యంగ్ హీరోలు చేయలేనిది వెంకీ చేస్తాడా?
టాలీవుడ్ సీనియర్ హీరోల్లో ఒకరైన విక్టరీ వెంకటేష్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు.
By: Sravani Lakshmi Srungarapu | 4 Sept 2025 1:00 PM ISTటాలీవుడ్ సీనియర్ హీరోల్లో ఒకరైన విక్టరీ వెంకటేష్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. ఈ ఏడాది పండక్కి సంక్రాంతికి వస్తున్నాం సినిమాతో ప్రేక్షకుల్ని పలకరించి, తన కెరీర్లోనే బిగ్గెస్ట్ హిట్ అందుకున్న వెంకీ ఆ సినిమా సక్సెస్ ఇచ్చిన జోష్ లో వరుస సినిమాలను లైన్ లో పెడుతూనే సంక్రాంతికి వస్తున్నాం తో వచ్చిన సక్సెస్ ను జాగ్రత్తగా కాపాడుకోవాలని కూడా చూస్తున్నారు.
మొదటి సారి త్రివిక్రమ్ దర్శకత్వంలో..
అందుకే కాస్త టైమ్ తీసుకుని మరీ తన నెక్ట్స్ ప్రాజెక్టును మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చి ఆల్రెడీ ఆ సినిమాను పూజా కార్యక్రమాలతో మొదలుపెట్టారు. గతంలో వెంకీ- త్రివిక్రమ్ కాంబినేషన్ లో వచ్చిన నువ్వు నాకు నచ్చావ్, మల్లీశ్వరి సినిమాలు సూపర్ హిట్లు అయిన సంగతి తెలిసిందే. కానీ ఆ సినిమాలకు త్రివిక్రమ్ డైరెక్టర్ కాదు, కేవలం రైటర్ మాత్రమే.
మన శంకరవరప్రసాద్ గారులో స్పెషల్ రోల్
త్రివిక్రమ్ డైరెక్టర్ అయ్యాక వెంకీతో చేస్తున్న మొదటి సినిమా కావడంతో ఈ మూవీపై అందరికీ భారీ అంచనాలున్నాయి. సెప్టెంబర్ నెలలోనే ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లనుంది. ఓ వైపు త్రివిక్రమ్ డైరెక్షన్ లో సినిమా చేస్తూనే మరోవైపు చిరంజీవి హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో వస్తున్న మన శంకరవరప్రసాద్ గారు సినిమాలో ఓ ప్రత్యేక పాత్రలో కనిపించబోతున్నారు.
నవంబర్ నుంచి దృశ్యం3
ఈ రెండూ కాకుండా నవంబర్ నుంచి సూపర్‌హిట్ ఫ్రాంచైజ్ హిట్3 ను సెట్స్ పైకి తీసుకెళ్లనున్నారు వెంకీ. మొత్తానికి మూడు సినిమాలతో ఈ ఇయర్ మొత్తం వెంకీ షెడ్యూల్ చాలా బిజీగా ఉంది. ఈ మూడు సినిమాలను ఈ ఇయర్ లోనే పూర్తి చేసి వచ్చే ఏడాది వాటిని ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని వెంకీ చాలా గట్టి ప్లానే వేస్తున్నారు. అంటే 2026లో వెంకీ నుంచి మూడు సినిమాలు రిలీజ్ కానున్నాయన్నమాట. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏ హీరోకు ఇలా ఒకే ఇయర్ మూడు సినిమాలు రిలీజ్ చేయడం కుదరడం లేదు. యంగ్ హీరోలు సైతం ఏడాదికి ఒకటి రెండు సినిమాలే చేస్తుంటే వెంకీ మాత్రం వారికంటే స్పీడుగా కెరీర్ బండిని నడిపిస్తున్నారు.
