వెంకీ కోసం పండగ గర్ల్‌ఫ్రెండ్ ను సెట్ చేస్తున్నారా?
అందులో భాగంగానే తన నెక్ట్స్ మూవీని మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ తో అనౌన్స్ చేసి ఫ్యాన్స్ కు మంచి ఆనందాన్నిచ్చారు.
By: Sravani Lakshmi Srungarapu | 4 Sept 2025 1:22 PM ISTటాలీవుడ్ లో ఫ్యామిలీ హీరో అనగానే వెంటనే గుర్తొచ్చే పేరు విక్టరీ వెంకటేష్. దగ్గుబాటి రామానాయుడు వారసుడిగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన వెంకీ మొదటి నుంచే ఫ్యామిలీ ఓరియెంటెడ్ సినిమాల్లో నటిస్తూ ఫ్యామిలీ హీరోగా గుర్తింపు పొందారు. చిరూ, బాలయ్య, నాగ్ తో పోటీ పడుతూ ఇప్పటికీ సీనియర్ హీరోల్లో ఒకరిగా కంటిన్యూ అవుతున్న వెంకీకి మధ్యలో కొంత కాలం వరుస ఫ్లాపులు ఇబ్బంది పెట్టాయి.
సీనియర్ హీరోల్లో ఆ రికార్డు సాధించిన ఏకైక హీరో
కానీ ఈ ఇయర్ సంక్రాంతికి వస్తున్నాం సినిమాతో రూ.300 కోట్లు కలెక్ట్ చేసి సీనియర్ హీరోల్లో ఆ రికార్డు సాధించిన ఏకైక హీరోగా నిలిచారు వెంకీ. సంక్రాంతికి వస్తున్నాం సినిమా వెంకీ కెరీర్ ను ఒక్కసారిగా మార్చేసింది. ఆ సినిమా తర్వాత ఆయనతో సినిమాలు చేయడానికి డైరెక్టర్లు ఎగబడుతున్నారు. అయితే ఆఫర్లు వస్తున్నా తొందరపడకుండా వెంకీ తర్వాతి సినిమాల విషయంలో చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తున్నారు.
త్రివిక్రమ్ దర్శకత్వంలో సినిమా
అందులో భాగంగానే తన నెక్ట్స్ మూవీని మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ తో అనౌన్స్ చేసి ఫ్యాన్స్ కు మంచి ఆనందాన్నిచ్చారు. గతంలో త్రివిక్రమ్ రైటర్ గా ఉన్నప్పుడు వీరిద్దరూ కలిసి వర్క్ చేసి మంచి హిట్స్ ను అందుకున్నారు. కానీ త్రివిక్రమ్ డైరెక్టర్ అయ్యాక వీరిద్దరి కాంబోలో ఇప్పటివరకు సినిమా రాలేదు. వీరి కలయికలో ఎప్పుడెప్పుడు సినిమా వస్తుందోనని వెయిట్ చేసిన ఫ్యాన్స్ ఆశ ఇప్పుడు తీరబోతుంది.
మొదట్లో రుక్మిణి వసంత్ పేరు
త్రివిక్రమ్ ఈ సినిమాను తన మార్క్ టేకింగ్ తో, వెంకీ కామెడీ టైమింగ్ కు తగ్గట్టు తెరకెక్కించనున్నట్టు తెలుస్తోంది. అయితే సినిమా అనౌన్స్ అయింది కానీ అందులో వెంకీ సరసన హీరోయిన్ గా ఎవరు నటిస్తున్నారనేది మాత్రం ఇంకా ఖరారు కాలేదు. ఈ నేపథ్యంలోనే ఈ మూవీలో హీరోయిన్ గురించి రోజుకో పేరు వినిపిస్తోంది. ఈ సినిమాలో ముందు రుక్మిణి వసంత్ హీరోయిన్ గా నటిస్తుందని వార్తలొచ్చాయి.
పలువురి పేర్లను పరిశీలిస్తున్న మేకర్స్
కానీ ఇప్పుడు సంక్రాంతికి వస్తున్నాం సినిమాలో వెంకీ గర్ల్‌ఫ్రెండ్ గా నటించిన మీనాక్షి చౌదరిని ఫైనల్ చేశారని టాక్ వినిపిస్తుంది. అయితే ఈ సినిమా కోసం శ్రద్ధా శ్రీనాధ్, నేహా శెట్టి, శ్రీనిధి శెట్టి పేర్లను కూడా మేకర్స్ పరిశీలిస్తున్నారని రూమర్లు వినిపిస్తున్నాయి. ఏదేమైనా హీరోయిన్ విషయంలో మేకర్స్ నుంచి అఫీషియల్ అనౌన్స్‌మెంట్ వచ్చే వరకు ఏ విషయాన్ని నమ్మలేం. కాగా ఈసినిమాకు వెంకటరమణ కేరాఫ్ ఆనంద నిలయం, అలివేలు వెంకటరత్నం అనే టైటిల్స్ ను మేకర్స్ పరిశీలిస్తున్నట్టు సమాచారం. సెప్టెంబర్ నెలాఖరు నుంచి ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లనుంది.
