Begin typing your search above and press return to search.

ఓపిగ్గా భ‌రించినందుకు మెగాస్టార్‌కు 4.5 కోట్ల గిఫ్ట్

అయితే త‌న జీవితంలో ఒక మ‌ర్చిపోలేని సంఘ‌ట‌న గురించి విధు వినోద్ తాజా ఇంట‌ర్వ్యూలో వెల్ల‌డించారు.

By:  Sivaji Kontham   |   2 Sept 2025 9:22 AM IST
ఓపిగ్గా భ‌రించినందుకు మెగాస్టార్‌కు 4.5 కోట్ల గిఫ్ట్
X

బాలీవుడ్ ఫేమ‌స్ ద‌ర్శ‌క‌ర‌చ‌యిత విధు వినోద్ చోప్రా ప‌రిచ‌యం అవ‌స‌రం లేదు. అత‌డు ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన 'ట్వ‌ల్త్ ఫెయిల్' బాక్సాఫీస్ వ‌ద్ద బ్లాక్ బ‌స్ట‌ర్ సాధించ‌డ‌మే గాక‌, క్రిటిక్స్ ప్ర‌శంస‌లు అందుకుంది. బ‌ల‌మైన‌ నోటి మాట కార‌ణంగా అద్భుత‌ విజయం సాధించిన సినిమాల‌లో ఇది ఒక‌టి. పరిందా, 1942: ఎ లవ్ స్టోరీ, షికారా, ఏక‌ల‌వ్య‌ లాంటి చిత్రాలకు కూడా విధు వినోద్ చోప్రా దర్శకత్వం వహించాడు. కానీ అత‌డు ర‌చ‌యిత‌గా ప‌ని చేసిన‌ మున్నా భాయ్ ఎంబీబీఎస్‌, పీకే , 3 ఇడియట్స్ కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ చిత్రాలుగా నిలిచాయి. వీట‌న్నిటికీ రాజ్ కుమార్ హిరాణీ దర్శకత్వం వహించారు.

అయితే త‌న జీవితంలో ఒక మ‌ర్చిపోలేని సంఘ‌ట‌న గురించి విధు వినోద్ తాజా ఇంట‌ర్వ్యూలో వెల్ల‌డించారు. అత‌డు ద‌ర్శ‌క‌త్వం వ‌హిచిన `ఏక‌ల‌వ్య` ఫ్లాప్ చిత్రంగా నిలిచింది. కానీ అది ఇండియా నుంచి ప్ర‌తిష్ఠాత్మ‌క ఆస్కార్స్ కి నామినేట్ అయింది. ఆ స‌మ‌యంలో అత‌డు చిత్ర క‌థానాయ‌కుడు, బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బ‌చ్చ‌న్ కి 4.5 కోట్ల ఖ‌రీదైన రోల్స్ రాయిస్ కార్ ని గిఫ్ట్ గా ఇచ్చాడు. అప్ప‌టికి త‌న‌వ‌ద్ద కేవ‌లం ఒక రెడ్ క‌ల‌ర్ మారుతి వ్యాన్ మాత్ర‌మే ఉంది. అయితే త‌న‌యుడు 11ల‌క్ష‌లు పెట్టి ఒక కార్ ని కొని అమితాబ్ కి కానుకిచ్చాడ‌ని అత‌డి త‌ల్లి భావించార‌ట‌. త‌న‌కు దాని ఖ‌రీదు 4.5 కోట్లు అని తెలియ‌ద‌ని విధు వినోద్ గుర్తు చేసుకున్నాడు. అంతేకాదు.. త‌న‌ను ఒక చెంప దెబ్బ కొట్టి, బేవ‌కూఫ్‌! అని త‌న త‌ల్లి తిట్టార‌ట‌. మెగాస్టార్ అమితాబ్ కి అంత‌టి ఖ‌రీదైన కార్ ని కొనిచ్చి, ఇలాంటి చెత్త డ‌బ్బా `బేవ‌కూఫ్‌` అనే మారుతి వ్యాన్‌ లో ప్ర‌యాణిస్తావా? అని నిల‌దీసార‌ట‌.

నిజానికి ఏక‌ల‌వ్య చిత్రీక‌ర‌ణ స‌మ‌యంలో అమితాబ్, విధు వినోద్ మ‌ధ్య గొడ‌వ‌లొచ్చాయి. నిన్ను వారం కూడా భ‌రించ‌లేన‌ని అమితాబ్ అన్నార‌ట‌. నిజానికి ఏక‌ల‌వ్య సెట్స్‌ పైకి వెళ్లాక వారం ప‌దిరోజుల్లోనే త‌మ మ‌ధ్య గొడ‌వ‌లు వ‌చ్చాయ‌ని, అయితే త‌న‌ను అలాగే భ‌రిస్తూ అమితాబ్ సినిమాని పూర్తి చేసార‌ని నాటి గొడ‌వ‌ల్ని గుర్తు చేసుకున్నారు. నన్ను సహించారు కాబట్టి నేను అమితాబ్‌కి రూ. 4.5 కోట్ల విలువైన కారును బహుమతిగా ఇచ్చాను. ఆ స్థాయి స్టార్ నన్ను సహించాల్సి రావడం నిజంగా గొప్పతనం.. విన‌యం! అని నాటి ఘ‌ట‌న‌ను గుర్తు చేసుకున్నారు చోప్రా.