'అక్క' ఇంట్లో వేడుక.. మనోజ్ ఎమోషనల్ నోట్ ఇలా..
వీడియోలో మనోజ్ పల్లకిని మోయడం, విద్యను ఎత్తుకుని దిగించడం, ఆమెతో సరదాగా మాట్లాడటం వంటి దృశ్యాలు ఎంతో ఆకట్టుకుంటున్నాయి.
By: M Prashanth | 22 March 2026 12:02 PM ISTటాలీవుడ్ నటి మంచు లక్ష్మి కుటుంబంలో ఇటీవల జరిగిన ఓణీల వేడుక సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ఆమె కూతురు విద్యా నిర్వాణ ఓణీల వేడుక ఎంతో సంప్రదాయంగా.. కుటుంబ సభ్యులు, సన్నిహితుల మధ్య గ్రాండ్ గా నిర్వహించారు. ఆ వేడుకకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు బయటకు రావడంతో అభిమానులను ఆకట్టుకుంటున్నాయి.
అయితే ఆ ఈవెంట్ ను ప్రత్యేకంగా నిలబెట్టింది మంచు మనోజ్! ఆయన తన మేనకోడలు విద్యా నిర్వాణ వేడుకలు దగ్గరుండి చూసుకుంటూ ప్రతి విషయంలో శ్రద్ధ తీసుకున్నారు. ముఖ్యంగా విద్యను పల్లకిలో కూర్చోబెట్టి వేదికపైకి తీసుకువచ్చిన సందర్భం అందరి హృదయాలను హత్తుకుంది. మామగా తన ప్రేమ, బాధ్యత చూపించిన తీరు అక్కడ ఉన్న వారిని మాత్రమే కాకుండా సోషల్ మీడియాలో చూసిన వారిని కదిలించింది.
కొన్ని రోజుల క్రితం మంచు లక్ష్మి ఆ వేడుకకు సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేయగా, అవి వెంటనే వైరల్ అయ్యాయి. తాజాగా మంచు మనోజ్ కూడా ఆ ఈవెంట్ కు సంబంధించిన ఓ ప్రత్యేక వీడియోను ఇప్పుడు పంచుకున్నారు. ఈ వీడియోలో ఆయన తన మేనకోడలితో గడిపిన క్యూట్ మూమెంట్స్ ను అభిమానులతో షేర్ చేసుకున్నారు.
వీడియోలో మనోజ్ పల్లకిని మోయడం, విద్యను ఎత్తుకుని దిగించడం, ఆమెతో సరదాగా మాట్లాడటం వంటి దృశ్యాలు ఎంతో ఆకట్టుకుంటున్నాయి. మామ-మేనకోడలు మధ్య ఉన్న ప్యూర్ లవ్ క్లియర్ గా కనిపిస్తోంది. ఆ క్యూట్ వీడియో చూసిన నెటిజన్లు, అభిమానులు.. "ప్రతి అమ్మాయి జీవితంలో ఇలాంటి మేనమామ ఉండాలి" అంటూ కామెంట్లు చేస్తున్నారు.
అయితే ఈ వీడియోతో పాటు మనోజ్ రాసిన ఎమోషనల్ క్యాప్షన్ కూడా ప్రత్యేకంగా నిలిచింది. తన అక్క అయిన మంచు లక్ష్మి గురించి మాట్లాడుతూ, ఆమె తన జీవితంలో ఎంత ముఖ్యమో వెల్లడించారు. "నా జీవితంలో దేవుడు ఇచ్చిన గొప్ప వరాల్లో ఒకటి నా అక్క" అంటూ ప్రారంభించిన ఆయన, ఆమెపై ఉన్న ప్రేమను హార్ట్ ఫుల్ గా వ్యక్తపరిచారు.
అలాగే విద్యా నిర్వాణ తన జీవితంలోకి వచ్చిన తర్వాత మామగా తన ప్రయాణం ప్రారంభమైందని, అది మాటల్లో చెప్పలేని అనుభూతి అని పేర్కొన్నారు. ఆమెకు రక్షణగా ఉండటం, స్నేహితుడిగా మారడం, మోటివేట్ చేయడం తన బాధ్యతగా భావిస్తున్నానని తెలిపారు. "నీవు ప్రపంచాన్ని జయించాలి.. నీ మనసు ఎంత స్మూత్ గా ఉంటుందో అదే నీ బలం. నువ్వు చూడకపోయినా నేను నీ వెనుక నిలబడి ఉంటాను" అంటూ మనోజ్ రాసుకొచ్చారు.
అయితే మొత్తం వేడుకలో ఫ్యామిలీ రిలేషన్స్, ప్రేమ, అనుబంధాలు ఎంత ముఖ్యమో మరోసారి క్లియర్ గా తెలుస్తోంది. ముఖ్యంగా మంచు కుటుంబంలో మామ- మేనకోడలు మధ్య ఉన్న ఆప్యాయత ప్రేక్షకులను అలరిస్తోంది. ప్రస్తుతం ఆ వీడియో, ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతూ నెటిజన్ల నుంచి మంచి రెస్పాన్స్ ను అందుకుంటున్నాయి.
