2026 వెంకీ లైనప్ ఫ్యాన్స్ ఫీస్ట్!
విక్టరీ వెంకటేష్ `సంక్రాంతికి వస్తున్నాం`తో 300 కోట్ల క్లబ్లో కి అడుగు పెట్టిన సంగతి తెలిసిందే. వెంకీ- అనీల్ రావిపూడి కాంబినేషన్ నుంచి ఏ మాత్రం ఊహించని బ్లాక్ బస్టర్ ఇది.
By: Srikanth Kontham | 14 Dec 2025 7:00 AM ISTవిక్టరీ వెంకటేష్ `సంక్రాంతికి వస్తున్నాం`తో 300 కోట్ల క్లబ్లో కి అడుగు పెట్టిన సంగతి తెలిసిందే. వెంకీ- అనీల్ రావిపూడి కాంబినేషన్ నుంచి ఏ మాత్రం ఊహించని బ్లాక్ బస్టర్ ఇది. అప్పటి వరకూ వెంకీ 100 కోట్ల క్లబ్ లో కూడా చేరలేదు. ఎలాంటి సినిమాలు చేసినా? 50 కోట్లు కూడా రావడం కష్టంగా ఉండేది. అలాంటి వెంకీ ఒకేసారి ఏకంగా 300 కోట్ల వసూళ్లు సాధించడంతో? అతడి స్టార్ డమ్ ఒక్కసారిగా రెట్టింపు అయింది. ఇదంతా గత సంక్రాంతి టాపిక్. మరి ఈ సంక్రాంతి మాటేంటి? అంటే మెగాస్టార్ చిరంజీవి కథానాయకుడిగా నటిస్తోన్న `మన శంకరవరప్రసాద్ గారు` లో కూడా వెంకీ కీలక పాత్రతో అలరించనున్నారు.
తొలుత గెస్ట్ రోల్ అనుకున్నా? అందుకు చిరంజీవి ఒప్పుకోలేదు. ఓ కీలక పాత్రగా మలచాలని దర్శకుడు అనీల్ రావిపూడికి సూచించడంతో? వెంకీ రోల్ సినిమాలో దాదాపు 20 నిమిషాల నిడివితో డిజైన్ చేసారు. చిరంజీవి-వెంకీ కాంబినేషన్ లో ఓ సాంగ్ కూడా ప్రేక్షకుల్ని అలరించనుంది. కడుపుబ్బా నవ్వించే కామెడీ ట్రాక్ తో పాటు మాంచి మసాలా సాంగ్ లోనూ కలిసి స్టెప్పులు వేస్తున్నారు. అలా ఈ సంక్రాంతికి కూడా వెంకీ తన అభిమానుల్ని అలరించ నున్నారు. కొత్త ఏడాదికి వెంకీ ఆ రకంగా వెల్కమ్ చెప్పబోతున్నారు. ఇప్పటికే వెంకీ కొత్త సినిమా త్రివిక్రమ్ దర్శకత్వంలో మొదలైన సంగతి తెలిసిందే.
`ఆదర్శకుటుంబం హౌస్ నెంబర్ 47` అంటూ గురూజీ మార్క్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ ని తెరకెక్కిస్తున్నారు. ఈసినిమాపై అంచనాలు ఏ స్థాయిలో ఉన్నాయో చెప్పాల్సిన పనిలేదు. తొలిసారి వెంకీతో త్రివిక్రమ్ పని చేయడం..`మల్లీశ్వరి` లాంటి సినిమాలో రైటర్ గా గురూజీ హస్తం ఉండటంతో? ఆదర్శకుటుంబం మరింత క్రేజీగా మారింది. ఈ సినిమా కూడా చిత్రీకరణ సహా అన్ని పనులు పూర్తి చేసుకుని 2026 ద్వితియార్ధంలో ప్రేక్షకుల ముందుకు రానుంది. మరోవైపు సస్పెన్స్ థ్రిల్లర్ `దృశ్యం` ప్రాంచైజీ నుంచి పార్ట్ 3కి కూడా రంగం సిద్దమవుతోంది.
ఇప్పటికే మాతృక వెర్షన్ మాలీవుడ్ లో `దృశ్యం 3` షూటింగ్ పూర్తి చేసాడు దర్శకుడు జీతూ జోసెఫ్. బాలీవుడ్ లో కూడా త్వరలోనే షూటింగ్ ప్రారంభమ వుతుంది. ఈ నేపథ్యంలో టాలీవుడ్ `దృశ్యం 3` ఆసక్తికరంగా మారింది. జీతూ మాలీవుడ్ నుంచి రిలీవ్ అయిన నేపథ్యంలో తెలుగు వెర్షన్ కు సంబంధించి కొత్త అప్ డేట్ కొత్త ఏడాదిలో వస్తుందని ప్రేక్షకులంతా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తు న్నారు. ఇప్పటికే `దృశ్యం` నుంచి రిలీజ్ అయిన రెండు భాగాలు భారీ విజయం సాధించిన సంగతి తెలిసిందే. సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్ కు తెలుగు ఆడియన్స్ బ్రహ్మరధం పట్టారు. అయితే రెండవ భాగం కోవిడ్ కారణంగా థియేటర్లో కాకుండా ఓటీటీ లో రిలీజ్ అవ్వడం తెలుగింట అందరికీ రీచ్ అవ్వలేదు. ఓటీటీ రిలీజ్ లో మాత్రం మంచి టాక్ సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే.
