Begin typing your search above and press return to search.

డ‌ర్టీభామ మ‌రో రెండు సౌత్ సినిమాల్లో!

తమిళ ఇండస్ట్రీలో వరుస విజయాలతో దూసుకుపోతున్న స్టార్ హీరోలు కార్తీ .. శివకార్తికేయన్ కొత్త చిత్రాలలో కీల‌క పాత్ర‌లో నటించేందుకు సంతకం చేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

By:  Srikanth Kontham   |   1 Nov 2026 6:00 PM IST
డ‌ర్టీభామ మ‌రో రెండు  సౌత్ సినిమాల్లో!
X

దక్షిణాది చిత్రసీమలో ప్రత్యేకమైన గుర్తింపును ద‌క్కించుకున్న నటి విద్యాబాల‌న్ తమిళ పరిశ్రమలో మోస్ట్ వాంటెడ్ ఆర్టిస్ట్‌గా మారిపోతున్నారు. ఇటీవల విడుదలైన సూపర్‌స్టార్ రజనీకాంత్ చిత్రం `జైలర్ 2`లో నటనతో ఆకట్టుకున్న సీనియ‌ర్ బ్యూటీ కి కోలీవుడ్ నుంచి వరుస అవ‌కాశాలు క్యూ క‌డుతున్నాయి. గ్లామర్‌తో పాటు నటనకు ప్రాధాన్యమున్న పాత్రలను ఎంచుకుంటూ ప్రేక్షకులను అలరిస్తున్న విద్య‌ కోలీవుడ్‌లోని ప్రముఖ దర్శకులు ... అగ్ర కథానాయకుల ప్రాజెక్ట్‌లలో కీలక పాత్రలు దక్కించుకుంటూ టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారుతున్నారు.

`జైలర్ 2` సాధించిన భారీ విజయం డర్టీభామ కెరీర్‌కు ఊహించని మైలేజ్‌ను అందించింది. ఆ చిత్రంలో విద్య‌ కనిపించిన విధానం .. పాత్రలోని తీరు తెన్నులు తమిళ ప్రేక్షకులను మెప్పించాయి. పెద్ద బ్యానర్ల నుంచి వస్తున్న అవకాశాలను అత్యంత జాగ్రత్తగా పరిశీలిస్తూ కెరీర్‌కు ప్లస్ అయ్యే వైవిధ్యమైన పాత్రలను మాత్రమే విద్య‌ ఎంపిక చేసు కుంటున్నారు. ఈ నేప‌థ్యంలోనే హిందీ దర్శకుడు ఆర్ బాల్కీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ప్ర‌త్యేక‌ తమిళ చిత్రంలో కీలక పాత్ర పోషిస్తున్నారు.

ఆర్ బాల్కీ చిత్రాల్లో నటీనటుల పాత్రలు వినూత్నంగా, మానవీయ సంబంధాలకు అద్దం పట్టేలా ఉంటాయి. అలాంటి విలక్షణ దర్శకుడి క్రాఫ్ట్‌లో భాగం కావడం విద్యాబాల‌న్ నటనలో మరో కొత్త కోణాన్ని ఆవిష్కరిస్తుంద‌ని చెప్పొచ్చు. ఇందులో విద్య పాత్రకు సంబంధించిన విషయాలను యూనిట్ గోప్యంగా ఉంచింది. అయితే ఈ సినిమా ద్వారా కోలీవుడ్‌లో విద్య‌ స్థానం మరింత పటిష్టం కావడం ఖాయమని తెలుస్తోంది.

అలాగే కోలీవుడ్ మీడియాలో విద్య తదుపరి ప్రాజెక్ట్‌లపై ఓ సంచలన ప్రచారం నడుస్తోంది. తమిళ ఇండస్ట్రీలో వరుస విజయాలతో దూసుకుపోతున్న స్టార్ హీరోలు కార్తీ .. శివకార్తికేయన్ కొత్త చిత్రాలలో కీల‌క పాత్ర‌లో నటించేందుకు సంతకం చేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇద్దరు హీరోలకు తమిళంతో పాటు తెలుగులోనూ భారీ మార్కెట్ ఉన్న నేపథ్యంలో ఈ సినిమాల్లో న‌టించేందుకు విద్య ఆస‌క్తిగా ఉంద‌ని తెలుస్తోంది. ఈ క్రేజీ ప్రాజెక్ట్‌లకు సంబంధించిన అధికారిక ప్రకటనలు త్వరలోనే రానున్నట్లు తెలుస్తోంది. ఈ ప్ర‌చారం గ‌నుక‌ నిజమైతే రాబోయే రోజుల్లో డర్టీభామ కోలీవుడ్‌లో బిజీయెస్ట్ న‌టిగా మార‌డం ఖాయం.

ప్ర‌స్తుతం విద్యా బాల‌న్ బాలీవుడ్ కెరీర్ ఏమంత బిజీగా లేదు. అవ‌కాశాలు వ‌స్తే స‌ద్వినియోగం చేసుకుంటుంది. అలాగ‌ని ప్రాధాన్య‌త లేని పాత్ర‌ల‌కు ఒకే చెప్ప‌డం లేదు. పాత్ర‌ల విష‌యంలో చాలా సెల‌క్టివ్ గా ఉంటుంది. ఏ సినిమా చేసినా? అందులో విద్య పాత్ర హైలైట్ గా ఉంటుందంటేనే క‌మిట్ అవుతుంది. లేదంటే నిర్మొహ మాటంగా నో చెబుతుంది.