Begin typing your search above and press return to search.

క‌త్రిన‌తో డేటింగుకి ముందు తెర‌వెన‌క క‌థ‌

కొన్ని ప‌రిచ‌యాలు గ‌మ్మ‌త్తుగా మొద‌ల‌వుతాయి. ఆ త‌ర్వాత అవి పెన‌వేసుకుపోయే బంధాలుగా మార‌తాయి.

By:  Sivaji Kontham   |   15 Nov 2025 5:00 PM IST
క‌త్రిన‌తో డేటింగుకి ముందు తెర‌వెన‌క క‌థ‌
X

కొన్ని ప‌రిచ‌యాలు గ‌మ్మ‌త్తుగా మొద‌ల‌వుతాయి. ఆ త‌ర్వాత అవి పెన‌వేసుకుపోయే బంధాలుగా మార‌తాయి. ముందు ప్రేమ పుట్టుకు వ‌స్తుంది. ఆ త‌ర్వాత మోహ‌మో వ్యామోహ‌మో మొత్తానికి ఆ ఇద్ద‌రినీ క‌లుపుతుంది. చివ‌రికి పెళ్లితో ప్రేమ‌క‌థ సుఖాంతం అవుతుంది.. ఆ త‌ర్వాత పిల్ల‌లు కెరీర్ సాగే జీవితం ఇదంతా మామూలు విష‌య‌మే.

ఇప్పుడు బాలీవుడ్ స్టార్ హీరోయిన్ క‌త్రిన‌తో ప‌రిచ‌యం ఎలా మొద‌లైందో చెప్పుకొచ్చాడు విక్కీ కౌశ‌ల్. ప్రారంభం ఓ అవార్డుల కార్య‌క్ర‌మంలో వేదిక‌పై క‌త్రిన ప‌రిచ‌యం అయింది. ఇద్ద‌రూ క‌లిసి చిక్నీ చ‌మేలి! కి ఆడిపాడారు. ఆ త‌ర్వాత తెర‌వెన‌క్కి వెళ్ల‌గానే హోస్ట్ సునీల్ గ్రోవ‌ర్ త‌న‌కు క‌త్రిన‌ను ప‌రిచ‌యం చేసాడ‌ని విక్కీ చెప్పాడు. తరువాత వారు మళ్ళీ ఒక అవార్డు షోలో కలిశారు. స‌ర‌దాగా సాగిపోయే అవార్డుల కార్య‌క్ర‌మంలో హాస్యంలో భాగంగా విక్కీ వేదికపై కత్రినాకు ప్రపోజ్ చేశాడు. కత్రినా తనకంటే పెద్ద స్టార్ అవుతుందని విక్కీ కౌశల్ చెప్పాడు.

నేను అవార్డు షోలో క‌లిసిన‌ప్పుడు త‌ను షోను ఎలా హోస్ట్ చేయాలో చెప్పింది. అయితే అప్ప‌టికే షో ముగిసింది. నేను చివ‌రికి గుడ్ నైట్ చెప్పాను..! అని నాటి సంఘ‌ట‌న‌ను గుర్తు చేసుకున్నాడు. అలాగే మొద‌టిసారి త‌న‌ను హాయ్ క‌త్రిన అని పిలిచాను... త‌ను కూడా హాయ్ విక్కీ అని పిలిచింది. ఆ త‌ర్వాత ప్రేక్ష‌కుల‌ను ప‌ట్టించుకోకుండా అవార్డుల షోను ఎలా హోస్ట్ చేయాలో నేర్పింది. కానీ అప్పటికే షోను పూర్తి చేసాను అన్నాడు. రెండవ అవార్డు షో సమయంలో కత్రినాను ``విక్కీ లాంటి మంచి వ్యక్తిని నువ్వు ఎందుకు పెళ్లి చేసుకోకూడదు?`` అని అడిగాను. ఆ సమ‌యానికి మేం డేటింగులో లేము.. నిజం ఏమిటంటే ఆ షోలో అది వేదికపై ఒక హాస్యం.. ఏ హీరోయిన్ వచ్చినా, నేను వారిని ఈ ప్రశ్న అడగాల్సి వచ్చింది. కాబట్టి షో జరిగిన ఆ రాత్రి నేను కత్రినాను అడగలేదు.. నేను చాలా మంది నటీమణులను అదే ప్రశ్న అడిగాను.. కానీ నేను, కత్రినా ఉన్న క్లిప్ మాత్రమే వైరల్ అయింది! అని విక్కీ కౌశల్ తెలిపాడు.

చివ‌రికి క‌త్రిన‌- విక్కీ క‌లిసి న‌టించారు. డేటింగ్ కూడా మొద‌లైంది. 9 డిసెంబర్ 2021న వివాహం చేసుకున్నారు. 7నవంబర్ 2025న ఈ జంట తమ మొదటి బిడ్డకు జన్మనిచ్చారు. క‌త్రిన‌- విక్కీ అన్యోన్య దాంప‌త్యం అంద‌రికీ స్ఫూర్తిగా నిలుస్తోంది.