విక్కీ కౌశల్ - కత్రినా కైఫ్ 265 కోట్ల సామ్రాజ్యం!
నటిగానే కాకుండా పారిశ్రామికవేత్తగా కత్రినా ప్రతి ఏటా కోట్ల రూపాయల లాభాలను ఆర్జిస్తోంది. దీనికి తోడు పలు ప్రముఖ గ్లోబల్ బ్రాండ్లకు అంబాసిడర్‌గా వ్యవహరిస్తూ భారీగా పారితోషికం అందుకుంటోంది.
By: Srikanth Kontham | 16 May 2026 2:00 PM ISTబాలీవుడ్ స్టార్ కపుల్స్ విక్కీ కౌశల్ - కత్రినా కైఫ్ సంపాదన -ఆస్తుల పరంగానూ అత్యంత విజయవంతమైన జంటగా దూసుకుపోతున్నారు. ప్రస్తుతం ఇద్దరి ఉమ్మడి ఆస్తుల విలువ దాదాపు 265 కోట్ల రూపాయలకు చేరినట్లు తాజా నివేదికలు వెల్లడిస్తున్నాయి. సినిమాల ద్వారానే కాకుండా బ్రాండ్ ఎండార్స్‌మెంట్లు, స్టార్టప్ పెట్టుబడులు, సొంత వ్యాపారాల ద్వారా జంట భారీ ఆర్థిక సామ్రాజ్యాన్ని నిర్మించుకుంటుంది. స్టార్ కపుల్ ఆస్తులలో అత్యంత ప్రధానమైనది ముంబైలోని జుహూ ప్రాంతంలో ఉన్న వారి విలాసవంతమైన సీ-ఫేసింగ్ అపార్ట్‌మెంట్.
అరేబియా సముద్రం కనిపించేలా ఉండే ఈ లగ్జరీ హోమ్ కోసం వారు నెలకు లక్షల రూపాయల అద్దె చెల్లిస్తున్నట్లు సమాచారం. అనుష్క శర్మ - విరాట్ కోహ్లీల నివాసానికి సమీపంలోనే ఉన్న ఈ ఇంటి ఇంటీరియర్స్ , వ్యూస్ సోషల్ మీడియాలో సైతం పలుమార్లు వైరల్ అయ్యాయి. దీనితో పాటు ముంబై , లండన్ లలో కూడా సొంత ఇళ్లు ఉన్నట్లు తెలుస్తోంది. వ్యాపార రంగంలో కత్రినా కైఫ్ సాధించిన విజయం నెట్ వర్త్ పెరగడానికి ముఖ్య కారణం. ఆమె స్వంతంగా ప్రారంభించిన కే బ్యూటీ కాస్మెటిక్స్ బ్రాండ్ ప్రస్తుతం భారతదేశంలో అత్యంత విజయవంతమైన బ్రాండ్లలో ఒకటిగా నిలిచింది.
నటిగానే కాకుండా పారిశ్రామికవేత్తగా కత్రినా ప్రతి ఏటా కోట్ల రూపాయల లాభాలను ఆర్జిస్తోంది. దీనికి తోడు పలు ప్రముఖ గ్లోబల్ బ్రాండ్లకు అంబాసిడర్‌గా వ్యవహరిస్తూ భారీగా పారితోషికం అందుకుంటోంది. మరోవైపు నటుడిగా విక్కీ కౌశల్ కెరీర్ గ్రాఫ్ కొన్నేళ్లుగా అద్భుతంగా దూసుకుపోతోంది. వైవిధ్యమైన పాత్రలతో మెప్పిస్తున్న విక్కీ ప్రస్తుతం బాలీవుడ్‌లో అత్యధిక పారితోషికం తీసుకునే యువ హీరోలలో ఒకరిగా నిలిచారు. సినిమాకు ఆయన భారీ మొత్తాన్ని ఛార్జ్ చేయడంతో పాటు పదుల సంఖ్యలో ఉన్న బ్రాండ్ ఎండార్స్‌మెంట్ల ద్వారా కూడా ఆయన సంపాదన గణనీయంగా పెరిగింది.
రియల్ ఎస్టేట్ -ఇతర సురక్షిత ఫైనాన్షియల్ అసెట్స్‌లో కూడా విక్కీ పెద్ద మొత్తంలో పెట్టుబడులు పెట్టినట్లు తెలుస్తోంది. ఈ జంటకు విలాసవంతమైన కార్లు సేకరించడం కూడా అలవాటుగా ఉంది. గ్యారేజీలో రేంజ్ రోవర్ ఆటోబయోగ్రఫీ, ఆడి క్యూ7, మెర్సిడెస్ బెంచ్ ఈ-క్లాస్ , వోల్వో ఎక్స్‌సి90 వంటి అత్యంత ఖరీదైన లగ్జరీ కార్లు ఉన్నాయి. ఎక్కడికి వెళ్లినా జంట తమ సొంత విలాసవంతమైన వాహనాల్లోనే ప్రయాణిస్తూ కెమెరా కంటికి చిక్కుతుంటారు. శారీరక శ్రమ , లగ్జరీ రెండింటికీ సమ ప్రాధాన్యత ఇచ్చే జీవనశైలి వీరిది.
విక్కీ కౌశల్ - కత్రినా కైఫ్ కేవలం తెరపైనే కాదు. నిజ జీవితంలోనూ పవర్‌ఫుల్ అండ్ సక్సెస్‌ఫుల్ జంటగా నిలిచారు. తమ కష్టార్జితంతో ఇంతటి భారీ సామ్రాజ్యాన్ని సృష్టించుకున్న ఇద్దరూ ఎక్కడా గర్వాన్ని ప్రదర్శించకుండా ఎంతో నిరాడంబరంగా ఉండటం ప్రత్యేకత. 2026లో కూడా వరుస చిత్రాలతో బిజీగా ఉన్న జంట రాబోయే రోజుల్లో ఆర్థిక సామ్రాజ్యాన్ని మరిన్ని వందల కోట్లకు విస్తరించడం ఖాయంగా కనిపిస్తోంది.
