ఆ రెండు బ్లాక్ బస్టర్లపై నటుడు షాకింగ్ కామెంట్!
దేశ భక్తి..సినిమా విజయాలకు ఇది ఒక ఫార్ములా కాదన్నారు. అలా భావిస్తే గనుక అవమానించడమే అవుతుందన్నారు.
By: Srikanth Kontham | 22 Dec 2025 11:00 PM ISTఇటీవలే రిలీజ్ అయిన `ధురంధర్` ఎంత పెద్ద విజయం సాధించిందో తెలిసిందే. ఇప్పటికే 800 కోట్లకు పైగా వసూళ్లను సాధించింది. 1000 కోట్ల క్లబ్ లోనూ చేరుతుందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. అదే జరిగితే రణవీర్ సింగ్ ఆ క్లబ్లోకి అడుగు పెట్టినట్లే. అంతకు ముందు రిలీజ్ అయిన `ఛావా` కూడా భారీ విజయమే సాధించింది. ఈ చిత్రం ఏకంగా 700 కోట్లకు పైగా వసూళ్లను సాధించింది. విక్కీ కౌశల్ కెరీర్ లో ఇదో మైల్ స్టోన్ మూవీ. అయితే ఈ రెండు చిత్రాలు దేశభక్తి నేపత్యంలో తెరకెక్కిన చిత్రాలు. `ధురంధర్` వాస్తవ సంఘటనలు ఆధారంగా ఓ స్పై బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కిన చిత్రమైతే? `ఛావా` మాత్రం మరాఠా యోధుడు శంభాజీ మహారాజ్ జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన చారీత్రాత్మక చిత్రం.
ఈ రెండు సినిమాలు ఇంత పెద్ద విజయం సాధించడానికి కారణం ఏంటి? అంటే దేశభక్తి నేపథ్యం కావడం సహా బలమైన కథలు కావడంతోనే సాధ్యమైందని చాలా మంది భావిస్తున్నారు. అయితే ఈ అభిప్రాయాలను నటుడు విక్కీ కౌశల్ ఖండించాడు. దేశ భక్తి..సినిమా విజయాలకు ఇది ఒక ఫార్ములా కాదన్నారు. అలా భావిస్తే గనుక అవమానించడమే అవుతుందన్నారు. దేశభక్తి అన్నది నిర్వచించలేని అనుభూతిగా పేర్కొన్నారు. ఆ భావనను నిరంతరం సినిమాలు, సాహిత్యం, క్రీడలతో చాటుకుంటూనే ఉండాలన్నారు. ఇలాంటి చిత్రాలు దేశంపై కేవలం మనకున్న గౌరవం, ప్రేమకు మాత్రమే నిదర్శనమన్నారు.
దేశం గొప్పతనాన్ని ప్రపంచం ముందు చాటి చెప్పడానికి ఇదొక మార్గం మాత్రమే అన్నారు. `ఛావా`లాంటి గొప్ప చిత్రంలో నటించినందుకు తానెంతో గర్వపడుతున్నానన్నారు. మరి విక్కీ కౌశల్ అభిప్రాయంపై నెటి జనులు ఎలా స్పందిసారు? అన్నది చూడాలి. అలాగే రణవీర్ సింగ్ ఎలా స్పందిస్తారు అన్నది కూడా కీలకమై. సినిమా సక్సెస్ లో దేశభక్తి నేపథ్యానికి రణవీర్ సింగ్ ఎంత ప్రాధాన్యతన ఇస్తారు అన్నది అన్నది చూడాలి. `ధురందర్` విషయంలో మరో బాలీవుడ్ స్టార్ హృతిక్ రోషన్ కూడా తన అభిప్రాయాన్ని పంచుకున్న సంగతి తెలిసిందే. సినిమా ను మెచ్చుకుంటూనే చిన్నపాటి చురకలు అంటిచే ప్రయత్నం చేసాడు. ప్రతిగా విమర్శలు ఎదుర్కున్నాడు.
దేశభక్తి నేపథ్యంలో వచ్చిన చిత్రాలన్నీ సక్సస్ అవ్వలేదు అన్నది అంతే వాస్తవం. ఇప్పటి వరకూ వివిధ పరిశ్రమల నుంచి దేశభక్తి నేపథ్యంలో చాలా చిత్రాలొ చ్చాయి. వాటిలో కొన్ని కాన్సెప్ట్ లు మాత్రమే క్లిక్ అయ్యాయి. ఎలాంటి కథకైనా కమర్శియల్ హంగులు అద్దాల్సిందే. కేవలం దేశభక్తిని మాత్రమే హైలైట్ చేస్తే అలాంటి చిత్రాలు రీచ్ అవ్వవు అన్నది అంతే వాస్తవం. గాంధీ, గాడ్సే, ఇందిరా గాంధీ కథలకు ప్రేక్షకుల నుంచి పెద్దగా రెస్పాన్స్ రాని సంగతి తెలిసిందే.
