అనుభవాలు విలువైనవి.. ఆ పాత్రలపై కీలక కామెంట్స్!
విద్యాబాలన్ సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చి 20 ఏళ్లయిన నేపథ్యంలో కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలను బయటపెట్టింది.
By: Madhu Reddy | 14 Sept 2025 5:00 PM ISTబాలీవుడ్ నటి విద్యాబాలన్..ఈ పేరు చెప్పగానే అందరికీ డర్టీ పిక్చర్, కహాని,షేర్నీ వంటి కొన్ని సినిమాలు కళ్ళ ముందు మెదులుతాయి. సినిమాల్లోకి హీరోయిన్ గా ఎవరైనా ఎంట్రీ ఇవ్వవచ్చు. కానీ ప్రజల మనసు గెలిచిన వాళ్ళే ఇండస్ట్రీలో ఎక్కువ కాలం నిలుస్తారు.అలాంటి వారిలో విద్యాబాలన్ కూడా ఒకరు. విద్యాబాలన్ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి 20 ఏళ్లయినా కూడా ఇంకా చేతినిండా అవకాశాలతో బిజీ బిజీగా గడుపుతోంది.అయితే అలాంటి విద్యాబాలన్ సినిమాల్లోకి వచ్చాక ఎన్ని ఇబ్బందులు పడిందో.. ఎలాంటి కష్టాన్ని అనుభవించిందో.. 20 ఏళ్ల జర్నీలో ఆమె ఎదుర్కొన్న ఆటుపోట్లు ఏంటి ?అనేది ఆమె మాటల్లోనే తెలుసుకుందాం..
వారి మాటలు విని శరీరాన్ని కష్టపెట్టాను..
విద్యాబాలన్ సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చి 20 ఏళ్లయిన నేపథ్యంలో కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలను బయటపెట్టింది. ఆమె ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. "నేను నా 26 ఏళ్ల వయసులో సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చాను. అలా మొదటి సినిమా పరిణీత విడుదలయ్యాక.. నా కెరియర్ మొత్తం మారిపోయింది. ఆ తర్వాత వరుస ఆఫర్స్ క్యూ కట్టాయి. సినిమాల్లోకి వచ్చిన కొత్తలో చాలామంది నా బరువు తగ్గించుకోమని సలహాలు ఇచ్చారు. వాళ్ల కారణంగా నా శరీరాన్ని చాలా కష్టపెట్టాను కూడా. కానీ ఆ తర్వాత అసలు నిజం గ్రహించి ఎవరెన్ని విమర్శలు చేసినా.. ఎవరెన్ని చెప్పినా నేను నాలా ఉండాలని ఫిక్స్ అయ్యాను.
ఆయన రాకతో జీవితం మొత్తం మారిపోయింది..
అలా సిద్ధార్థ్ కపూర్ నా జీవితంలోకి ఎంట్రీ ఇచ్చాక నా లైఫ్ మొత్తం చేంజ్ అయిపోయింది. ఎందుకంటే అప్పటినుండి నన్ను నేను ప్రేమించుకోవడం మొదలుపెట్టాను.మనల్ని మనం ప్రేమించుకుంటే ఎన్ని విమర్శలు వచ్చినా పట్టించుకోనవసరం లేదు. సినిమాల్లోకి రావాలంటే బ్యాగ్రౌండ్ ఉండాలి. కానీ నేను ఏ బ్యాక్ గ్రౌండ్ లేకుండానే వచ్చాను. కేవలం నటన మీద ఉన్న ఇంట్రెస్ట్ తోనే ఇప్పటివరకు కొనసాగుతున్నాను. అలాగే లేడీ ఓరియంటెడ్ సినిమాలకు నన్ను కేరాఫ్ అడ్రస్ అంటే చాలా బాగా ఆస్వాదిస్తాను. సినిమాల్లోకి వచ్చిన కొత్తలో చాలా ఇబ్బందులు పడ్డాను. కానీ అన్నింటినీ ఓర్చుకొని ముందుకు అడుగులు వేసా. మా అమ్మ ప్రతిసారి నా ప్రవర్తన చూసి నువ్వు నీ వయసు కంటే ఎక్కువ మెచ్యూర్డ్ గా ఉన్నావని పొగుడుతుంది. కానీ నేను దేన్ని కూడా సీరియస్ గా తీసుకోను.
మీరు మీలా ఉండండి..
పా మూవీలో అమితాబ్ బచ్చన్ కి తల్లిగా చేయమని డైరెక్టర్ చెప్పినప్పుడు కాస్త ఆలోచనలో పడ్డా. చాలామంది నా సన్నిహితులు నువ్వు తల్లి క్యారెక్టర్ చేస్తే నీ కెరీర్ ముగిసిపోతుందని హెచ్చరించారు.కానీ నేను మాత్రం నా మనసు చెప్పిందే విని ఆ సినిమాలో అమితాబ్ కి తల్లిగా నటించాను. నా ఈ 20 ఏళ్ల సినీ జర్నీలో కొత్తగా వచ్చే వారికి ఒకే ఒక్క సలహా ఇస్తాను.ఎవరైనా సరే మీలా మీరు ఉండండి. ఒకరు చెప్పారని మీ వ్యక్తిత్వాన్ని మార్చుకోకండి.
ఒకవేళ మీ లైఫ్ లో ఏదైనా ఊహించనట్టు జరగకపోయినా కూడా దాన్ని స్వీకరించండి. ఎందుకంటే అది ఒక గుణపాఠంగా నేర్చుకోండి. మీలో ఉన్న బెస్ట్ ఏంటి? అనేది మీకు మాత్రమే తెలుసు" అంటూ విద్యాబాలన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది..
విద్యాబాలన్ సినిమాలు..
ఇక విద్యాబాలన్ మొదట సౌత్ సినిమాల ద్వారానే ఇండస్ట్రీకి ఎంట్రీ ఇవ్వాల్సింది. అలా మోహన్ లాల్ తో ప్రకటించిన 'చక్రం' మూవీలో హీరోయిన్ గా తీసుకొని ఆ తర్వాత అర్ధాంతరంగా తీసేసారు. ఇక మరో సినిమాలో కూడా అలాగే విద్యాబాలన్ ని పక్కన పెట్టడంతో చాలామంది ఆమెపై ఐరన్ లెగ్ అనే ముద్ర వేశారు. కానీ పరిణీత సినిమా విడుదలయ్యాక విద్యాబాలన్ ఓవర్ నైట్ లో స్టార్ హీరోయిన్ అయిపోయింది.
