినేషన్‌లో ఒక సినిమా వస్తే చాలా సరదాగా ఉంటుంది` అని మోమోవా వ్యాఖ్యానించారు. భారతదేశాన్ని సందర్శించడానికి ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నట్లు వెల్లడించారు. `స్ట్రీట్ ఫైటర్` విషయానికి వస్తే? ఈ చిత్రంలో విద్యుత్ జమ్వాల్ ఆయన ఐకానిక్ గేమ్ క్యారెక్టర్ అయిన ధల్సిమ్ పాత్రలో కనిపించనున్నాడు. ఇటీవల విడుదలైన టీజర్, ట్రైలర్లలో విద్యుత్ లుక్ ప్రేక్షకులను ఎంతగానో ఆశ్చర్యపరిచింది. గుండు, తలపై ఎర్రటి గీతలు, ప్రత్యేకమైన గిరిజన ఆభరణాలు .. కండలు తిరిగిన శరీరంతో విద్యుత్ గుర్తు పట్టలేనంతగా ఉగ్ర రూపంలో కనిపించి ఆకట్టుకున్నాడు.
ఈ సినిమాలో విద్యుత్ జమ్వాల్ కి అవకాశం అంత సులభంగా రాలేదు. అతడి ప్రతిభను గుర్తించి హాలీవుడ్ ప్రొడక్షన్ హౌస్ ఎన్నో పరీక్షలు పెట్టి ఎంపిక చేసింది. విద్యుత్ జమ్వాల్ తనకు తెలిసిన అన్నిరకాల విద్యలను హాలీవుడ్ ప్రొడక్షన్ ముందు ఉంచాడు. వాటికి సంబంధించి ప్రత్యేకమైన వీడియోలు చేసి స్టూడియోలకు పంపించాడు. వాటిని చూసే సినిమాలో కీలక పాత్రకు ఎంపిక చేసారు. విద్యుత్ జమ్వాల్ మార్షల్ ఆర్ట్స్ లోఆరి తేరిన వాడు. అదే కళ హాలీవుడ్ స్టార్లను ప్రభావితం చేసింది. మరి హాలీవుడ్ డెబ్యూతో విద్యుత్ జమ్వాల్ ఎంత వరకూ సక్సెస్ అవుతాడో చూడాలి.` స్ట్రీట్ ఫైటర్` 1993 నేపథ్యంలో సాగే చిత్రమిది. పారమౌంట్ పిక్చర్స్ ద్వారా ఈ ఏడాది అక్టోబర్ 16న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.
